రాష్ట్రీయం

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

VNS

బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) కొనసాగుతోంది. చెన్నైకి 135 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Telangana: వీడియో ఇదిగో, హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి, గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టంకు పంపించిన కళాశాల సిబ్బంది

Hazarath Reddy

హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో గుగులోతూ శ్రీదేవి అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందింది.

Andhra Pradesh: చంద్రగిరిలో తీవ్ర విషాదం, చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య, అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి..

Hazarath Reddy

తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత'గా గుర్తించారు

Telangana: వీడియో ఇదిగో, నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తన్నుకున్న యువకులు,దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్

Hazarath Reddy

నల్గొండ జిల్లా తాటికొల్ గ్రామంలో యువకులు బీభత్సం సృష్టించారు. దసరా పండగ రోజు జరిగిన బైక్ గొడవ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Advertisement

Telangana: నాలుగు నెలల క్రితం పెళ్లి, అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఇల్లాలు ఆత్మహత్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో నాలుగు నెలల క్రితం ఉబ్బపెల్లి గణేష్ తో సుకన్య (22) వివాహం జరిగింది.

CM Revanth Reddy: నాడు పీసీసీ చీఫ్‌గా...నేడు సీఎంగా మెదక్‌ చర్చికి వచ్చా...ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం, మెదక్ చర్చికి నిధులు విడుదల చేస్తాం

Arun Charagonda

మెదక్ చర్చ్ తో నాకు గొప్ప అనుబంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా...మళ్లీ సీఎం హోదాలో ఈ చర్చ్ కి వస్తానని ఆనాడు చెప్పాను అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను...ప్రభువు ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

Manchu Vishnu: ప్రభుత్వాల మద్దతుతోనే ఎదిగిన చిత్ర పరిశ్రమ..చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న మంచు విష్ణు..మా సభ్యులు స్పందించొద్దని వినతి

Arun Charagonda

ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందన్నారు.

Pushpa 2 stampede: సంధ్య థియేటర్ విషాదం...రేవతికి 11వ రోజు కర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు, కోలుకుంటున్న చిన్నారి శ్రీ తేజ్

Arun Charagonda

డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో మరణించిన 39 ఏళ్ల మహిళ రేవతి కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆమె అకాల మరణం యొక్క విషాదంతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రేవతికి కుటుంబం 11వ రోజు కర్మను నిర్వహించింది.

Advertisement

TTD: పరకామణి కుంభకోణంపై చర్చ, స్కాంపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి

Arun Charagonda

తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి.

Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం

Arun Charagonda

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ముగ్గురిని ఒక రాష్ట్రం నుండి మరో చోటికి బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.

Telangana: వీడియో ఇదిగో, మద్యం తాగి స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయుడు, ఇదేం పని అని అడిగితే బండ బూతులు తిడుతూ..

Hazarath Reddy

ఏటూరునాగారం మండ‌లం కొండాయి గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఓ ఉపాధ్యాయడు మద్యం తాగి స్కూలుకు వచ్చాడు. మ‌ద్యం తాగి పాఠ‌శాల‌కు రావ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ఓ వ్య‌క్తి.. ఉపాధ్యాయుడిని ప్ర‌శ్నించాడు.

Sandhya Theatre Stampede Case: రేవతి భర్త భాస్కర్‌కు సినీ పరిశ్రమలో శాశ్వత ఉపాధిని కల్పిస్తాం, నిర్మాత దిల్ రాజ్ కీలక వ్యాఖ్యలు, శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Advertisement

NTR Fan Kaushik Discharged: ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టిన ఎన్టీఆర్, జూనియర్‌పై కామెంట్స్ చేసిన కౌశిక్ తల్లి

Hazarath Reddy

దేవర రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తిరుపతి కి చెందిన కౌశిక్ తాజాగా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా చేసిన విషయం విదితమే.

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌

Hazarath Reddy

పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు

‘Pushpa 2’ Stampede Incident: అల్లు అర్జున్ విచారణ పూర్తి, దాదాపు మూడున్నర గంటల పాటు విచారించిన చిక్కడపల్లి పోలీసులు, 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా వార్తలు

Hazarath Reddy

సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం

Hazarath Reddy

తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రగిరి భారతీ నగర్‌కు చెందిన సుధాకర్‌ కుప్పం డిపో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

Cyclone Coming? మళ్లీ దూసుకొస్తున్న ఇంకో తుపాను? కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Hyderabad: అశోక్ నగర్‌లో గ్రూప్ వన్ అభ్యర్థి సూసైడ్, వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వివాహం, ఈ లోపే బలవన్మరణం

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ వన్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన గూగులోతు సురేఖ తన రూంలో సూసైడ్ చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో నిశ్చితార్థం జరిగింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్, చింతలూరు వద్ద బస్సు ఆపి అందులో నిద్రపోతున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని కాకినాడ జిల్లా నర్సీపట్నంలో పుష్ప సినిమా చూసి బస్టాండ్ లోని బస్ లో పడుకొని.. బస్ కు తాళం ఉండటం చూసి ఓ దుండగుడు బస్ ఎత్తుకెళ్లిన సంగతి విదితమే.తాజాగా చింతలూరు వద్ద బస్సు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకొని ఆ దొంగను అరెస్ట్ చేశారు.

Tirupati: వీడియో ఇదిగో, తిరుపతిలో తీవ్ర అపచారం, క్రిస్మస్ పండుగ ముందు రోజు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టిన దుండగులు, మండిపడుతున్న హిందూ సంఘాలు

Hazarath Reddy

తిరుపతిలో తీవ్ర అపచారం ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానమీయంగా శాంట క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు

Advertisement
Advertisement