రాష్ట్రీయం

Harish Rao Counter To Congress: కాంగ్రెస్‌వి వారెంటీ లేని గ్యారెంటీలు, వందరోజుల్లోనే కర్ణాటక ఆగమాగం అవుతోంది, కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్ రావు ఘాటు కౌంటర్

VNS

కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమ‌లు చేయ‌లేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారన్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఛార్జీలు పెంచి ప్రజల న‌డ్డి విరిచారని, అక్కడ మీరిచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తున్నారా..? అంటూ నిలదీశారు

Alpha Hotel: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో మటన్ కీమా, రోటీ తిన్న యువకులకు ఫుడ్ పాయిజన్.. హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

ahana

'మటన్ కీమా రోటీ' తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆల్ఫా హోటల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 'మటన్ కీమా రోటీ' తిన్న వెంటనే కస్టమర్ అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Minister Roja On Pawan Kalyan: పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం..మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరిక

ahana

పవన్ కల్యణ్ బ్రతుకు ఎంత? స్థాయి ఎంత అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరింది అని చెప్పుకొచ్చారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం అని అన్నారు.

Revanth Reddy Posters Viral: సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో బంజారాహిల్స్‌ లో పోస్టర్ల కలకలం

Rudra

హైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది.

Advertisement

Maharashtra Accident: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

Rudra

మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Telangana: చిన్న వయసులో ఇవేమి హార్ట్‌ఎటాక్‌లు బాసూ..ఇంట్లో ఆడుకుంటుండగా 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి

Hazarath Reddy

ములుగు జిల్లా - వాజేడు మండల కేంద్రానికి చెందిన సూత్రపు హరిచందర్ అనే బాలుడుకి ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు.

Jana sena Coordination Committee: టైం వచ్చినప్పుడు సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతా, జనసేన-టీడీపీ పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక కామెంట్లు, నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన కమిటీ

VNS

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు (JSP-TDP) ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

JPS Regularization: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు గుడ్‌న్యూస్, అర్హులైన 6,603 మందికోసం పోస్టులు క్రియేట్

VNS

తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(JPS) రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెగ్యులరైజేషన్‌కు అర్హులైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం గ్రేడ్‌- 4 పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretary Officers) పోస్టులను క్రియేట్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Viral Video: వైరల్ గా మారిన హైదరాబాద్ పోలీస్ కపుల్ ప్రీ వెడ్డింగ్ వీడియో...చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నెట్టింట వైరల్ అయ్యింది. విధి నిర్వహణలో ఉంటూనే పోలీస్‌ వాహనంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేశారు.

Palamuru Rangareddy Lift Irrigation Project: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్, శతాబ్దాల పాలమూరు కరువుకు చరమగీతం పాడిన కేసీఆర్..మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు..

ahana

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

Thummala Resigned BRS Party: బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తుమ్మల

ahana

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు సమర్పించారు. తుమ్మల ఏక వాక్యంలో రాజీనామా లేఖను ముగించారు. ‘ఇన్నాళ్లూ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు, మీరు పార్టీకి నా రాజీనామాను ఆమోదించగలరంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

TET Results: 27న టెట్‌ ఫలితాల వెల్లడి.. పేపర్‌-1కు 84.12%, పేపర్‌-2కు 91.11% హాజరు

Rudra

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్‌-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్‌ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు.

Advertisement

Palamuru-Rangareddy Project: నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన

Rudra

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు.

Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం.. ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా రికార్డు.. విశేషాలు ఇవిగో (వీడియోతో)

Rudra

గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్‌ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి.

Hyderabad: కాంగ్రెస్‌లోకి తుమ్మల ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్, సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిన మాజీ మంత్రి, స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు

VNS

తాజ్‌ కృష్ణా హోటల్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు తుమ్మలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌లో జిట్టా బాలకృష్ణారెడ్డి, యొన్నం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Advertisement

CM Breakfast Scheme: విద్యార్ధుల కోసం తెలంగాణ సర్కార్ వినూత్న పథకం, ఇకపై ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా ఇవ్వాలంటూ నిర్ణయం, అక్టోబర్ 24 నుంచి నూతన పథకం ప్రారంభం

VNS

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ( ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ) చదువుకునే విద్యార్థినీవిద్యార్థుల కోసం సీఎం అల్పాహార పథకం (Cm Breakfast Scheme) ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు

Kavitha Questions to Rahul Gandhi: మీ ఈడీ కేసు ఏమైంది రాహుల్ గాంధీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందా, పలు ప్రశ్నలను సంధించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవిత

Hazarath Reddy

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవిత మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ, మీ ఈడీ కేసు ఏమైంది?.. కాంగ్రెస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందా?.. రెండోది.. ఒక రాష్ట్రంలో ఆప్ లేదా సీపీఐ(ఎం)తో కాంగ్రెస్‌ పోటీ చేసి పొత్తు పెట్టుకుంది. మరొక క్షణంలో వారితో కలిసి. మీరు వారిని విమర్శించండి

Andhra Pradesh: వీడియో ఇదిగో.. అనారోగ్య బాధితులకు అండగా సీఎం జగన్, ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రిని కలిసిన అనారోగ్య బాధితులు. వారి సమస్యలను విని, సహృదయంతో స్పందించి, ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Accident Video: రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలిపే షాకింగ్ వీడియో ఇదిగో, రస్తా రోడ్లు అందరికీ సురక్షితం అంటూ సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

షాకింగ్ వీడియోని షేర్ చేసిన అధికారి అందులో రస్తా రోడ్లు అందరికీ సురక్షితం. సురక్షిత రహదారులకు మార్గం. ఇలాంటి సందర్బాలలో ఓర్పు వహించండి నియమాలు పాటించండి ప్రాణాలను రక్షించుకోండి. నియమాల కోసం “RASTA” ను అనుసరించండి అంటూ సూచనలు చేశారు. వీడియో ఇదిగో..

Advertisement
Advertisement