రాష్ట్రీయం

Farmers Protest On Rythu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళన, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్, రాజీవ్ రహదారిపై రాస్తారోకో

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శవ యాత్రను ఊరేగింపుగా నిర్వహించి చౌరస్తాలో దగ్ధం చేశారు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.

Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబుకి అవమానం, యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో లేని చంద్రబాబు పేరు...సీఎం పేరునే మర్చిపోయి తప్పు చేసిన అధికారులు

Arun Charagonda

ఏపీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుకు అవమానం జరిగింది. యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును మరిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Vikarabad: గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో

Arun Charagonda

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లో మనప్పురం గోల్డ్ లోన్ లో బంగారం ఎత్తుకెళ్లారు మేనేజర్ విశాల్. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. చోరికి గురైన బంగారం విలువ మూడు కోట్ల 25 లక్షలు ఉన్నట్లు అంచనా. .

Jagtial: యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్.జీ.ఎస్ అనే యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు.తనతోపాటు తన భందువులు ఆరుగురితో పెట్టుబడి పెట్టించారు సంతోష్. సుమారు లక్షాన్నర వరకు మోసం,యాప్ లాక్, అవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.రెండు నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు,ఇంగ్లాండ్ నుండి డబ్బులు వస్తాయని నమ్మించిన మోసగాళ్లు..తీరా యాప్ లాక్ అవడంతో నిండా మోసపోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Raids in Nizamabad: స్టార్ హోటల్స్ లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్.. నిజామాబాద్ లో ఘోరం (వీడియోతో)

Rudra

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Revanth Reddy On Cyber Crimes: పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

AP Jawan Martyred: ఛత్తీస్‌ గఢ్‌ లో అమరుడైన ఏపీకి చెందిన జవాన్‌.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ పార్దీవదేహం

Rudra

ఛత్తీస్‌ గఢ్‌ లో ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ అమరుడయ్యారు.

Nagarjuna Sagar: ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు

Rudra

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతున్నది. ఈ క్రమంలో అటు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు.. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తారు.

Advertisement

Badvel Horror Update: ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు

Rudra

అతనికి పెండ్లయ్యింది. భార్య గర్భిణి. అయితే ఏంటి? ప్రేమ పేరుతో ఆ మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా? అంటూ ఓ ఇంటర్ విద్యార్థినికి అల్టిమేటం జారీ చేశాడు.

Kadapa Horror: ప్రేమ‌ను ఒప్పుకోలేద‌ని యువ‌తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవ‌ర్, క‌డ‌ప‌లో దారుణ ఘ‌ట‌న (వీడియో ఇదుగోండి)

VNS

గోపవరం అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.

Telangana key Announcement Tomorrow:గ్రూప్-1 ప‌రీక్షపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ఇంట్లో కీల‌క చ‌ర్చ‌లు

VNS

మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు.. ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష(Group 1), జీవో 29 అంశంపై (GO 29) చర్చించినట్టు సమాచారం. గ్రూప్‌-1 అభ్యర్థులు (Group -1 Candidates) చేస్తున్న విజ్ఞప్తులు, పరీక్షల వాయిదా సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు

CM Revanth Reddy: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, తిరస్కరించిన బండి, గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి దీక్ష

Arun Charagonda

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జీవో నెంబర్ 29పై చర్చించేందుకు సచివాలయం రావాలని ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు బండి సంజయ్. గ్రూప్ -1 అభ్యర్థులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద దీక్ష చేస్తున్నారు సంజయ్.

Advertisement

Tummala Nageshwarrao: ఈ ఖరీఫ్‌ సీజన్‌కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్‌ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల

Arun Charagonda

ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు అని తేల్చి చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు ₹500 లు బోనస్ ఇస్తాం...పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వం అన్నారు. పంట వేయని భూములకు ₹25 వేల కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది...రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తాం అన్నారు.

Nagarkurnool:  తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన

Arun Charagonda

తన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. నాగర్‌ కర్నూల్‌ - లింగాలలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో గొడవపడ్డారు యువకులు. పీఎస్‌కు తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్‌.. తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్‌ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా పరిస్థితి విషమంగా మారింది.

Secundrabad: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్తత, పోలీసుల లాఠిచార్జీ,ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు...వీడియో ఇదిగో

Arun Charagonda

సికింద్రాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు. ముత్యాలమ్మ గుడి ఘటనలో ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Singireddy Niranjan Reddy: బండి సంజయ్...కేంద్ర సహాయమంత్రా?..సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా?,రేవంత్ కుర్చి గురించి నీకెందుకు బాధని మండిపడ్డ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Arun Charagonda

బండి సంజయ్...కేంద్ర సహాయ మంత్రా ?, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా ? చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రేవంత్ కుర్చీ గురించి .. బండి సంజయ్ కి ఎందుకు బాధ ? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు నిరంజన్ రెడ్డి.

Advertisement

Palakurthi: పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి, తన చావుకు సీఐ,ఎస్‌ఐలే కారణమని సెల్ఫీ వీడియో

Arun Charagonda

పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడంలేదని పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి చెందాడు. చనిపోయే ముందు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ లే.. నా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు.

Palakurthi: పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యా యత్నం, కుటుంబ సమస్యలతో పెట్రోల్‌తో నిప్పంటించుకున్న యువకుడు,కాపాడబోయిన ఎస్సై- కానిస్టేబుల్‌కు గాయాలు

Arun Charagonda

జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను(22) పెట్రోల్ పోసుకొని అగాయత్యానికి పాల్పడ్డారు.

Kurnool:కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం,జలమయమైన లోతట్టు కాలనీలు, నీట మునిగిన వాహనాలు..వీడియో ఇదిగో

Arun Charagonda

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడంతో పట్టణం లోని ప్రధాన కూడలి అయినా సోమప్ప సర్కిల్ ల్లో భారీగా వర్షం నీరు చేరడంతో వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజి నిండి పోవడంతో వర్షం నీరుతో కాలనీలు అంత జలమయమయ్యాయి.

Raids On Chutneys: వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్‌ రెస్టారెంట్ పై కేసు నమోదు

Rudra

హైదరాబాద్‌ లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు.

Advertisement
Advertisement