రాష్ట్రీయం

YS Jagan Visits Anakapalle: అచ్యుతాపురం సెజ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్, బాధితులతో మాట్లాడిన జగన్, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఆరా

Arun Charagonda

అనకాపల్లి సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు మాజీ సీఎం జగన్. బాధితులతో మాట్లాడారు. అక్కడి డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుండి అనకాపల్లికి చేరుకున్నారు జగన్.

MP Dharmapuri Aravind On KCR: కేసీఆర్‌ చచ్చినా బీజేపీలోకి రానిచ్చే ప్రసక్తేలేదు, కేటీఆర్‌- కవితలది అదే పరిస్థితి, తేల్చిచెప్పిన ఎంపీ అరవింద్..

Arun Charagonda

నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించిన ఆయన..కేసీఆర్, కేటీఆర్, కవితను చచ్చినా బీజేపీ దగ్గర్లోకి కూడా రానివ్వం అని తేల్చిచెప్పారు. వేరేటోడు ఎటు పోతే ఏంది? అని తన స్టైల్‌లో చెప్పారు.

Konda Murali Vs Baswaraj Saraiah: వరంగల్ కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు, కొండా వర్సెస్ సారయ్య, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సారయ్యకు కొండా సవాల్

Arun Charagonda

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్ అయ్యారు. తాను పార్టీ మారితే రాజీనామా చేసిన.. నీకు దమ్మ్మంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యకు సవాల్ విసిరారు. బస్వరాజ్ సారయ్య లాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదని ఆరోపించారు కొండా మురళి.

Warangal: గన్‌పారేసుకున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, రోడ్డుపై గన్‌ని గుర్తించి కమిషనర్‌కు అందజేసిన పారిశుధ్య కార్మికుడు

Arun Charagonda

వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో ఎస్ఎల్ఆర్ఎన్ గన్ ను పారేసుకున్నాడు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డుపైన పడిపోయింది గన్. గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించారు. దీంతో తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే.

Advertisement

YS Jagan Gives Shock To Duvvada Srinivas: వైసీపీలో పెను మార్పులు,దువ్వాడకు షాకిచ్చిన జగన్, టెక్కలి ఇంఛార్జీగా పేరాడ తిలక్, కొత్త అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే

Arun Charagonda

ఏపీలో అధికారం కొల్పోవడంతో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు వైసీపీ అధినేత జగన్. కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చారు జగన్‌. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీగా పేరడా తిలక్‌ను నియమించారు.

Viral Video: హైదరాబాద్‌ లో వింత వర్షం.. ఒకే కాలనీలో ఒక పక్క వర్షం.. మరోవైపు పొడి వాతావరణం.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఓ కాలనీలో వర్షం పడింది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా? అయితే, ఆ కాలనీలో ఎదురుగా వర్షం పడుతున్నా అక్కడే ఉన్న స్థానికులు మాత్రం తడవలేదు.

CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ విగ్రహావిష్కరణకు అగ్రనేతలను పిలవనున్న కాంగ్రెస్ నేతలు, పీసీసీ చీఫ్ ఎన్నికపై రానున్న క్లారిటీ!

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అగ్రనేతలు

Telangana Shocker: షాకింగ్ వీడియో, ప్రేమ వ్యవహారం..ఫ్రెండ్‌ అని చూడకుండా చంపేసిన స్నేహితులు, బాలాపూర్‌లో దారుణం, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిబాధ వర్ణనాతీతం

Arun Charagonda

హైదరాబాద్ బాలాపూర్‌లో అమానుషం చోటు చేసుకుంది. యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను హత్య చేశారు స్నేహితులు. బాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు స్నేహితులు. హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Advertisement

Anakapally Pharma Accident: అనకాపల్లిలో మరో ప్రమాదం.. పరవాడ సినర్జీస్‌ ఫార్మా లో రసాయనాలు కలుపుతుండగా ఘోరం.. నలుగురికి గాయాలు

Rudra

ఏపీలోని ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ఘోరం జరిగింది.

Fine Rice For Ration Card Holders: రేష‌న్ కార్డుదారుల‌కు గుడ్ న్యూస్! జ‌న‌వ‌రి నెల నుంచి ఇక‌పై రేష‌న్ షాపుల్లో స‌న్న‌బియ్యం, ప్ర‌క‌టించిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

VNS

రేషన్ కార్డు దారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో (Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు.

Sharmila Slams PM Modi: మోదీ గారూ..మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటుగా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త అదానీని కాపాడేందుకు మోదీ కుటిల యత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

Barrelakka Crying Video: నాకే పాపం తెలియదంటూ ఏడ్చేసిన బర్రెలక్క, ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసింద‌ంటూ వార్త వైరల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తాలూకు ఓ వీడియో నెట్టింట తాజాగా వైర‌ల్ అవుతోంది. అందులో బ‌ర్రెల‌క్క క‌న్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేద‌ని, అత‌నెవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం వీడియోలో క‌నిపించింది.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్ తీసిన యూట్యూబర్, ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

సోషల్ మీడియాలో లైకుల కోసం రోజురోజుకీ యువత చేస్తున్న పిచ్చి పనులు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ యూట్యూబర్ & ఇన్‌స్టాగ్రామర్ అయిన its_me_power రీల్స్ తీశారు.

Telangana: వీడియో ఇదిగో, హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందంటూ నీటితో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Hazarath Reddy

హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీటితో శుద్ది చేశారు. యాదగిరిగుట్ట కొండపైన ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వీడియోలు వైరల్ గా మారాయి.

IMD Alert For Telangana: తెలంగాణ‌కు మ‌రోసారి భారీ వ‌ర్ష సూచ‌న‌, ఐదు రోజుల పాటూ భారీ వ‌ర్షాలుంటాయ‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌, ఈ జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌

VNS

తెలంగాణ‌లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Jagan Slams CM Chandrababu: మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఏపీలో లేవు, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని గురువారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ సందేశం పోస్ట్‌ చేశారు.

Advertisement

Karimnagar: ఓవ‌ర్ లోడ్ అయిన బస్సు, నేను న‌డ‌ప‌లేను బాబోయ్ అంటూ న‌డిరోడ్డుపైనే నిలిపివేసిన ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్, 55 మంది ఎక్కాల్సింది ఏకంగా 110 మంది ఎక్కారంటూ ఆవేద‌న‌

VNS

సామర్థ్యానికి మించి(Overloaded) ప్రయాణికులు ఎక్కడంతో బస్సు నడపడం ఇబ్బందవుతుం దంటూ నడి రోడ్డుపై నిలిపివేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో(Huzurabad) జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్‌ వెళ్తుండగా, హుజూరాబాద్‌ బస్టాండ్‌లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు.

BRS Protest For Runa Mafi: రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు, తుంగతుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులపై రాళ్లదాడి, పలు చోట్ల జర్నలిస్టులపై అటాక్, తీవ్రంగా తప్పుబట్టిన కేటీఆర్, హరీశ్ రావు

Arun Charagonda

రైతుల రుణమాఫీ కోసం కదం తొక్కింది బీఆర్ఎస్. రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్ పిలుపుతో రైతులు కదిలివచ్చారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టారు.

Telangana: 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది, యాక్సిడెంట్ భయంతో నడిరోడ్డు మీద ఆపేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసి బస్సును డ్రైవర్ ఆపేశాడు. హుజురాబాద్ బస్సులో 55 మందికి గాను 110 మంది ఎక్కారని, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్రయాణికులు దిగాలని డ్రైవర్ బస్సును ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Attack On BRS Leaders At Suryapet: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై దాడి, రాళ్లు - కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఖండించిన హరీశ్ రావు

Arun Charagonda

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు హరీశ్ రావు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement