Ahmadabad, NOV 18: వన్డే ప్రపంచ కప్ ఫైనల్ (WC Final) కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. మెగా టోర్నీలో (World Cup) ఒక్క ఓటమెరుగని భారత జట్టు(Team India) మూడోసారి ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలవగా.. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా(Australia) గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది. అయితే.. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో టీమిండియా టాపార్డర్‌కు, కంగారూ జట్టు బౌలింగ్ యూనిట్ మధ్య ఆసక్తికర పోరు ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఐదుగురి మధ్య ‘నువ్వా నేనా’ అనే రేంజ్‌లో ఫైట్ సాగుతుందని శనివారం ఐసీసీ ఒక పోస్ట్ పెట్టింది. విరాట్ కోహ్లీ VS హేజిల్‌వుడ్, రోహిత్ శర్మ VS మిచెల్ స్టార్క్, (Rohit sharma Vs stark) కుల్దీప్ యాదవ్ VS గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ VS రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ VS డేవిడ్ వార్నర్ పోరు టైటిల్ విజేతను నిర్ణయిస్తుందని ఐసీసీ (ICC) తెలిపింది.
We take a look at five mouth-watering match-ups that will be pivotal during the #CWC23 Final between India and Australia ⬇️https://t.co/Jto6gs407b
— ICC (@ICC) November 18, 2023
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడడం ఇది రెండోసారి. 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ పైచేయి సాధించింది. ఈసారి భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన 20 ఏండ్ల క్రితం ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరుకు బీసీసీఐ (BCCI)అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదండోయ్.. బిగ్ ఫైట్ సందర్భంగా ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్లను సన్మానించనుంది.
మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిశాక వీళ్లందరికీ స్పెషల్ బ్లేజర్లు(Special Blazers) అందజేస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. టీమిండియాకు ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్(Kapil Dev), మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)లతో పాటు క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), అలన్ బోర్డర్(ఆస్ట్రేలియా), అర్జున రణతుంగ(శ్రీలంక), స్టీవ్ వా(ఆస్ట్రేలియా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), మైఖేల్ క్లార్క్(ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్)లు అహ్మదాబాద్ స్టేడియంలో సందడి చేయనున్నారు.