ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Politics: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, కార్పొరేటర్ పదవికి, టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని శ్వేత

Hazarath Reddy

విజయవాడలో టీడీపీకీ మరో షాక్ తగిలింది. టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర​్‌ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్‌ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు.

Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణీ, కోస్తాంధ్రకు వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలకు చెన్నై మరోసారి విలవిల

Hazarath Reddy

చెన్నైకి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

AP Assembly Elections 2024: ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన, రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

sajaya

ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన.. రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్.. 9న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం.. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష.. 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్

Weather Forecast: ఏపీలో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు, దేశంలో పలు రాష్ట్రాల్లో వడగండ్లుతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ కేంద్రం

Hazarath Reddy

జనవరి 6-10 మధ్య తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy rainfall, hailstorm ) కురుస్తాయని IMD అంచనా వేసింది. జనవరి 8-9 తేదీల్లో J&K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

AP Govt ESMA on Anganwadis: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ AP ప్రభుత్వ ఆదేశాలు జారీ.. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు..

sajaya

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నాడు కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మెకు వ్యతిరేకంగా నిత్యావసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా)ను అమలు చేయడం ద్వారా గట్టి వైఖరిని తీసుకుంది.

Ambati Rayudu Quits YSRCP: వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటిరాయుడు రాజీనామా..రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ట్వీట్..

sajaya

ఇటీవల వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’’ అని తెలిపారు. ఇటీవలే సీఎం జగన్‌ సమక్షంలో వైస్‌ఆర్‌సిపీలో అంబటి రాయుడు చేరిన విషయం తెలిసిందే.

Andhra Pradesh: అర్హులై పథకాలు అందని 68,990 మంది ఖాతాల్లో రూ.97.76 కోట్లు జమచేసిన సీఎం జగన్, లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్‌ కావొద్దని వెల్లడి

Hazarath Reddy

గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్‌ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్‌ (Andhra Pradesh CM Jagan Mohan Reddy) తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

Yatra 2 Movie Trailer: నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాత్ర 2 టీజర్, జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్ అంటూ..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా యాత్ర 2' సినిమా తెరకెక్కిన సంగతి విదితమే. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.ఈ టీజర్‌లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్..

Advertisement

MLC Parvartha Reddy Car Accident: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి కారుకు ప్రమాదం.. ఎమ్మెల్సీ తలకు గాయాలు.. అక్కడికక్కడే మృతిచెందిన పీఏ.. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం (వీడియో)

Rudra

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్‌ లో ఆయనకు గాయాలయ్యాయి.

UPI Charges: యూపీఐ పేమెంట్లపై వారికి ఛార్జీలు.. ఎన్‌పీసీఐ చీఫ్‌ దిలీప్‌ అస్బే కామెంట్స్‌

Rudra

రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ దిలీప్‌ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు.

TDP Leaders Fight Video: వీడియో ఇదిగో, తిరువూరులో రక్తమెచ్చేలా తన్నుకున్న టీడీపీ తమ్ముళ్లు, అడ్డు వచ్చిన ఎస్ఐ సతీష్‌పై దాడి, మొత్తం 49 మందిపై కేసులు నమోదు

Hazarath Reddy

తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఘర్షణలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు గాయాలు అయ్యాయి. కేశినేని నాని వర్గం 28 మందిపై, కేశినేని చిన్ని వర్గం 21 మందిపై కేసు నమోదు చేశారు.

CM Jagan Meet KCR: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌, ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన కేటీఆర్

Hazarath Reddy

సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కాలి తుంటికి శస్త్ర చికిత్స అనంతరం నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే.

Advertisement

Visakhapatnam: వీడియో ఇదిగో, ప్రభుత్వ హాస్టల్ గోడదూకి 31న రాత్రి మందు పార్టీ చేసుకున్న ఆరో తరగతి విద్యార్థులు

Hazarath Reddy

విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నుంచి పది చదువుతున్న 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న రాత్రి ఫుల్లుగా మందుకొట్టి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి

YS Sharmila Joins Congress: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల, అధికారికంగా హస్తం పార్టీలో విలీనమైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ

Hazarath Reddy

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన షర్మిలా రెడ్డి.. గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

Andhra Pradesh Elections 2024: ఏపీలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేసేలా ఈసీ కసరత్తు, ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం

Hazarath Reddy

వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 9,10 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం (Election Commission) ఏపీలో పర్యటించనుంది. సీఈసీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌‌కు రానుంది.

Gadikota Dwarakanath Reddy Joins TDP: వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తదితరులు

Hazarath Reddy

మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బావ అయిన ద్వారకానాథరెడ్డి ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానించారు.

Advertisement

CM Jagan To Meet KCR: రేపు కేసీఆర్‌తో భేటీ కానున్న సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్‌ గజ్వేల్‌ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే.

CM Jagan Slams Chandrababu: పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తూ రాజకీయాలు చేస్తున్నారు, చంద్రబాబుపై మండిపడిన సీఎం జగన్, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (YSR Pension Donation Enhancement Program) వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్ (CM Jagan Mohan ReddY). సభలో సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్‌ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి

AP Three Capitals Case: సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా, ఈ లోగా అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ వాయిదా పడింది. అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది

YSRCP 2nd List : 27 మంది ఇంఛార్జులతో వైసీపీ రెండో జాబితా విడుదల...వారసులకు టిక్కెట్లు, ఎంపీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు..

sajaya

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులుగా పేర్కొనగా, ముగ్గురు శాసనసభ్యులను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు.

Advertisement
Advertisement