రాష్ట్రీయం

Congress Chalo Secretariat Protest: షర్మిల అరెస్ట్, వెంటనే విడుదల, ఒక్కహామీని నెరవేర్చని జగన్ వైఎస్‌ఆర్‌ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని మండిపాటు

Hazarath Reddy

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది

Party Symbols on Condoms Packets: వీడియోలు ఇవిగో, కండోమ్ ప్యాకెట్ల మీద సైకిల్, ఫ్యాన్ గుర్తులు, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న రెండు పార్టీలు

Hazarath Reddy

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కండోమ్‌ ప్యాకెట్ల మీద రాజకీయ పార్టీల గుర్తులు ఉన్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుతో ఉన్న కండోమ్ ప్యాకెట్ గురించి టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. టీడీపీ సింబల్ ఉన్న కండోమ్ ప్యాకెట్‌ గురించి వైఎస్సార్సీపీ ఓ వీడియోను బయటపెట్టింది

Hyderabad: కూకట్ పల్లిలో భవనం కూల్చివేత, మద్యం మత్తులో ఇంట్లోనే పడుకున్న వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు

YouTuber Shanmukh: అన్న కోసం వెళ్తే గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్‌, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ ఫేం, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Congress Chalo Secretariat Protest: 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారంటూ షర్మిల నిరసన

Hazarath Reddy

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల బైఠాయించి నిరసన తెలిపారు.

Viral Video: పుల్లుగా తాగి హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన హల్ చల్ చేసిన యువకుడు, ముప్ప తిప్పలు పడి అతన్ని కిందకు దించిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లోని మీర్ పేట్ లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి అక్కడ నుంచి కేకలు వేస్తూ హల్ చల్ చేశాడు. మీర్ పేట్ - పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద మద్యం బాబు విద్యుత్ స్థంభం ఎక్కి అక్కడ నుంచి కింద వెళుతున్న పాదాచారులను పిలుస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు.

TTD Darshan Tickets For May: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు తేదీలు విడుదల, ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే..

Hazarath Reddy

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీలను టీటీడీ విడుదల చేసింది.వీటితో పాటుగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా విడుదల చేసింది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

BRS Water War: మ‌రో నీటి యుద్ధానికి సిద్ధ‌మైన బీఆర్ఎస్, ఈ సారి క‌ర్ణాట‌క ప్రాజెక్టుపై పోరాటం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రెడీ

VNS

కర్నాటక ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న బ్యారేజీ నిర్మాణాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది బీఆర్‌ఎస్‌. తుంగభద్ర నదిపై చేపడుతున్న బ్యారేజీ వల్ల శ్రీశైలానికి వచ్చే నీరు ఆగిపోతుందని.. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది బీఆర్‌ఎస్‌. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. తెలంగాణ రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు

Advertisement

YS Sharmila: అరెస్టు భ‌యంతో రాత్రంతా పార్టీ ఆఫీస్ లోనే నిద్ర‌చేసిన వైయ‌స్ ష‌ర్మిల‌, ఛ‌లో సెక్ర‌టేరియేట్ పిలుపుతో ఏపీలో ఉద్రిక్త ప‌రిస్థితులు

VNS

రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లోనే షర్మిల (YS sharmila) నిద్రించారు. గురువారం ఉదయం అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు

Siddipet Fire Video: సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం, 132 కేవీ సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌పార్మర్‌ పేలి ఎగసిన మంటలు

Hazarath Reddy

తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో 130 కేవీ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా ట్రాన్స్‌పార్మర్‌(Transfaram) పేలి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి బయటకు వచ్చారు.

Medaram Jathara: మేడారం జాతరలో గుండెపోటుకు గురైన భక్తుడిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లా - రాజు అనే వ్యక్తి మేడారం జాతర క్యూ లైన్‌లో గుండెనొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడం గుర్తించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి ముందుగా కృతిమ శ్వాస అందించి స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.

Andhra Pradesh Road Accident: నల్లమల ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు లారీలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆత్మకూరు - దోర్నాల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Vemireddy Prabhakar Reddy Resigns YSRCP: వైసీపీతో పాటు ఎంపీ పదవికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా (Vemireddy Prabhakar Reddy Resigns YSRCP) చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

CM Jagan Visit Vishakha: రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్‌, శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాజ్యశ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్‌ పూజలు చేశారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

Medaram Jathara: మేడారం జాతర ప్రారంభం సందర్భంగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదామంటూ ట్వీట్

Hazarath Reddy

గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం

RTC Drivers Protest: కండక్టర్ కోసం హారన్ కొట్టిన బస్సు డ్రైవర్‌పై ప్యాసింజర్లు దాడి, బస్సులు నిలిపివేసి నిరసన చేపట్టిన డ్రైవర్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆర్మూర్ బస్టాండ్‌ బయట కండక్టర్ కోసం హారన్ కొట్టిన డ్రైవర్‌పై కొందరు ప్యాసింజర్లు దాడి చేశారని బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన చేపట్టారు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, 17 ఏళ్ల తరువాత దుబాయ్ జైలు నుంచి విడుదల, కుటుంబ సభ్యులను చూడగానే ఒక్కసారిగా భావోద్వేగ క్షణాలు ఎలా కనిపించాయంటే..

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కేటీఆర్ తనయుడు కేటీఆర్‌ చొరవతో నేపాల్ వాచ్ మెన్ హత్య కేసులో దుబాయ్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు నేడు జైలు నుంచి విడుదలైన సంగతి విదితమే. వారు దుబాయ్‌ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

Telangana: దుబాయ్ జైలు నుంచి ఐదుగురు తెలంగాణవాసుల విడుద‌ల‌, 18 ఏళ్ల జైలు జీవితం త‌ర్వాత కేటీఆర్ చొర‌వ‌తో స్వ‌దేశానికి రాక‌

VNS

దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి (Telangana Residents released) లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్‌ కోర్టు (Dubai Court) శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

Medaram Jathara: మేడారం మ‌హాజాత‌ర‌లో ఇవాళ తొలి ఘ‌ట్టం, క‌న్నెప‌ల్లి నుంచి వైభ‌వంగా గ‌ద్దెపైకి చేర‌నున్న‌ సార‌ల‌మ్మ‌

VNS

కన్నెపల్లిలోని సారలమ్మ (Kannepalli) గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు.

AP, Telangana Rajyasabha MP Election: ఏపీ, తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం...రాజ్యసభ నుంచి టీడీపీ డకౌట్..

sajaya

తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రిటర్నింగ్ అధికారుల ప్రకటన అనంతరం మూడు సీట్లకు 3 నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బీఆర్ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవి ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.

Advertisement
Advertisement