రాష్ట్రీయం

Hyderabad Horror: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. హైదరాబాద్ లో ఘోరం

Rudra

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్‌ తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.

Lady Aghori: కీసరగుట్టలో మహిళా అఘోరి, ఒంటి కాలిపై నిలబడి శివుడికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు

Arun Charagonda

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో శుక్రవారం మహిళా అఘోరి ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ మహిళా అఘోరి కొండపైన వెలిసిన శివలింగాలను స్పృశిస్తూ శివలింగాన్ని తాకి ఆనంద పరవశంలో ఒంటి కాలిపై నిలబడి ఆ దేవదేవుడిని ధ్యానించారు.

Chaddi Gang In Ongole: ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్..35 టీంలు,400 మంది పోలీసులతో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు

Arun Charagonda

ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. రామ్ నగర్ లోని నర్సింగ్ కాలేజిలో రూ.50 వేలు ఎత్తికెళ్లారు దొంగలు. రావు అండ్ నాయుడు ఇంజనిరింగ్ కాలేజిలోకి కూడా చొరబడింది చెడ్డి గ్యాంగ్. 35 టీములు, 400 మంది పోలీసులు తనిఖీలు చేపట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని అలర్ట్ చేశారు పోలీసులు.

Pochamma Temple Vandalized: హైదరాబాద్ మీర్ పేట లో పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం.. దుండగుడిని చితకబాదిన స్థానికులు (వీడియో)

Rudra

ఆందోళన కలిగించేలా ఆలయాల ధ్వంసరచన కొనసాగుతున్నది. హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది.

Advertisement

Hyderabad: పులి కాదు పిల్లి...మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం ఉత్తదే అని తేల్చిన అటవీ శాఖ అధికారులు...

Arun Charagonda

నిన్న మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర చిరుత తిరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది చిరుత కాదు అడవి పిల్లి అని తేల్చేశారు అటవీశాఖ అధికారులు. హైదరాబాద్ - మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులు ఉండగా పోలీసులకు సమాచారం అందించారు.

Car Accident: బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. అంతే.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. జనగామలో ఘటన (వీడియో)

Rudra

అతను కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు.

Car Accident: హైదరాబాద్ ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అతివేగంగా వచ్చి రోడ్డుపై పల్టీ కొట్టిన కారు.. యువకులకు గాయాలు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ప్రజాభవన్ ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.

Nude Video Call: తెలంగాణ‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధ‌రాత్రి నగ్నంగా ఉన్న మహిళ నుంచి వీడియో కాల్‌.. కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసుల‌కు ఫిర్యాదు

Rudra

అతనో ఎమ్మెల్యే. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 14న అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత నిద్రకు ఉపక్రమించారు.

Advertisement

Leopard Spotted near Miyapur Metro: వామ్మో హైద‌రాబాద్ లో చిరుత సంచారం, మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక తిరుగుతోంద‌ని వార్తలు, ఫోన్ లో వీడియోలు తీసిన స్థానికులు

VNS

అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వెనుక భాగంలో చిరుత సంచరించింది.

Hyderabad: వీడియో ఇదిగో, తన ఆటోలో మందు తాగవద్దు అన్నందుకు డ్రైవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి, పోలీసులపై రాళ్లు విసిరిన మందుబాబులు

Hazarath Reddy

కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ గుడ్ టైం లిక్కర్ స్టోర్ వైన్స్ వద్ద మద్యం మత్తులో యువకుల హల్ చల్.తన ఆటో లో మందు తాగకూడదు అన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి చేసిన మందుబాబులు.మద్యం మత్తులో ఆటో ఓనర్ పై బీర్ బాటిల్ తో దాడి

Viral Video: వీడియో ఇదిగో, రాడ్‌తో ఏటీఎం మిషన్ తెరిచేందుకు ప్రయత్నించిన దొంగ, ఓపెన్ కాకపోవడంతో నిరాశగా అక్కడి నుంచి వెళ్లిన విజువల్స్ వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో తిరుపతి రూరల్ (మం) చెర్లోపల్లిలో జరిగినట్లుగా తెలుస్తోంది. చెర్లోపల్లిలో ఓ దొంగ హిటాచీ ఏటిఎం లో చోరికి విఫలయత్నం చేశాడు.రాడ్ తో మిషన్ తెరెచేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు.

Weather Update: అక్టోబరు 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీపై ప్రభావం ఎంతవరకు అంటే..

Hazarath Reddy

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడు, వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ జారీ చేసింది. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పందించింది.

Advertisement

Telangana: అసలు ఏంటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ? పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

Telangana: అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, ఎగ్జామ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అక్టోబరు 21న నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంతో షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరగనున్నాయి

Gautam Adani Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం అందజేత

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని అందజేశారు. రూ. 100 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు అదానీ.

Chandrababu Slam Jagan: మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని వెల్లడి

Hazarath Reddy

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Advertisement

KTR on Musi River: మూసి బ్యూటిఫికేషన్ కాదు లూసిఫికేషన్, గ్రాఫిక్స్ మాయాజాలంతో నానా తంటాలు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మూసీ రివర్ ప్రాజెక్టుపై కేటీఆర్ పవన్ పాయింట్ ప్రజెంటేషన్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ప్రజలకు తెలిసిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మూసి రివర్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ఏం చేయాలో తెలియక, గ్రాఫిక్స్ మాయాజాలంతో సీఎం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్నారు.

KA Paul: తెలంగాణలోని కొందరు ఎమ్మెల్యేలపై కేసు వేశా, చంపుతామని బెదిరిస్తున్నారు కేఏ పాల్ సంచలన కామెంట్

Arun Charagonda

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణాలో కొంద‌రు ఎమ్మెల్యేలపై కేసు వేశాను...నేను వేసిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలని లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. గతంలోనూ ఇలానే బెదిరింపులు వచ్చాయని... తనని తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు.. పవన్‌కళ్యాణ్ అదే అంటాడు కానీ తగ్గడు అన్నారు.

Hyderabad: అశోక్‌నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థుల అరెస్ట్, జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ ఝుళిపించిన పోలీసులు, మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్

Arun Charagonda

హైదరాబాద్, అశోక్ నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నవారిపై లాఠీలు ఝుళిపించారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Andhra Pradesh: వీడియోలు ఇవిగో, ఉచిత ఇసుక ఎక్కడ బాబు అంటూ జంగారెడ్డిగూడెంలో ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా, ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

జంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసపురం రోడ్‌ బైపాస్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement