రాష్ట్రీయం

Andhra Pradesh Shocker: మూడో తరగతి చిన్నారిని స్కూలు రూంలోకి తీసుకువెళ్లి టీచర్ దారుణం, తొడ కొరుకుతూ తాకరాని చోట తాకుతూ నీచ ప్రవర్తన

Hazarath Reddy

ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్‌ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.

Bakka Judson on CM Revanth Reddy: నువ్వు సచ్చిపోతే నీ శవాన్ని కూడా కొడంగల్‌కు రానియ్యరు, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాల్లో ఎక్కడినుండి పోటీ చేసినా గెలవడు. ఛాలెంజ్ చేస్తున్నా సెక్యూరిటీ లేకుండా కొడంగల్ వచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటూ సవాల్ విసిరారు.

Bikes Theft Caught on Camera: వీడియో ఇదిగో, స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి రెండు బైకులను ఎత్తుకెళ్లిన దొంగలు

Hazarath Reddy

గచ్చిబౌలిలో నడుచుకుంటూ వచ్చి రెండు బైకులు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్సీయూ బస్ డిపోకు ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ లో ఈరోజు తెల్లవారుజామున గుర్తుతెలియని ఇద్దరు దుండగులు హెల్మెట్లు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చారు.

Hyderabad: హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు బైకుతో వెళితే జేబులు గుల్లే, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గత మూడు రోజుల్లో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు రైడర్లు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ పి.విశ్వప్రసాద్‌ సోమవారం పేర్కొన్నారు.

Advertisement

Miscreants Vandalize Hanuman Temple in Hyderabad: హిందూ ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం

Rudra

హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ ఘటనను మరిచిపోకముందే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

Devara On Netflix: జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవ్వనుందంటే?

Rudra

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Nagula Chavithi 2024: నేడే నాగుల చవితి పండుగ. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ కార్డ్స్ తో మీ బంధు, మిత్రులకు విషెస్ తెలియజేయండి.

Rudra

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభంలో జరుపుకునే పండుగ నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి నేడే.

Auto Drivers Dharna: నేడు ఇందిరా పార్క్‌ లో ఆటో డ్రైవర్ల మహాధర్నా.. పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Rudra

మహాలక్షి పథకంలో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో తమకు గిరాకీలు రావట్లేదని, తమ కుటుంబాలు రోడ్డుమీదకు వచ్చాయని తెలంగాణలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Attack On Milk Boy: తన దగ్గర పనిచేసి స్వయంగా పాలు అమ్ముతున్నాడని బాలుడిపై వ్యక్తి దాడి.. మందమర్రిలో ఘటన (వీడియో వైరల్)

Rudra

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామంలో పాల మాఫియా చెలరేగిపోతున్నది. శాంతినగర్ గ్యారెజ్ లైన్ కు చెందిన అభిలాష్ అనే బాలుడిపై పాల మల్లేశ్ దాడి చేశాడు.

RBI 2000 Notes: ఇంకా ప్రజల దగ్గరే రూ.6,970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా ప్రకటన

Rudra

ఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి.

Ex Minister Reddi Satyanarayana Passed Away: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. అనారోగ్య కారణలతో మృతి.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా గుర్తింపు

Rudra

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో ఆయన గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు.

Harish Rao Slams Congress: దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఘనత కేసీఆర్‌దే, కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటుందని హరీష్ రావు విమర్శలు

Hazarath Reddy

24 గంటల పాటు కరెంట్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు.

Advertisement

Bandi Sanjay on 2028 Telangana Elections: తెలంగాణలో 2028లో ఎగిరేది బీజేపీ జెండానే, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్ గా సమావేశమయ్యారు.

YouTuber Harsha Sai: బెయిల్ రావడంతో విదేశాల నుంచి హైదరాబద్‌కు వచ్చిన యూట్యూబర్ హర్ష సాయి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షమైన వీడియో ఇదిగో..

Hazarath Reddy

గతకొన్నాళ్లుగా విదేశాలలో ఉన్న హర్ష సాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయి.

CM Ramesh on YSRCP: ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భగవంతుడు శిక్ష వేసినా వారికి భయం లేదు, అంబటి రాంబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఎంపీ సీఎం రమేష్

Hazarath Reddy

TS TET Notification 2024: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల,2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు, నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

Hazarath Reddy

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి విదితమే.

Advertisement

AP TET Results 2024 Out: ఏపీ టెట్ ఫలితాల విడుదల, మీ రిజల్ట్స్ aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోండి, అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు

Hazarath Reddy

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) విడుదల చేశారు. అక్టోబర్‌ 3 నుంచి 21వ వరకు టెట్‌ పరీక్షలు (AP TET Exam) జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్‌ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Medak Horror: వీడియో ఇదిగో, ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి తెగబడిన ప్రేమోన్మాది, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో బాధితురాలు

Hazarath Reddy

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు.

Telangana Road Accident: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న బస్సును వెనక నుండి ఢీకొట్టిన మరో బస్సు, 30 మందికి గాయాలు

Hazarath Reddy

కోదాడ సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్‌ 2) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి.

Andhra Pradesh Horror: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం, ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ వైరు తగిలి నలుగురు యువకులు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజ‌వ‌రం మండ‌లం తాడిప‌ర్రు గ్రామంలో పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఈ విషాద‌ ఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement
Advertisement