రాష్ట్రీయం
Telangana Farm Loan Waiver: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రైతులు రూ. 2 లక్షల పైన ఉన్న రుణం డబ్బులు కడితే వాళ్లవి మాఫీ చేస్తామని ప్రకటన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్లాన్ రచించింది. అయినప్పటికీ అర్హత ఉండి కూడా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు.
Anakapalle Pharma Company Explosion: అయ్యో..ఒక్కరోజు ఆగినా ప్రాణాలతో బతికేది, సోదరుడికి రాఖీ కట్టి ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన హారిక
Hazarath Reddyమరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది.
YSRCP Opposing Waqf Bill: వక్ఫ్ బిల్లును అంగీకరించేది లేదు, మరోమారు తేల్చి చెప్పిన వైసీపీ అధినేత జగన్, ముస్లిం మైనారిటీలతో భేటీ
Hazarath Reddyవక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
Telangana Group 2 Schedule: తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
Arun Charagondaతెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేయగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
Hydrabad Police On Free Journey: రాత్రివేళ మహిళలకు ఫ్రీ జర్నీ అనేది ఫేక్ న్యూస్, క్లారిటీ ఇచ్చిన పోలీసులు, తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaరాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు పోలీసులు. 1091, 78370 18555 నంబర్‌కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని దీనిని నమ్మవద్దని కోరారు. ఈ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Jagtial Shocker: జగిత్యాలలో దారుణం, హోంవర్క్ పూర్తి చేయలేదని రక్తమొచ్చేలా పాపని కొట్టిన టీచర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని జగిత్యాల్లోని ఎంపీపీఎస్ టీఆర్ నగర్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. హోంవర్క్ పూర్తి చేయనందుకు రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఉపాధ్యాయుడు దారుణంగా శిక్షించడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆ పాపని చెవిపై బలంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం మొదలైంది.
Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం సెజ్ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, 17 మంది మృతి
Hazarath Reddyఅనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
MLC Kavitha Injured: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న కవిత
Arun Charagondaబీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత గైనిక్ సమస్య , వైరల్ జ్వరంతో బాధపడుతుండగా వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
KTR Questions Revanth Reddy: ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా?, సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామంలో మహిళా జర్నలిస్టుల దాడిని ఖండించిన కేటీఆర్
Arun Charagondaవిధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు
Defamation Case: పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీపై ప్రజల్లో అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయంటూ పిటిషన్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది.
Harishrao Slams CM Revanth Reddy: 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్
Arun Charagondaప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలేరులో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు హరీశ్ రావు.
APPSC Group-1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..
Hazarath Reddyగ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది.
Mega Fan Extraordinary Gift To Chiranjeevi: చిరంజీవికి ఫ్యాన్ అదిరే గిఫ్ట్...3D పెయింటింగ్‌లో చిరు ఫోటోలో రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్!
Arun Charagondaమెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదిరే గిఫ్ట్ ఇచ్చారు ఓ అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ కనిపించేలా 3D ఫెయింటింగ్ వేశారు. కుప్పంకు చెందిన కళాకారుడు పురుషోత్తం.. చిరంజీవి ఫోటోలో రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ కనిపించేలా 3D పెయింటింగ్ వేశారు. ఇది అందరిని ఆకట్టుకుంటోంది.
Telangana Shocker: నాలాలో పడి చిన్నారి మృతి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు, నిన్న సాయంత్రం ఆడుకుంటూ నాలాలో పడిక బాలిక, విషాద ఛాయలు
Arun Charagondaనిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలాలో గల్లంతైన బాలిక మృతి చెందింది. బాలిక అనన్య మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఇంటి ముందల ఆడుకుంటుండగా నాలాలో పడింది బాలిక.
Teachers Protest At Praja Bhavan: ప్రజాభవన్ ముందు అర్థరాత్రి టీచర్ల ఆందోళన, జీవో 317 పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్టింగ్‌లు ఇస్తున్నారని మండిపాటు
Arun Charagondaప్రజాభవన్ ముందు అర్ధరాత్రి ఆందోళన టీచర్లు ఆందోళన బాటపట్టారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 317 జీఓ బాధితులు బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని, స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు ధర్నాకు దిగారు.సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడం పై మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
BRS Protests For Runamafi: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరు, యాదాద్రి నుండి హరీశ్ రావు ఆలయాల యాత్ర, 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు
Arun Charagondaవందశాతం రుణమాఫీ అమలు చేయాలని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పట్టనుంది బీఆర్ఎస్. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయనుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నేతలకు ఇవాళ్టి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కార్యకర్తలకు వివరించారు.
Nellore Oil Factory Fire: వీడియో ఇదిగో, అనకాపల్లి పేలుడు జరిగిన గంటల వ్యవధిలో నెల్లూరు ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
Hazarath Reddyఅనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు జరిగిన గంటల వ్యవధిలోనే నెల్లూరు(D) పంటపాలెంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి
Andhra Pradesh Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్
Hazarath Reddyఅచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Anakapalle Pharma Company Explosion: ఆగస్టు 23న అనకాపల్లిలో రియాక్టర్ పేలిన ప్రమాదస్థలానికి జగన్, బాధితులకు అండగా నిలవాలని స్థానిక వైసీపీ నాయకులకు ఆదేశాలు
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై ఏపీ గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి, గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎస్ అబ్దుల్ నజీర్
Hazarath Reddyఅనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీ కర్మాగారంలో జరిగిన పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బుధవారం విచారం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.