రాష్ట్రీయం

Skill Development Case: చంద్రబాబుకు ఎదురుదెబ్బ, నవంబర్‌ 1 వరకు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో బెయిల్‌పై కొనసాగుతున్న విచారణ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగింది. గతంలో విధించిన రిమాండ్‌ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు

Rahul Gandhi Road Show: టీ కాంగ్‌లో రాహుల్ టూర్ జోష్, తెలంగాణలో రెండోరోజు రాహుల్ రోడ్ షో షెడ్యూల్ ఇదీ! భూపాలపల్లి నుంచి కరీంనగర్ వరకు సాగనున్న బస్సుయాత్ర

VNS

తొలుత భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. కాటారంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులతో రాహుల్ సమావేశం అవుతారు. రైతులకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే పథకాలను వారికి వివరిస్తారు. రుణమాఫీ, రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12వేల సాయం, మద్దతు ధర, ఇతర పథకాల గురించి రాహుల్ రైతులకు తెలియజేయనున్నారు.

Congress Vijayabheri Sabha: దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు, ములుగు సభలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

రాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది..

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నగదు, తులం బంగారం, ములుగు వేదికగా హామీల వర్షం

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండే బాధ్యత సోనియా గాంధీ తీసుకున్నారని తెలిపారు.

Advertisement

Inner Ring Road Case: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కి వాయిదా, బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇవాళ్టి వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

IIT-Kharagpur Student Dies: ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక పోయాడా, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Hazarath Reddy

తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్‌ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

Fibernet Case: ఫైబర్ నెట్ కేసు, చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయం 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Hazarath Reddy

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం 20వ తేదీకి (ఎల్లుండి శుక్రవారం) వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది.

CM KCR Speech in Praja Ashirvada Sabha: ఆనాడు జోలె పట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా ఏ సీఎం సాయం చేయలేదు, ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో , పార్టీ తమ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన , ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు

Advertisement

Congress Vijayabheri Sabha: రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చాం, కాని ఇప్పుడు కేసీఆర్ మీ ఆశలు ఆవిరి చేశాడు, కాంగ్రెస్‌ విజయభేరి సభలో గర్జించిన ప్రియాంకా గాంధీ

Hazarath Reddy

BRS పాలనలో ప్రజలు ఆనందంగా లేరు. తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం దక్కలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి.ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు

Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రియాంక గాంధీ వాద్రా హామీ వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని, అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు

Pravalika Suicide Case: ప్ర‌వ‌ళిక కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం ఇస్తామని తెలిపిన మంత్రి కేటీఆర్, నిందితుడిని ప‌ట్టుకుని చ‌ట్ట‌ప‌రంగా శిక్ష‌ప‌డేలా చూస్తామ‌ని వెల్లడి

Hazarath Reddy

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మ‌ర్రి ప్ర‌వ‌ళిక కుటుంబ స‌భ్యులు బుధ‌వారం ఉద‌యం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వ‌ళిక కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు.కేటీఆర్ మాట్లాడుతూ.. ప్ర‌వ‌ళిక కుటుంబానికి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌లేం అని పేర్కొన్నారు

Dussehra Holiday in AP: ఈ నెల 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు

Hazarath Reddy

ఈ నెల 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Advertisement

Revanth Reddy Arrest: గన్‌పార్క్‌ వద్ద రేవంత్‌ రెడ్డి అరెస్ట్, అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆయనతోపాటు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. అయితే ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండటంతో పర్మిషన్‌ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

Skill Development Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు, మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

BSP Election Manifesto: యువతకు పది లక్షల ఉద్యోగాలు, తెలంగాణ బీఎస్‌పీ మేనిఫెస్టో ఇదిగో, విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి

Hazarath Reddy

బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్‌ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కాగా ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను పార్టీ ప్రకటించింది.

Skill Development Scam: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు, టీడీపీ అధినేత ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టు విచారణ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.

Advertisement

Telangana Polls 2023: డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిపై తిరగబడుతున్న కాంగ్రెస్ నేతలు, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తానని సవాల్ విసిరిన నాగం జనార్దన్ రెడ్డి

Hazarath Reddy

రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తానని నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు.

SSC Exams: మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు.. ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్‌

Rudra

వచ్చే ఏడాది మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Telangana Polls 2023: వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు, వ్యాన్‌లో లెక్కలు లేని రూ. 2.36 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికలు2023కి ముందు భారీగా నగదు ప్రవాహం జరుగుతోంది, పోలీసుల తనిఖీలో కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. తాజాగా కరీంనగర్ పోలీసులు, ఈరోజు వాహనాల తనిఖీలో వ్యాన్‌లో రూ. 2.36 కోట్ల అన్ అకౌంటబుల్ నగదును స్వాధీనం చేసుకున్నారు.

Telangana Polls 2023: రెండో విడతలో సీఎం కేసీఆర్ నుంచి బీఫారాలు అందుకున్న 28 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఇక మిగిలింది 18 మంది అభ్యర్థులే..

Hazarath Reddy

భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం బీ ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం 51 మంది అభ్యర్థులకు కేసీఆర్‌ బీ ఫారాలు అందజేసిన విషయం తెలిసిందే.తాజాగా 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలను ప్రగతి భవన్‌లో అందించారు.

Advertisement
Advertisement