రాష్ట్రీయం
YSR Sujaladhara Project: వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులని ప్రారంభించిన సీఎం జగన్‌, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. వైఎస్ఆర్ సుజ‌ల ధార డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
Visakhapatnam Fire Video: వీడియో ఇదిగో, విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు, మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
Hazarath Reddyవిశాఖ జగదాంబ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్‌ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి.
Times Now ETG Survey: ఫ్యాన్‌ తుపాన్‌లో ప్రతిపక్షాలు గల్లంతు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపిన టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వే
Hazarath Reddyఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. ఫ్యాన్‌ తుపాన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 24–25 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది.
Telangana Assembly Sessions 2023: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక
Hazarath Reddyనాలుగు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, BRS ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.
Fire Accident In Kamareddy: కామారెడ్డిలో భారీ అగ్నిప్ర‌మాదం, పూర్తిగా కాలి బూడిదైన షాపింగ్ మాల్, ఏకంగా రూ. 5 కోట్ల‌కు పైగా న‌ష్టం, రెండు అంత‌స్తులు పూర్తిగా బుగ్గి
VNSఅర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Police Arrested The Bull: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు, చేనులో మేసింద‌ని 3 రోజులు స్టేష‌న్ లోనే నిర్భందం, మంచిర్యాల జిల్లాలో వింత ఘ‌ట‌న‌
VNSమంచిర్యాల జిల్లాలో. పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి (Bull Arrest) పోలీస్ స్టేషన్ ముందు కట్టేశారు. ఆ ఎద్దు యజమాని వస్తే కథేంటో తేల్చుదాం అన్నట్లుగా ఎద్దును తీసుకెళ్లి స్టేషన్ లో కట్టేశారు.
Bhatti Vikramarka : ప్ర‌జాభ‌వ‌న్ లోకి కుటుంబ స‌మేతంగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, సెక్ర‌ట‌రియేట్ లో ఆర్ధిక‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌
VNSతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రయుక్తంగా గురువారం తెల్లవారుజామున ప్రజాభవన్‌లో (Praja Bhavan) గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
Gaddam Prasad Kumar: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక, రేపటి నుంచి శాసనసభ సమావేశాలు
Hazarath Reddyతెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
Andhra Pradesh Public Holidays 2024: వచ్చే ఏడాదికి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు 25 ఐచ్చిక సెలవులు
Hazarath Reddy2024లో వచ్చే సెలవులకు (2024 Holidays) సంబంధించిన ప్రకటనను ఏపీ సర్కార్ (AP Government) విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సాధారణ సెలవులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి
Telangana: డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే.
YSR Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఈ నెల 18 నుంచి ప్రారంభం
Hazarath Reddyవైఎస్సార్ ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు.
Hyderabad CP Press Meet on Drugs: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని తెలిపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyహైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy)బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు
TSGENCO Exam Postponed: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణ జెన్‌కో రాత పరీక్ష వాయిదా, తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనే దానిపై జెన్‌కో అప్‌డేట్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్‌కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, కెమిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Telangana Public Holidays 2024: తెలంగాణలో వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు, పబ్లిక్ హాలీడేస్ లిస్ట్ ప్రకటించిన ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2024కు సంబంధించి సెలవులపై ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్‌), 25 ఆఫ్షనల్‌(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్‌ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది
Telangana: సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్‌ కాసీం నియామకం, కొనసాగుతున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ.జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై ఉత్కంఠ
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్‌ కాసీం నియమితులయ్యారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ ఉన్న షానవాజ్ కాసిం మంగళవారం బదిలీ అయ్యారు. అనంతరం షానవాజ్‌ కాసి.. సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా నియామకం అయినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది
KCR Health Update: నన్ను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దంటూ వీడియో విడుదల చేసిన కేసీఆర్, నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని వెల్లడి
Hazarath Reddyసర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రిలోనే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Komatireddy on AP Special Status: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై అమలు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
AP Fibernet case: ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ జనవరి 17కు వాయిదా, కేసుపై ఎవరూ అప్పటివరకు మాట్లాడకూడదని ఇరుపక్షాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసులో (Fiber Net Case) ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
Minister Uttam on Kaleshwaram Project: నీటిపారుదల శాఖలో భారీ అవినీతి, మొత్తం బయటకు తీస్తామని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తామని వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) చెప్పారు.
Congress Five Guarantees: రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌, వంద రోజుల్లో ఈ రెండు హామీలను అమలు చేస్తామని తెలిపిన రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Hazarath Reddyసివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి.