Hyderabad, March 26: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ, ప్రత్యక్ష రాజకీయాల్లోనూ బిజీగా ఉంటూ, అన్‌స్టాపబుల్ వంటి టాక్ షోను (Unstopble) హోస్ట్ చేస్తూ వివిధ పాత్రలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ అభిమానులకు, బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. దేశంలో ఎంతో ఆదరణ దక్కించుకున్న ఐపీఎల్ టీ20 2023 టోర్నీ కోసం బాలయ్య ఈసారి కామెంటేటర్‌గా (IPL Commentator) మారుతున్నాడు. TATA IPL 2023ని ప్రముఖ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు, కోట్లాది క్రికెట్ అభిమానులకు ఈ ఐపీఎల్‌ను మరింత చేరువ చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ హీరో బాలకృష్ణతో (Nandamuri Balakrishna) భాగస్వామ్యం అయ్యింది. ఏపీ, తెలంగాణ వంటి కీలక మార్కెట్లలో క్రికెట్‌ను మరింతగా జనాల్లోకి తీసుకోళ్లటంతో పాటు.. క్రీడల పట్ల ప్రజాదరణ పెంచుకోవడానికి స్టార్ స్పోర్ట్స్ చేస్తున్న నిరంతర ప్రయత్నంలో ఈ అసొయేషన్ ఒక భాగం.
#NandamuriBalakrishna teams up with @StarSportsTel to raise the “SHOR” on TATA IPL 2023
Star Sports has teamed up with superstar Nandamuri Balakrishna to bring millions of Cricket fans an unmatched viewing experience of TATA IPL 2023, on Star Sports Telugu. The association… pic.twitter.com/qsPmu267tI
— Nandamurifans.com (@Nandamurifans) March 26, 2023
హీరో బాలకృష్ణకి క్రికెట్ అంటే అభిమానం. ఆయన తన కాలేజీ రోజుల్లో ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి క్రికెట్ ఆడారు. అటు సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించారు. క్రీడలను, వినోదాన్ని మిక్స్ చేసి ‘‘ఇన్‌క్రెడిబుల్ యాక్షన్.. ఆట అన్‌స్టాపబుల్’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ ప్రేక్షకులకు సరికొత్త స్థాయిలో వినోదాన్ని అందించనుంది. క్రికెట్ అభిమానులు ఈ IPL సీజన్‌లో గతంలో కంటే కూడా ఎక్కవ వినోదాన్ని ఆశించొచ్చు.
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్స్ వేణుగోపాల్ రావు, MSK ప్రసాద్‌లతో పాటు ఈసారి బాలకృష్ణ కూడా కామెంటరీ బాక్స్‌ను షేర్ చేసుకోబోతున్నారు. ఆయన తనదైన శైలితో క్రికెట్ పై అభిమానుల్లో ఆసక్తిని పెంచనున్నారు. అంతేకాదు.. #AskStar ద్వారా అభిమానులు తొలిసారిగా నేరుగా టీవీ లైవ్‌లో పాల్గొనే గొప్ప అవకాశం కూడా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇక బాలకృష్ణలోని సరికొత్త కోణాన్ని తెలుగులో వీక్షించేందుకు తెలుగు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులు తెలిపారు. మరి క్రికెట్ సీజన్‌లో బాలయ్య తన కామెంటరీతో ఎలాంటి సందడి చేయబోతున్నాడో చూడాలి.