రాష్ట్రీయం

Video: అభిమానమా లేక పిచ్చా..క్రేన్ మీద వచ్చి శాలువా కప్పిన పవన్ కల్యాణ్‌ అభిమాని, భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

తిరుపతిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.పవన్ కల్యాణ్‌ అభిమాని ఒకరు ప్రాణాలను లెక్కచేయకుండా క్రేన్ మీద వచ్చి శాలువా కప్పాడు. అయితే అంత ప్రమాదకర స్టంట్ ఏంటంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి, వీడియో ఇదిగో..

Video: రాత్రిపూట స్మార్ట్‌గా వచ్చి బైక్ నుంచి పెట్రోల్ ఎత్తుకెళ్లిన దొంగ, సీసీటీవీ ఫుటేజీ ఇదిగో..

Hazarath Reddy

నిజామాబాద్ - పిట్లం మండల కేంద్రంలోని తులసీరాం కాలనీలో ఈనెల 15న రాత్రివేళ పార్క్ చేసిన బైక్ నుంచి ఓ వ్యక్తి పెట్రోల్ దొంగలించినట్లు కేసు నమోదైంది. చాటుగా వచ్చిన దొంగ ఇంటిముందు నిలిపి ఉన్న బైక్ నుంచి పెట్రోల్ లాగేశాడు.

Revanth Reddy on KCR: కేసీఆర్ మగాడయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదా మాడా అని ఒప్పుకోవాలి, సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కేసీఆర్ మగాడు అయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదంటే మాడా అని ఒప్పుకోవాలి. కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తే వాళ్లు వేసే ఏ శిక్షకి అయినా నేను సిద్ధం. 80 శాతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అందులో కేసీఆర్ కూడా ఉన్నాడు. - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Fire Accident in Shadnagar: షాద్‌నగర్ శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు.. 11 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషయం (వీడియోతో)

Rudra

హైదరాబాద్ శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల సమీపంలో గల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించింది.

Advertisement

ATM Withdraw: 8 వేల కోసం విత్ డ్రా చేస్తే.. ఆరు వందలే.. హైదరాబాద్ మల్లాపూర్‌ లోని ఏటీఎంలో సాంకేతిక లోపం.. వినియోగదారుల గగ్గోలు (వీడియోతో)

Rudra

హైదరాబాద్ మల్లాపూర్‌ లోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా వెయ్యి రూపాయలకు బదులు 2 వందల రూపాయలే వస్తున్నాయని బాధితులు ఆందోళనకు దిగారు.

Rains in Telugu States: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. నేటి నుంచి 20 వరకు వర్షాలు.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

Rudra

నేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.

KTR Comments On Congress: నేడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు, తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తోంది..మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

kanha

ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఆ ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు..చంద్రబాబు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో లేవు. ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆంధ్రకి తీసుకుపోయారు.

Nellore Shocker: నెల్లూరు జిల్లాలో మద్యం సేవించి విధులకు హాజరవుతన్న ఎంపీడీవో, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం...

kanha

తాగి విధులకు హాజరవుతున్న ఎంపీడీవో...నెల్లూరు - వరికుంటపాడు మండలం ఎంపీడీవో విజయభాస్కరరావు మద్యం మత్తులో విధులకు హాజరు అవుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మండల స్థాయి అధికారి అయి ఉండి క్రింది స్థాయి సిబ్బంది చేసే తప్పులను ప్రశ్నించి క్రమశిక్షణలో పెట్టాల్సి ఉండగా తానే మద్యం మత్తులో తూలుతున్నారు.

Advertisement

MP K. Keshavarao: బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు..

kanha

బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవ రావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు. ఫోర్జరీ సంతకాలతో ఎన్అర్ఐ మహిళకు చెందిన స్థలం కబ్జా చేశారని ఆరోపణలు. ఎంపీ కేకే కుమారులు విప్లవ్ కుమార్, వేంకటేశ్వర రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

VC Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, మద్యం మత్తులో వాహనాలు నడిపి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దంటూ క్యాప్షన్

Hazarath Reddy

మద్యం మత్తు, అతివేగమే అనేక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. కొందరి నిర్లక్ష్యం ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఎవరో చేసిన తప్పుకు ఇలా అమాయకులు బలవుతున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దు.

Chandrayaan Latest Update: చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌ డేట్.. మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన

Rudra

చంద్రయాన్-3 ప్రయాణానికి సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్‌ డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది.

Lal Darwaza Bonalu: సందడిగా లాల్ దర్వాజ బోనాలు.. సింహవాహిని చెంత శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు.. వీడియోతో

Rudra

శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీ బోనమెత్తనుంది. సింహవాహిని ఆలయంలో బోనాల సందడి కొనసాగుతున్నది.

Advertisement

Sai Dharam Tej: వివాదంలో ఇరుక్కున్న హీరో సాయిధరమ్ తేజ్...శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇవ్వడం ధర్మశాస్త్రానికి విరుద్ధం..అంటున్న పండితులు

kanha

వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్...శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇచ్చిన సాయిధరమ్ తేజ్. పూజారులు తప్ప మరి ఎవ్వరు ఇవ్వకూడదు అంటు భక్తులు ఆగ్రహాం. ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆలయ అధికారులు పై భక్తులు అసహనం. పట్టించుకొని ఆలయ అధికారులు మరియు సిబ్బంది.

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ నువ్వు ఒక్క గ్రామ వాలంటీర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపినా నేను ఉరేసుకుంటా, మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు

kanha

వాలంటీర్లను అరెస్ట్ చేస్తే ఊరేసుకుంటా...పవన్ కళ్యాణ్ .. ఒక్క గ్రామ వాలంటీర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపినా నేను నరేంద్ర సెంటర్లో ఉరేసుకుంటా - మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు

Hyderabad Shocker: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పాలు తాగాను అంటూ వింత సమాధానం

kanha

మేడ్చల్ - కండ్లకోయలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. ఈ తనిఖీలలో అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడి పోలీసులు ఏం తాగావు అని ప్రశ్నించగా పాలు తాగాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు.

Shamirpet Firing: హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం, ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపిన కార్తీకదీపం నటుడు, ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

VNS

తన భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్లిందని తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో.. వివాహేతర సంబంధంపై (Illegal affair) వారిని నిలదీశాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో (Air gun) భర్తపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు గాయపడ్డాడు.

Advertisement

MBBS Counseling: 20 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌.. 22 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు.. పూర్తి వివరాలు ఇవే..

Rudra

అఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు.

Viral Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు.. తమ బిడ్డలను కాపాడుకోడానికి పాముతో ఫైటింగ్.. వీడియో వైరల్

Rudra

ఒక పాము వీధి కుక్కల చేతిలో చనిపోయింది.తమ బిడ్డలను కాపాడుకోడానికి ఒక కుక్క తన నోటితో ఒక పాముని పట్టుకుని తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. అయితే కుక్కలను భయపెట్టి తన ప్రాణాలను కాపాడుకోడానికి పాము ప్రయత్నించింది.

Ponguleti in TPCC Committee: పార్టీలో చేరిన నెల రోజులకే పొంగులేటికి కీలక పదవి.. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామకం

Rudra

మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత హస్తం పార్టీ ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది.

Viral Video: వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. మచిలీపట్నంలో ఘటన.. వీడియో ఇదిగో!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది.

Advertisement
Advertisement