రాష్ట్రీయం

Andhra Pradesh: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ. 30 లక్షలు చెక్ అందించిన సీఎం జగన్

Hazarath Reddy

విధి నిర్వహణలో ప్రాణాలు పొగొట్టుకున్న ఏపీ కానిస్టేబుల్‌ సత్యకుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. సత్యకుమార్‌ కుటుంబానికి స్వయంగా పరిహారం అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అన్నారు.

Stray Dog Attack on Boy: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆగని వీధి కుక్కల దాడి, తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంట్లోకి వచ్చి మరీ బాలుడిని కరచిన కుక్క

Hazarath Reddy

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి కొనసాగుతూనే ఉంది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంతో గాయపడ్డాడు.అతను తన అపార్ట్‌మెంట్ వెలుపల మరో ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా కుక్కలు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది.

Shaik Sabjee Dies: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Telangana Assembly Session 2023: ఇది నిజమైన ప్రజా పాలన, అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్, డ్రగ్స్‌ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు

Advertisement

Telangana Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, భార్యా పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్‌ గన్‌మెన్‌, కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

KCR Discharged from Yashoda Hospital: యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్, పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేంత వరకు నందినగర్‌లో విశ్రాంతి

Hazarath Reddy

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోదా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయల్దేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు.

Gas EKYC: గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు.. డెలివరీ బాయ్‌ వద్దే ఈకేవైసీ.. వంటగ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి

Rudra

గ్యాస్‌ సిలిండర్‌ ఈకేవైసీకి గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధికారులు వినియోగదారులకు సూచించారు.

KCR Discharge Today: యశోద దవాఖాన నుంచి నేడు కేసీఆర్‌ డిశ్చార్జి.. నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని ఇంటికి

Rudra

ఎడమ తుంటి విరిగి గాయపడి యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్‌ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు.

Advertisement

Zero Ticket from Today: నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు.. ఆధార్, ఓటరు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి

Rudra

‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు.

Gunmen Withdrawn By Revanth Government: మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గ‌న్‌ మెన్ల తొలగింపు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం

Rudra

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గ‌న్‌ మెన్లను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పోలీసు శాఖ చ‌ర్య‌లు ప్రారంభించింది.

New High Court Building for Telangana: తెలంగాణకు కొత్త హైకోర్టు భవనం, జనవరిలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Hazarath Reddy

వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Telangana: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో తీవ్ర ఉద్రిక్తత, వైద్య విద్యార్థులపై బయట నుంచి వచ్చిన గూండాలు దాడి,విధులు బహిష్కరించిన నిరసన తెలిపిన మెడికోలు

Hazarath Reddy

ఆదిలాబాద్‌ రిమ్స్‌(RIMS)లో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్‌(Assistant Professor Kranti Kumar)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు(dismissed) డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. వైద్యుడు క్రాంతి కుమార్ అర్ధరాత్రి సమయంలో కారులో ముగ్గురు గుండాలను తీసుకొచ్చి విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన దురదృష్టకరమన్నారు

Advertisement

Telangana IAS' Reshuffle: హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి, తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ, పూర్తి లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. పదోన్నతుల బదిలీలుగా పేర్కొంటూ పలువురిని తన పేషీలో చేర్చుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా నియమించింది

AP 10th & Inter Exam Date 2024: ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చిలోనే అన్ని పరీక్షలు, వివరాలను వెల్లడించిన మంత్రి బొత్సా సత్యానారాయణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

KCR To Be Discharged On 15th: రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్న కేసీఆర్, అనంతరం నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని వార్తలు

Hazarath Reddy

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి రేపు డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు

CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు, పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పలాస బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు.

Advertisement

Andhra Pradesh: అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్, వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.

CM Jagan Slams Pawan Kalyan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా నీకు రాలేదు పవన్, పలాస సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, విశాఖకు నేను వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారంటూ మండిపాటు

Hazarath Reddy

తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు (Even votes that came to Sister Barrelakka) కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు.

Cylinder Blast in Karachi Bakery: వీడియో ఇదిగో, కరాచీ బేకరిలో భారీ పేలుడు, 15 మందికి తీవ్ర గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్రనగర్‌లోని ఓ కరాచీ బేకరీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్‌లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Weather Forecast: హైదరాబాద్‌లో దారుణంగా పడిపోయిన రాత్రి పూట ఉష్ణోగ్రతలు, చలిపులితో వణుకుతున్న నగరవాసులు, వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి

Hazarath Reddy

తెలంగాణతో పాటుగా హైదరాబాద్ నగరవాసులపై చలిపులి పంజా విసిరింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. నగర శివార్లలోని పటాన్ చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. చల్లదనానికి చలిగాలులు కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

Advertisement
Advertisement