ఆంధ్ర ప్రదేశ్

NIA Raids In Anantapur: వామ్మో అనంత‌పురంలో ఉగ్ర లింకులు! రిటైర్ట్ హెడ్ మాస్ట‌ర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

VNS

ఏపీలోని అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. ఉగ్రవాదులతో (Terror Links) సంబంధాల కేసులో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని బెంగళూరులో నమోదైన కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

Andhra Pradesh: మే 24 నుంచి ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, పరీక్షల నిర్వహణ తేదీల వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి­చేసుకోవాలని వర్చువల్‌ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను కమిషనర్ ఆదేశించారు.

Andhra Pradesh: ఆస్పత్రి ఆవరణలో ఉమ్మేయకూడదన్నందుకు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసిన మందుబాబులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్రీకాకుళం - రణస్థలం మండల ప్రాథమిక ఆస్పత్రి ఆవరణలో వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు ఉమ్మేయడంతో అలా ఉమ్మకుడదని అన్నందుకు, మద్యం మత్తులో ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు, ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతుందని వెల్లడి

Hazarath Reddy

మహిళ కడుపులో 570 రాళ్లను సర్జరీ చేసి డాక్టర్లు తొలగించారు. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది.

Advertisement

Leopard in Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం, అలిపిరి నడకదారిలో కనిపించిన రెండు చిరుతలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

Monsoon for Telangana: జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు, ఈ నెల 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Rains: ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం, ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Hazarath Reddy

ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Tirumala Devotees Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. సెలవుల నేపథ్యంలో కొండపై ఇసుకేస్తే రాలనంత జనం.. ఆక్టోపస్‌ బిల్డింగ్‌ దాకా 3 కిలోమీటర్ల మేర క్యూలైన్‌.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Rudra

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు.

Advertisement

Vizag Horror: విశాఖపట్నంలో ఎన్‌ఏడీ జంక్షన్‌ లో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసిన యువకుడు.. వీడియో వైరల్

Rudra

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ లో ఓ మందుబాబు ఫూటుగా తాగి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేశాడు. దీంతో యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

New SP's For Three Districts: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామ‌కం, ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్ గా శ్రీ‌కేష్‌ బాలాజీ

VNS

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల(SPs) ను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీ శాలి(Gautami Shali ) , తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్(Harshavardhan) ‌, పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్‌ (Malika Garg) ను నియమించారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా డాక్టర్

Hazarath Reddy

విజయవాడలోని అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి ఈ దృశ్యాన్ని చూసి వెంటనే అక్కడికి వెళ్లి బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రెండు రాష్ట్రాల్లో భానుడు భగభగల నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు

Hazarath Reddy

ఆంధ్రప్ర­దేశ్‌లో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌­రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కార­ణాలను ఈ నివేదికలో నివేదించారు

Andhra Pradesh Elections 2024: వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు ఓవర్ యాక్షన్, సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి విచక్షణా రహితంగా దాడి

Hazarath Reddy

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.

CM Jagan on AP Election Results: వీడియో ఇదిగో, 151 ఎమ్మెల్యే స్థానాలకు పైన గెలవబోతున్నాం, 22 ఎంపీ స్థానాలకు మించి విక్టరీ కొడుతున్నాం, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్

Hazarath Reddy

ఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.

CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

ఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.

Advertisement

Tirumala Car Fire Video: తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారులో మంటలు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో బయటపడిన భక్తులు

Hazarath Reddy

తిరుపతి: తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో కారులో మంటలు చెలరేగాయి; డ్రైవర్ అప్రమత్తం కావడంతో భక్తులు సురక్షితంగా వాహనం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Ambati Rambabu: చంద్రబాబు పంచన నాలుగో కూటమిగా పోలీసులు చేరినా జగనన్నదే విజయం, ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

కూటమిలో నాలుగవ పార్ట్ నర్ గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసినా... జగన్ అన్నదే విజయం అని ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా పోలీసుల తీరుపై అంబటి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh: వైఎస్సార్ ఆసరా, జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల, రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధులు విడుదల చేయనున్న జగన్ సర్కారు

Hazarath Reddy

Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు ​​జారీ

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వా­లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి గురువారం మధ్యాహ్నం వివరణ ఇవ్వనున్నారు

Advertisement
Advertisement