రాష్ట్రీయం

Andhra Pradesh Elections 2024: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దుండుగుల దాడి, పరిస్థితి అదుపులోనే ఉంది, నిందితులను అరెస్టు చేస్తామని తెలిపిన ఎస్పీ

Hazarath Reddy

ఏపీలో చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈ సాయంత్రం దాడి జరిగింది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు పులివర్తి నాని ఇవాళ వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

CM Jagan UK Visit: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి, ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు మన్నించింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో ఇంకా క్లారిటీ రాని పూర్తి స్థాయి పోలింగ్ శాతం, గత ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదు, ఈ సారి దాన్ని క్రాస్ చేసిన ఓటింగ్ శాతం

Hazarath Reddy

ఏపీలో మునుపెన్నడూ చూడని రీతిలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దాంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో, కొన్ని పోలింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరగడంతో పోలింగ్ శాతం పెరిగింది.

Advertisement

Hyderabad: చంద్రబాబు సీఎం కావాలంటూ వెంకటేశ్వరస్వామి ముందు నాలుక కోసుకున్న వీరభక్తుడు, గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఇలాంటి పనే..

Hazarath Reddy

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు

Chandrababu on PM Modi: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, గత 10 సంవత్సరాలలో ఆయన బాగా పనిచేశారని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇది చారిత్రాత్మక సందర్భం.. పవిత్ర స్థలం.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని.. గత 10 సంవత్సరాలలో ఆయన చాలా బాగా పనిచేశారని అన్నారు. బీజేపీ కూటమికి 400 సీట్లు రావాలి.

100 % Voting in TS Villages: ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పిన తెలంగాణ ప‌ల్లెలు.. జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో, మెదక్‌ జిల్లా సంగాయిపేట తండాలో వంద‌ శాతం పోలింగ్‌

Rudra

తెలంగాణ‌లోని రెండు గ్రామాలు ప్ర‌జాస్వామ్య స్పూర్తిని చాటి చెప్పాయి. లోక్‌ సభ నాలుగో ద‌శ‌ ఎన్నికల్లో భాగంగా సోమ‌వారం రాష్ట్రంలో పోలింగ్ జ‌రిగింది.

Andhra Pradesh Elections 2024: ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

Rudra

ఆంధ్రప్రదేశ్‌ లో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఏపీలో సాయంత్రం 5 గంటలకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇదిగో, లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే..

Hazarath Reddy

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు.

Telangana Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 61.59శాతం ఓటింగ్ నమోదు, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపిన సీఈఓ వికాస్ రాజ్

Hazarath Reddy

తెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్‌ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్‌ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తున్నారు.

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు

Hazarath Reddy

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు

Andhra Pradesh Elections 2024: నా భార్య ముందు నువ్వు అస‌లు క‌మ్మొడివేనా అని దూషించాడు, అందుకే చెంప పగలగొట్టానంటూ క్లారిటీ ఇచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌

Hazarath Reddy

తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు.

Advertisement

Lok Sabha Elections 2024: మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం ఇదిగో, ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది.మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు

Hazarath Reddy

ఏపీలో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వ‌రావుపేట‌, ములుగులో క‌డా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది.

Telangana Elections 2024: మాధవీలతపై కేసు నమోదు, హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను చెక్ చేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో ఆమె అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Blue Shirt Mania: బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, గన్నవరంలో చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు

Hazarath Reddy

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

Andhra Pradesh Elections 2024: ఎర్రకండువాతో ఓటేయడానికి వచ్చిన ఓటరు, తీవ్ర అభ్యంతరం తెలిపిన వంగా గీత, నాగబాబు దీనిపై ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు.

Andhra Pradesh Elections 2024: చీరాలలో రక్తమొచ్చేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఇరువర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

Telangana Elections 2024: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు, ఓటు వేయమని ఇంటింటికి వెళ్ళి చెబుతున్న స్థానికులు, వీడియోఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదవడంతో, ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడానికి నివాసితులు గేట్లు, తలుపులు తట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement