రాష్ట్రీయం
Frog In Beer Bottle: బీరు సీసాలో కప్ప..మందుబాబులు తస్మాత్ జాగ్రత్త, బీరులో ప్రత్యక్షమైన కప్ప..వీడియో ఇదిగో
Arun Charagondaనిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేయగా అందులో కప్ప ప్రత్యక్ష్యమైంది. దీంతో ఆ మందుబాబు ఖంగుతిన్నాడు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MLA Madhavi Reddy vs Suresh Babu: నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కడప మేయర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, రసాభాసగా మారిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం
Hazarath Reddyకడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాధవి హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఎమ్మెల్యే మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు.
DGP Dwaraka Tirumala Rao: గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థలో తప్పులు జరిగాయి..ఎంపీని సైతం తీసుకెళ్లి కొట్టారు, డీజీపీ ద్వారకా తిరుమల రావు సంచలన కామెంట్
Arun Charagondaఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి.. ఒప్పుకుంటున్నాం అన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. తప్పులను సరిదిద్దడంపై దృష్టిపెట్టాం అని.. 2017లో తెచ్చిన ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని, గత 5 ఏళ్ళలో ఎందుకు వాడకుండా పక్కన పడేసారో అర్ధం కావటం లేదు అన్నారు.
YS Jagan Slams Chandrababu Govt: సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారు, ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మండిపడిన జగన్
Hazarath Reddyఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
YS Jagan Slams AP Govt: ఏపీలో అత్యంత దారుణమైన పరిస్థితులు, స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా ఈ దారుణాలు చూసి ఉండరని మండిపడిన వైఎస్ జగన్
Hazarath Reddyఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ED Notices To former Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్, మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ నోటీసులు...వివరణ
Arun Charagondaమాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. గత ఏడాది జూన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై సోదాలు జరిపింది ఈడీ. 12 మెడికల్ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారనే అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు...45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించింది.
Telangana Shocker: సిరిసిల్లలో దారుణం, కొడుకు అప్పు తీర్చలేదని తల్లిని కిడ్నాప్ చేసిన గుత్తేదారు, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyకొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.
Food Safety Inspections: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టి అధికారుల తనిఖీలు, కృతుంగ రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తింపు..వీడియో
Arun Charagondaహైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మూసాపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
Andhra Pradesh: వైసీపీ సంచలన నిర్ణయం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు కీలక ప్రకటన, కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలనపై మండిపాటు
Hazarath Reddy‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు.
Andhra Pradesh: వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు, అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyపులివెందులకు చెందిన వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు నమోదయింది. నెల రోజుల క్రితం తనపై రవీంద్రరెడ్డి అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన ఎమ్మెల్యే.
Aghori At Srikalahasti Temple: శ్రీకాళహస్తిలో మహిళ అఘోరి హల్‌చల్, పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం, నీళ్లు పోసిన పోలీసులు...వైరల్ వీడియో
Arun Charagondaశ్రీకాళహస్తిలో మహిళా అఘోరి హల్ చల్ చేశారు. ఆలయంలోకి వెళ్ళేందుకు యత్నించింది అఘోరి. అయితే అఘోరిని అడ్డుకున్న ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తన మీద, తన కార్ మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించుకునేందుకు యత్నించగా అఘోరిపై నీళ్ళు పోశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CM Revanth Reddy Sand Art In Puri Beach: పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఒడిశాలోని సముద్ర తీరం పూరీ బీచ్ లో సైకత శిల్పాన్ని వేయించి తన అభిమానాన్ని చాటారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Merugu Nagarjuna Case: మేరుగు నాగార్జున కేసులో ఫిర్యాదుదారుకి హైకోర్ట్ షాక్, తప్పుడు కేసు పెట్టినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిక, విచారణ 12కి వాయిదా
Hazarath Reddyవైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని, కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు హైకోర్టుకి (Andhra Pradesh high court) నివేదించారు.
Weather Forecast: తమిళనాడుకు మరో తుపాను ముప్పు, వచ్చే 48 గంటల్లో అల్లకల్లోలంగా మారనున్న బంగాళాఖాతం, తెలుగు రాష్ట్రాలకు 4 రోజులు పాటు వర్ష సూచన
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను గత నెలలో వణికించిన వానలు మళ్లీ వణికించేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Weather Forecast for Telugu States) ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Hydra Team To Visit Bangalore: బెంగళూరుకు హైడ్రా బృందం, రెండు రోజుల పాటు పర్యటన, బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం
Arun Charagondaహైడ్రా బృందం ఇవాళ బెంగళూరులో పర్యటించనుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించి అక్కడి చెరువుల పునరుజ్జీవనంపై అధ్యయనం చేయనున్నారు అధికారులు.
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు మర్యాదలు, ఏడుగురు పోలీసుల సస్పెండ్, సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు..వైరల్‌గా మారిన వీడియో, ఉన్నతాధికారుల చర్యలు
Arun Charagondaవైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు మర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు తీసుకెళ్లిన పోలీసులు. అతనితో సరదాగ మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు పోలీసులు.
TTD: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభం, త్వరలో నివేదిక ఇవ్వనున్న సిట్
Arun Charagondaతిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. నిన్న అమరావతి లో సమావేశమయ్యారు సిట్ సభ్యులు. ఇప్పటికే సిట్‌లో సభ్యులుగా సీబీఐ నుంచి సీబీఐ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్.వీరేష్‌ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ ఆర్.మురళీ ఉండగా ఏపీ ప్రభుత్వం నుంచి సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. అహార భద్రతా సంస్థ నుంచి ఇంకా సభ్యుడి నియామకం జరుగలేదు.
Drunk And Drive Cases: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు, 27 మందికి పారిశుద్ధ్య పనులు చేయాలని ఆదేశం..
Arun Charagondaడ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని మంచిర్యాల కోర్టు తీర్పునిచ్చింది. మంచిర్యాల కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh: ఏపీ మంత్రి సవిత మంచి మనసు, రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలింపు, మంత్రిని అభినందించిన స్థానికులు..వీడియో
Arun Charagondaగుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై APSRTC బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు... అదే సమయంలో అటుగా వెళుతున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను హాస్పటల్‌కి తరలించారు. గాయపడిన వారిని తరలించేందుకు తన వాహనాలు వెళ్లడంతో మంత్రి... అక్కడికి సమీపంలోని తన ఇంటికి నడుచుకొంటూ వెళ్ళిపోయారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు సాయపడిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.