రాష్ట్రీయం

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ నువ్వు ఒక్క గ్రామ వాలంటీర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపినా నేను ఉరేసుకుంటా, మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు

kanha

వాలంటీర్లను అరెస్ట్ చేస్తే ఊరేసుకుంటా...పవన్ కళ్యాణ్ .. ఒక్క గ్రామ వాలంటీర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపినా నేను నరేంద్ర సెంటర్లో ఉరేసుకుంటా - మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు

Hyderabad Shocker: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పాలు తాగాను అంటూ వింత సమాధానం

kanha

మేడ్చల్ - కండ్లకోయలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. ఈ తనిఖీలలో అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడి పోలీసులు ఏం తాగావు అని ప్రశ్నించగా పాలు తాగాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు.

Shamirpet Firing: హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం, ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపిన కార్తీకదీపం నటుడు, ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

VNS

తన భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్లిందని తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో.. వివాహేతర సంబంధంపై (Illegal affair) వారిని నిలదీశాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో (Air gun) భర్తపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు గాయపడ్డాడు.

MBBS Counseling: 20 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌.. 22 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు.. పూర్తి వివరాలు ఇవే..

Rudra

అఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు.

Advertisement

Viral Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు.. తమ బిడ్డలను కాపాడుకోడానికి పాముతో ఫైటింగ్.. వీడియో వైరల్

Rudra

ఒక పాము వీధి కుక్కల చేతిలో చనిపోయింది.తమ బిడ్డలను కాపాడుకోడానికి ఒక కుక్క తన నోటితో ఒక పాముని పట్టుకుని తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. అయితే కుక్కలను భయపెట్టి తన ప్రాణాలను కాపాడుకోడానికి పాము ప్రయత్నించింది.

Ponguleti in TPCC Committee: పార్టీలో చేరిన నెల రోజులకే పొంగులేటికి కీలక పదవి.. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామకం

Rudra

మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత హస్తం పార్టీ ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది.

Viral Video: వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. మచిలీపట్నంలో ఘటన.. వీడియో ఇదిగో!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది.

KTR Legal Notice To Shukhesh: సుఖేష్‌ చంద్రశేఖర్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదంటూ హెచ్చరించిన మంత్రి

VNS

త‌న‌పై త‌ప్పుడు విష‌యాల‌తో కేంద్రానికి, సీబీఐకి ఫిర్యాదు చేశాడ‌ని కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపించారు. బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పాల‌ని, బేష‌ర‌తుగా త‌న‌పై ఫిర్యాదును వెన‌క్కి తీసుకోవాల‌ని సుఖేష్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. భ‌విష్యత్‌లో త‌న‌పై త‌ప్పుడు ప్రచారం చేయొద్దని కేటీఆర్ సూచించారు.

Advertisement

Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

చంద్రయాన్‌-3 విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్‌ అభినందించారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో గర్వించదగిన స్థానం సాధించారని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో చంద్రయాన్-2 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంతం, ఇస్రో టీంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. చంద్ర‌యాన్‌-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

APPSC Group 1 Mains Result 2023 Declared: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూలు తేదీ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

AP PGCET-AP EDCET Results Declared: ఏపీ పీజీసెట్‌, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023(AP PGCET 2023), బీఈడీ(BEd) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.

Advertisement

Telangana Transfers IAS Officers: హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, తెలంగాణలో 31 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సుమారు 31మంది ఐఏఎస్​ అధికారులకు స్థాన చలనం, పోస్టింగ్​లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

BJP Leader Missing in Hyderabad: హైదరాబాద్‌లో బిజేపీ నేత మిస్సింగ్, గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు

Hazarath Reddy

హైదరాబాద్‌లో బీజేపీ నేత ఒకరు అదృశ్యం కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర శివార్లలోని అల్వాల్ ప్రాంతంలో బీజేపీ స్థానిక నాయకుడు ఎం.తిరుపతిరెడ్డి గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు.

AP PGCET 2023 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా పొందండి

kanha

ఏపీ పీజీసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.

Raja Singh Meets Harish Rao: బీజేపీలోనే ఉంటా, అందులోనే చస్తా, బీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే వార్తలపై స్పందించిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌

Hazarath Reddy

నేను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్‌ రావును కలిశాను. ధూల్‌పేటలో మోడల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ను కోరాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్‌ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.

Advertisement

Money Laundering Case: రూ.2 వేల కోట్ల లావాదేవీలపై కవిత, కేటీఆర్‌పై సుఖేష్‌ సంచలన ఆరోపణలు, ఆ రోగ్ ఎవరో నాకు తెలియదని ఖండించిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

మనీలాండరింగ్‌ కేసులో తిహార్‌ జైలులో ఉన్న సుఖేష్‌ ఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై తమిళిసై సౌందరరాజన్‌కు మరోసారి సంచలన లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్‌ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని లేఖలో ఆరోపించారు.

Video: వీడియో ఇదిగో, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చితకబాదాడు

Hazarath Reddy

నాగర్‌కర్నూల్ జిల్లాలో భర్తను కోల్పోయి హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పద్మమ్మ కొడుకు సంతోష్ తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హింసించాడు. దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Andhra Pradesh Crime: ఏలూరులో దారుణం, కన్న కూతుర్లకు రెండో భర్తతో కడుపు చేయించిన తల్లి, ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

ఏలూరులోని వట్లూరు గ్రామ పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) భర్త అనారోగ్యంతో 2007లో మరణించగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43) అనే యువకుడిని వివాహం చేసుకుంది

Andhra Pradesh Horror: కన్నతల్లి దారుణం, ఇద్దరి కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపిన కసాయి, పిల్లల కోసం మాతృత్వానికి మచ్చతెచ్చేలా నిర్ణయం

Hazarath Reddy

ఏపీలోని ఏలూరు జిల్లాలో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి మాతృత్వానికి మచ్చతెచ్చేలా కన్న కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపింది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు గురువారం తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement