రాష్ట్రీయం

Guidelines For Transfer Of Employees: ఏపీలో 15 శాఖల్లో బదిలీలు, గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం, 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి

Arun Charagonda

ఏపీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 5 ఏళ్లు ఒకేచోట పని చేసినవారికి బదిలీ తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.

Harish Rao On Rythu Runa Mafi: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్‌ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్

Arun Charagonda

రైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్‌ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tirumala: తిరుమల కొండపై మందుబాబుల బీభత్సం, గాజు బాటిళ్లతో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

Arun Charagonda

తిరుమల కొండపై మందుబాబులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో కొట్టుకున్నారు. నందకం అతిథిగా గృహం వద్ద గాజు బాటిళ్ళతో దాడి చేసుకోగా ఇద్దరి తీవ్ర గాయాలయ్యాయి. నందకం అతిథిగా గృహం వద్ద ఈ ఘటన జరుగగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Duvvada Srinivas: దువ్వాడ వాణికి టెక్కలి పోలీసుల నోటీస్, పోలీసులతో వాణి వాగ్వాదం, నోటీసులు తీసుకునేందుకు నిరాకరణ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి విషయం రచ్చచెక్కగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట నిరసన చేస్తూనే ఉన్నారు వాణి.

Advertisement

Telangana Tulsi Reddy: 'మౌంట్ ఎల్బ్రస్‌'పై తెలంగాణ వాసి, 5642 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన తులసిరెడ్డి

Arun Charagonda

మౌంట్ ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించారు తెలంగాణ వాసి. ఈనెల 15న యూరప్ ఖండంలోని 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 4 రోజుల్లో పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్ తులసిరెడ్డి స్వస్థలం.

Medak Rains: మెదక్‌లో దంచికొట్టిన వాన, వర్షంలో కొట్టుకు పోయిన బైకులు, బైకుల కోసం పరుగెత్తిన వాహనదారులు..వీడియో వైరల్

Arun Charagonda

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. మెదక్ పట్టణంలో గంటన్నర పాటు ఏకధాటిగా కురిసింది వర్షం. దీంతో మెదక్ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా నిలిచింది వర్షపు నీరు. వర్షంలో బైకులు కొట్టుకుపోగా బైకుల కోసం పరిగెత్తారు వాహనదారులు. మెదక్ లో అత్యధికంగా 12.6 సెం. మీ, పాతురులో 8.6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 9 సెం. మీ, సంగారెడ్డి జిల్లాలో 6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.

Telangana: వివాహేతర సంబంధం, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ది చేసిన బంధువులు, వీడియో వైరల్

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం ముచ్చర్ల గ్రామంలో వివాహేతర సంబంధం బయటపడింది. గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇది గ్రహించిన బంధువులు గంభీరావుపేటలో వివాహిత, శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Telangana Congress: టార్గెట్ కేటీఆర్ - హరీష్‌ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement

Hyderabad Shocker: భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేసిన భర్త, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేశాడు ఓ శాడిస్టు భర్త. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని హుడా కాలనీలో భార్య జ్యోతి(30)ను కత్తితో పొడిచాడు భర్త. తీవ్ర గాయాలతో బాధితురాలు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Feathers in Chicken Curry: కోడి ఈకలు పీకకుండానే చికెన్ కర్రీ.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నవాబ్ హోటల్ లో బయటపడిన నిర్లక్ష్యం (వీడియో)

Rudra

ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేసి, జరిమానాలు వేసినా, హోటల్స్ లైసెన్స్ రద్దు చేసినా మిగతా హోటల్స్ నిర్వాహకుల తీరు మారట్లేదు.

Accident in Nirmal: ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పసిపాప సహా ముగ్గురికి తీవ్ర గాయాలు.. భైంసా పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సంతోషి మాత ఆలయం వద్ద ఇవాళ ఉదయం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆటోని ఢీకొట్టింది.

Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో

Rudra

మానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఎవరో అన్నట్టు.. డబ్బుల కోసం మనుషులు క్రూరత్వానికి తెగబడుతున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు.

Advertisement

Attack on Harish Rao Office: సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్

Rudra

మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన రుణమాఫీ సవాళ్లు ఫ్లెక్సీలను దాటి దాడుల వరకూ చేరుకున్నది.

Hanumakonda: అమెరికాలో మ‌రో తెలుగు యువ‌కుడు మృతి, గుండెపోటుతో మ‌ర‌ణించిన హ‌న్మ‌కొండ వ్య‌క్తి, కొద్దిరోజుల‌ క్రిత‌మే తండ్రి...ఇప్పుడు కొడుకు మ‌ర‌ణంతో విషాదం

VNS

అమెరికాలో మరో తెలుగు యువకుడు (Young Man Died) మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్‌(32) మరణించాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్‌ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే రాజేశ్‌ ఉద్యోగం చేస్తున్నాడు

Telangana LRS Scheme 2024: రుణమాఫీ తరహాలోనే ఎల్‌ఆర్‌ఎస్‌, వారికే వర్తింపు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హెల్ప్‌లైన్‌లను సంప్రదించి మీ దరఖాస్తు స్టేటస్ చెక్‌చేసుకోండి

Arun Charagonda

లేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్(LRS)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయగా తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ సిద్ధం చేసింది.

Nara Lokesh on Red Book: మా గెలుపులో రెడ్ బుక్ కూడా ఒక భాగం, క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్, చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్

Hazarath Reddy

ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి

Advertisement

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక, మరో 5 రోజులు వర్షాలు, విపత్తు సంభవిస్తే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచన

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. బోయిన్‌పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు...విపత్తు సంభవిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు అధికారులు.

Telangana Shocker: సిద్దిపేటలో దారుణం, వదినను గుడి ప్రాంగణానికి కట్టేసిన మరిది, మిత్తి ఇవ్వలేదని అరాచకం

Arun Charagonda

సిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ అన్న వదినను గుడి ప్రాంగణానికి కట్టేశాడు తమ్ముడు. కనకయ్య దగ్గర 1,20,000 అప్పుగా తీసుకున్నారు అన్న పరుశురాములు. తీసుకున్న అప్పు లక్ష చెల్లించగా మిగిలిన 20000 మిత్తి ఇవ్వాలంటూ వదినను అన్నను చెట్టుకు కట్టేశారు మరిది కనకయ్య .

Bandi Sanjay On BRS: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలినమన్న కేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ అని కామెంట్

Arun Charagonda

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్‌ది అన్నారు. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

MLA Paritala Sunitha: పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత, నేల తల్లికి పూజలు...వీడియో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత రైతుగా మారారు. వెంకటాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్బంగా నేల తల్లికి పూజలు చేశారు. అనంతరం తోటి కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు పరిటాల సునీత

Advertisement
Advertisement