WTC Final 2023 (PIC @ ICC Twitter)

New Delhi, June 09: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ (WTC Final) మ్యాచ్‌పై ఆస్ట్రేలియా (Australia) ప‌ట్టు సాధించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో ల‌బుషేన్‌(41), కామెరూన్ గ్రీన్‌(7)లు ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) రెండు వికెట్లు తీయ‌గా, ఉమేశ్ యాద‌వ్‌ (Umesh Yadav), మ‌హ్మ‌ద్ సిరాజ్‌(Mohammed Siraj) లు చెరో వికెట్ ప‌డ‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని క‌లుపుకుని ఆస్ట్రేలియా ప్ర‌స్తుతం 296 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది.

దీంతో ఆస్ట్రేలియాకు 173 ప‌రుగుల కీల‌కమైన మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్ర‌స్తుతం ప‌టిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు వీలైనంత వేగంగా ప‌రుగులు చేసి డిక్లేర్ చేసే అవ‌కాశం ఉంది. బ్యాటింగ్‌కు క‌ష్టంగా మారుతున్న పిచ్‌పై 350 ప‌రుగులకు పైగా ల‌క్ష్యాన్ని ఛేదించాల్సి వ‌స్తే టీమ్ఇండియాకు క‌ష్ట‌మే.

 

టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్ ముగియ‌డంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. అయితే.. ఆరంభంలోనే మ‌హ్మ‌ద్ సిరాజ్ గ‌ట్టి షాక్ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై రెండు ప‌రుగులు చేరాయో లేదో పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తూ డేవిడ్ వార్న‌ర్(1) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. మ‌రో ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా(13)ని ఉమేశ్ యాద‌వ్ బోల్తా కొట్టించాడు. 24 ప‌రుగుల‌కే ప‌రుగుల‌కే ఓపెన‌ర్లు ఇద్ద‌రు ఔట్ అయ్యారు.