ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన చంద్రబాబు,80 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు, నిల్చోబెట్టి మరీ..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వులు పూయించారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని చంద్రబాబు చెప్పగా అసెంబ్లీలో దాదాపు 80% ఎమ్మెల్యేలు నిల్చున్నారు. దీంతో స్పీకర్‌తో సహా అంతా నవ్వుకున్నారు.

Andhra Pradesh Horror: ఏపీలో మరో దారుణం, రెండో పెళ్ళి చేసుకుందని మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో, కోడి గుడ్లతో దాడిచేసిన సాటి మహిళలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి సాటి మహిళలే ఆమెను దారుణంగా హింసించారు.

Andhra Pradesh Assembly Session: దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం ఏపీలో జరిగింది, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభలో పలు అంశాలపై సమావేశాల్లో (Andhra Pradesh Assembly Session) చర్చలు చేపట్టారు. వైసీపీ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందంటూ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు శాసనసభలో బుధవారం విడుదల చేశారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి నాగుపాముతో ఆటలు, ఒక్కసారిగా పైకి దూసుకువచ్చి కాటేయడంతో ఆస్పత్రి పాలు..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది

Advertisement

Andhra Pradesh: మద్యం మత్తులో పాముతో చెలగాటం, గంట సేపు పాముతో ఆటలు, చివరికి సీన్ కట్ చేస్తే?

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది.

YS Sharmila: వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన రైతుల్ని ప‌రామ‌ర్శించిన వైఎస్ ష‌ర్మిల‌, ఏకంగా న‌డుము లోతు నీళ్లలోకి వెళ్లి పంట పొలాల ప‌రిశీల‌న‌

VNS

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో వరదలు (AP Floods) పోటెత్తాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి రూరల్ మండలంలోని నందమూర్‌ గ్రామంలో పర్యటించారు.

Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో దారుణం, డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన మరో బస్సు డ్రైవర్, యాక్సిడెంట్ సీసీ కెమెరాలో రికార్డ్

Hazarath Reddy

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, చిన్న గొడవకే డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి చంపిన మరో డ్రైవర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మహా సముద్రం టోల్‌గేట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్‌ని.. మరో బస్సు డ్రైవర్ బస్సుతో తొక్కించి హతమార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్నింగ్‌ స్టార్‌, శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు వాగ్వాదం హద్దు మీరి ఈ హత్యకు కారణమైంది

Advertisement

Ragging in College Hostel: నరసరావుపేటలో కాలేజీలో ర్యాగింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్, ఘటనపై విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్‌ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎన్‌సీసీ ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు అర్థరాత్రి సమయంలో విచక్షణ రహితంగా చితకబాదారు. పదే పదే ఇలా చేస్తుండటంతో.. దెబ్బలు తట్టుకోక జూనియర్ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Kilari Rosaiah Resigns YSRCP: గుంటూరు జిల్లాలో వైసీపీని వీడిన మరో నేత, పార్టీకి రాజీనామా చేసిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా అదే బాటలో నడిచారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు రోశయ్య నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Y. S. Sharmila: వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో దిగి నిరసన తెలిపిన షర్మిల, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

Hazarath Reddy

భారీ వర్షాలకు నీటమునిగిన పంటలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆమె నడుము లోతు నీళ్లలో రైతుల సహాయంతో దిగి పరిశీలన చేశారు. నీళ్లలో దిగి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

YSRCP Protest in Delhi: ఏపీ దాడులపై కేంద్ర హోం మంత్రి వెంటనే స్పందించాలి, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు, వైఎస్‌ జగన్‌ పోరాటానికి అండగా నిలబడతామని వెల్లడి

Hazarath Reddy

సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్‌ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు.

Advertisement

Nara Lokesh on Talliki Vandanam Scheme: వీడియో ఇదిగో, ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు.

Andhra Pradesh Assembly Session: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

Hazarath Reddy

శాసనసభ మూడోరోజు సమావేశాల్లో భాగంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లుపై ఏపీ శాసనసభలో చర్చ జరుగుతోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్లు 2024 ను సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూమిపై యజమానులకు హక్కు లేకుండా చేయడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఉద్దేశంగా కనబడుతోందన్నారు

YSRCP Protest in Delhi: వీడియో ఇదిగో, వైసీపీ ధర్నాకు ఉద్దవ్‌ శివసేన మద్దతు, జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన ఎంపీ సంజయ్ రౌత్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ వైసీపీ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. జంతర్ మంతర్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు చేపట్టిన ధర్నాకు జాతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. సమాజ్ వాది పార్టీ ఎంపి అఖిలేష్ యావ్ ఇప్పటికే మద్దతు తెలిపారు. తాజాగా శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపారు

YSRCP Protest in Delhi: రేపు మేము అధికారంలోకి వస్తాం, ఢిల్లీ వేదికగా జగన్ మాస్ వార్నింగ్, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జాతీయ పార్టీలకు వైసీపీ అధినేత విజ్ఞప్తి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం.

Advertisement

YSRCP Protest in Delhi: వీడియో ఇదిగో, 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వేదికగా మండిపడిన జగన్

Hazarath Reddy

ఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి రాగలం.. నిన్న మేము అధికారంలో ఉన్నాం కానీ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రచారం చేయలేదని, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

YSRCP Protest in Delhi: విజయసాయి రెడ్డి కథను పక్క దారి పట్టించేందుకే ఈ ధర్నా, వైసీపీ నిరసనపై మండిపడిన టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో దాడులకు నిరసనగా వైసీపీ చేపట్టిన ధర్నాపై టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. ఫేక్ న్యూస్‌లన్నీ టీడీపీపైనే నిందిస్తున్నానని, ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా అవి టీడీపీనే చేయించినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019-2024 వరకు వైఎస్ జగన్ హయాంలో హింస, హత్యలు జరిగాయన్నారు.

YSRCP Protest in Delhi: దాడులు మంచివి కావు, రేపు మళ్ళీ జగన్ సీఎం కావచ్చు, వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలే మళ్లీ జగన్‌ను సీఎం చేస్తారు. టిడిపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది. భయంతో ప్రజాస్వామ్యంలో గెలవలేరు.

Andhra Pradesh: ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు ప్రతిపక్షం ఉండాల్సిందే, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

శాసనసభలో నాకు ప్రతిపక్ష నేత హోదానివ్వాల్సిన అవసరం గురించి నేను గతనెల 24న స్పీకర్‌కు అన్ని వివరాలతో లేఖ రాశాను. నిజానికి.. ఆయన మొదటినుంచీ నాపట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానే తప్ప చనిపోలేదని ఒకసారి.. నేను చచ్చేవరకు కొట్టాలని మరోసారి ఆయనన్నారు.

Advertisement
Advertisement