రాష్ట్రీయం
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాలు జలమయం
Rudraగత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉన్నది.
Astrologer Venu Swamy Viral Video: నాకు ఆత్మహత్యే శరణ్యం..ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియో విడుదల..
sajayaప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ వేధింపుల వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సదరు టీవీ ఛానల్ కు చెందిన జర్నలిస్టు తమ నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నారని ఆ డబ్బు ఇవ్వకపోతే తమను మరింత అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆయన ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
Tragedy on Raksha Bandhan: వీడియో ఇదిగో, సోదరులకు రాఖీ కట్టి మరణించిన చెల్లి, ఆకతాయి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన చెల్లెలు
Hazarath Reddyమహబూబాబాద్ - నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్, కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని నాంపల్లి కోర్టు ఆదేశాలు
Hazarath Reddyగుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు 15 రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది.
Seethakka Tie Rakhi to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు (వీడియో వైరల్)
Rudraనేడు రాఖీ పౌర్ణమి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదరీమణులు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందంగా గడుపుతున్నారు.
Duvvada Vani: సోషల్ మీడియాకు దూరం అన్న మాధురి పోస్టుపై వాణి అనుమానం, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఎస్సై తనిఖీ... ఆ తర్వాత!
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో నయా ట్విస్ట్. సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని మాధురి చేసిన పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు వాణి. మాధురి రాత్రి 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉన్న ఇంట్లోకి ప్రవేశించిదని అందుకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆరోపించారు.
Telangana Crop Loan: ప్రతిపక్షనేత రాహుల్‌కు కేటీఆర్ లేఖ, రుణమాఫీ అందని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ రుణమాఫీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖరావారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున లేఖ రాస్తున్నానని తెలిపిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు. . రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే తాము వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.
Kagaznagar Rains: కాగజ్‌నగర్‌లో దంచి కొట్టిన వర్షం, రోడ్లపైకి చేరిన నీరు, స్తంభించిపోయిన జనజీవనం
Arun Charagondaకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ లో భారీగా వర్షం కురిసింది. కుండపోత వర్షంతో దహేగాం,పెంచికల్ పేట్ మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరగా జనజీవనం స్తంభించిపోయింది.
Human Trafficking In Chandanagar: స్పా ముసుగులో వ్యభిచారం, వ్యభిచార ముఠా గుట్టురట్టు,నలుగురు యువతుల అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ చందానగర్ లో స్పాసెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వహకులు. పక్క సమాచారంతో దాడి చేసి నలుగురు యువతులు,ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.
Duvvada Srinivas: సోషల్ మీడియాకు దూరమైన మాధురి, డాక్టర్ల సూచన మేరకే ఈ నిర్ణయం, అందరి సపోర్టు కావాలని వీడియో రిలీజ్
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో కీలకంగా మారారు మాధురి. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మాధురి సోషల్ మీడియాకు దూరమయ్యారు. తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని...మీ అందరి సపోర్టుతో నాకు చాలా ధైర్యంగా ఉందని తెలిపారు.
Hydra Demolishes Illegaal Constructions: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా, గండిపేటలో ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మణాల కూల్చివేత
Arun Charagondaరంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారే హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు అధికారులు. పటిష్ట భద్రతల మధ్య కూల్చివేతలు జరుగుతుండగా పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించటం లేదు పోలీసులు.
Jogulamba Gadwal: వరుస దొంగతనాలు, షెట్టర్ పగులగొట్టి మరి దొంగతనాలు, హడలెత్తుతున్న షాప్ యజమానులు
Arun Charagondaజోగులంబా గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. జులకల్ స్టేజ్ లో అర్ధరాత్రి షెట్టర్ పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి సీసీ టీవీలో వీడియో రికార్డు కాగా వరుస దొంగతనాలతో షాప్ యజమానులు హడలెత్తుతున్నారు
Stray Dogs Attack: ములుగులో పిచ్చి కుక్కల స్వైరవిహారం, ఏడుగురు యువకులతో పాటు రెండు మేకలపై దాడి,భయాందోళనలో స్థానికులు
Arun Charagondaములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. వెంకటాపురం మం. నూగురు గ్రామంలో ఏడుగురిపై పిచ్చికుక్క దాడి చేసింది. హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. రెండు మేకలను సైతం కరిచాయి పిచ్చికుక్కలు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Chandrababu In Delhi: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్న టీడీపీ అధినేత
Arun Charagondaటీడీపీ చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్‌లను కలిశారు చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అలాగే ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పిన విధంగా సాయం అందించాలని కోరారు.
Andhra Pradesh Shocker:భర్తను కొట్టి, భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం , ఏలూరులో కిరాతక సంఘటన
Arun Charagondaభర్తను కొట్టి.. అతని భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం చేసిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. జీవనోపాధి కోసం వచ్చి రాంకోఠిలో ఉంటున్న భర్తకు నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ముగ్గురితో కలిసి భర్త మద్యం తాగాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారం చేశారు.
P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
Rudraప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
Jagtial: రన్నింగ్ లో ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్, ప్రమాద సమయంలో 150 మంది ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
VNSజగిత్యాల నుంచి నిర్మల్‌కు పల్లె బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నా
Telangana Police: హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత, నలుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు
Arun Charagondaహైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు హాష్ ఆయిల్ విక్రేతని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.10.30 లక్షల విలువ చేసే 1.292 ఎంఎల్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు యువకులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.
KCR Is Back: రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!
Arun Charagondaతెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీ విషయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ టార్గెట్‌గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి అంతే ధీటుగా బీఆర్ఎస్ సైతం స్పందిస్తోంది. ఏకంగా హరీశ్ రావు కార్యాలయంపై దాడుల వరకు రాజకీయాలు వెళ్లగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు.
Hyderabad: బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ, జాబ్ ఇప్పిస్తామంటూ 600 మందికి టోకరా, ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష వసూలు, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaహైదరాబాద్ మాదాపూర్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు వల వేసిన కేటుగాళ్లు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. దాదాపు 600 మందికి పైగా నిరుద్యోగుల నుంచి 1లక్ష ,50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బెంగళూరు, విజయవాడలో సైతం ఈ కన్సల్టెన్సీ ఆఫీస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది