రాష్ట్రీయం

Pawan Kalyan Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వక భేటీ, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సమావేశం

Hazarath Reddy

Jogi Ramesh: నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Hazarath Reddy

మైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు.

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

Hazarath Reddy

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కొరగా ఝళిపిస్తోంది. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు.

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Advertisement

Harish Rao: విద్యా హక్కు చట్టం దుర్వినియోగం, సమగ్ర కుటుంబ సర్వే నుండి టీచర్స్‌ను మినహాయించండి..సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు డిమాండ్

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘననే. 36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ 1.11.2024 నాడు విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం. ఉదయం 9 గంటల నుండి మ. 1 గంటల వరకే (ఒంటి పూట) పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

Bhatti Vikramarka: పదేళ్లలో తెలంగాణను ధ్వంసం చేశారు, అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం..ప్రజలు స్వేచ్ఛగా బతకలేని స్థితికి తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్

Arun Charagonda

పదేళ్లు పాలించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పి ఏం చేశారో మనకు తెలుసు అన్నారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు...రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను స్వేచ్చగా బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారు అన్నారు.

Adilabad: తెలంగాణలో కులగణనను నిషేధించిన గ్రామస్థులు, ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కులగణన ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కులగణనను నిషేధించారు గ్రామస్థులు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

YS Sharmila: మీకు ఓట్లు వేయడమే ప్రజలు చేసిన పాపమా?, కరెంట్ ఛార్జీల పెంపు సరికాదన్న వైఎస్ షర్మిల..మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపు

Arun Charagonda

విద్యుత్ ఛార్జీల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అని మండిపడ్డారు.

Advertisement

Pawan Kalyan: పిఠాపురంలో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇల్లుతో పాటు క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు సమాచారం!

Arun Charagonda

పిఠాపురంలో 12 ఎకరాలు కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ క‌ళ్యాణ్‌. ఆయ‌న త‌ర‌పున రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌ తోట సుధీర్‌.కొత్త స్థ‌లంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్టు స‌మాచారం. తాను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని ఎన్నిక‌ల స‌మ‌యంలో పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Telangana Caste Census: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం, హైదరాబాద్‌లో ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లు అందజేత

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అయింది. ఆయా జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లు అందజేశారు మంత్రి పొన్నం.

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్

Arun Charagonda

గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ - గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్...గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు - కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అన్నారు.

Nalgonda: కోదాడలో దారుణం, మహిళ గొంతు కోసిన ఆర్‌ఎంపీ డాక్టర్, అక్రమ సంబంధమే దాడికి కారణమని అనుమానం..బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం నయనగర్ లో రేణుక అనే మహిళ గొంతు కోశారు ఆర్‌ఎంపీ. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం బాధితురాలిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

TTD Chairman BR Naidu: టీటీడీ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణస్వీకారం చేసిన బొల్లినేని రాజ‌గోపాల్ నాయుడు, అనంతరం వరాహ స్వామిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయుడు..

Arun Charagonda

టీటీడీ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణస్వీకారం చేశారు బొల్లినేని రాజ‌గోపాల్ నాయుడు. ఆయ‌న‌తో ఆలయంలో ప్రమాణం చేయించారు ఈవో శ్యామలరావు. ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఛైర్మన్‌తో పాటు సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు.

YS Vijayamma: జగన్‌పై తప్పుడు ప్రచారం సరికాదు, నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం లేదు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తు పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ విజయమ్మ హెచ్చరిక

Arun Charagonda

తనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదు అని మండిపడ్డారు.

Telangana: రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం, హైజీన్ కేర్‌ పరిశ్రమలో చెల‌రేగిన మంట‌లు..నేలమట్టం అయిన నూతనంగా నిర్మించిన షెడ్డూ

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజీన్ కేర్‌ పరిశ్రమలో అర్థరాత్రి మంట‌లు చెలరేగాయి. మంట‌లు చెల‌రేగ‌డంతో క్ష‌ణాల్లో నేల‌మ‌ట్టం అయింది నూతనంగా నిర్మించిన షెడ్డు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం తప్పింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమ‌ని అంచ‌నా వేస్తుండగా ఐదు ఫైర్ ఇంజ‌న్‌లతో మంట‌ల‌ను అదుపు చేసేందుకు శ్ర‌మిస్తోంది ఫైర్ సిబ్బంది.

Rahul Gandhi: దేశంలో ఇంకా కుల వివక్ష ఉంది, నిజం మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు...ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Arun Charagonda

ఈ దేశంలో కులాలు ఉన్నాయి. అదేవిధంగా కుల వివక్షలు ఉన్నాయని కూడా అందరికీ తెలుసు అన్నారు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాను ఈ నిజాలు మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నానని పీఎం నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు.

Advertisement

Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, అఘోరి నాగసాధుకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఏపీ డీజీపీని కోరిన న్యాయ‌వాది, పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని తెలిపిన అఘోరీ

Hazarath Reddy

నక్కపల్లి టోల్‌గేట్ వ‌ద్ద లేడి అఘోరి నాగసాధుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆన్‌లైన్‌లో డీజీపీని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ కోరారు. అఘోరికి రక్షణ క‌ల్పించాల‌ని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్ధమవుతున్నారు.

Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపిన లేడీ అఘోరీ, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వెల్లడి

Hazarath Reddy

పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.

Andhra Pradesh Horror: తిరుపతి జిల్లాలో దారుణం, స్కూలు నుంచి వస్తున్న దళిత బాలికకు వేధింపులు, గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

తిరుపతి జిల్లా లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెర్రావారిపాలెంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా పదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. కామాంధుడు చాకుతో దాడి చేసి... మత్తు నీళ్లు తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Hyderabad Horror: మధురానగర్‌లో దారుణం, బట్టలు ఉతకాలంటూ మహిళను రూంకి తీసుకువెళ్లి కామాంధులు సామూహిక అత్యాచారం

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్‌ పరిధిలో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
Advertisement