ఆంధ్ర ప్రదేశ్

MBBS Students Fight Video: వీడియో ఇదిగో, క్లాస్ రూంలోనే చితకబాదుకున్న కాబోయే డాక్టర్లు, ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో గ్రూపు వార్, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో కొంత మంది మెడికల్ విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే కొట్టుకున్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు క్లాస్ రూంలోనే చితకబాదుకున్నారు.ఈ ఘర్షణలో కొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు

AP FiberNet Scam: ఏపీ పైబర్ నెట్ కేసులో కీలక పరిణామం, నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి, రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు విచారణ వాయిదా

Hazarath Reddy

ఏపీ పైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

AP Weather Update: ఏపీలో మొదలైన వానలు, రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కలిసిపోయి కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు 

Hazarath Reddy

కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఈ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ తెలిపింది.

Chandrababu Bail Row: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు జగన్ సర్కారు, అత్యున్నత న్యాయస్థానం నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని వెల్లడి

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబుకి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పూర్తిస్థాయి బెయిల్‌గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Advertisement

Andhra Pradesh: ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల నిధులు విడుదల, 23,458 కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్

Hazarath Reddy

గోదావరి జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను సీఎం విడుదల చేశారు

CM Jagan: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు.. వర్షం కారణంగా హెలికాప్టర్‌ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో నిర్ణయం

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మంగళవారం చేపట్టాల్సిన పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

CM Jagan Review on AP Bifurcation Act: విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం, 13వ షెడ్యూల్‌ ప్రకారం మన నిధులు మనకు రావాల్సిందే, విభజన చట్టంపై సీఎం జగన్ సమీక్ష హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రేపు(మంగళవారం) కేంద్ర హెంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి అధి​కారులు హాజరుకానున్నారు. ఈ మేరకు అక్కడ చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Visakhapatnam Harbour Fire: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం, బాధితులకు బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, ప్రమాదానికి కారణాలు ఏంటంటే..

Hazarath Reddy

విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

WC 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో యువకుడు మృతి, తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తాజాగా తిరుపతి జిల్లాలో భారత్ పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడు గుండుపోటుతో మరణించాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

Skill Development Scam Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఊరట, రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు ఎలా సాగాయంటే..

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది

Visakhapatnam Fishing Harbour Fire: అర్థరాత్రి ఆ మందు పార్టీయే కొంప ముంచిందా, విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదానికి కారణాలను వెలికితీసున్న పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్నవారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి

Andhra Pradesh Fire: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఘోర అగ్నిప్రమాదం, 40కిపైగా బోట్లు దగ్ధం, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, బాధితులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారంగా.. మొదటగా ఒక పడవతో మంటలు ప్రారంభమయ్యి.. చివరకి 40 పడవల దాకా వ్యాపించాయి.

Advertisement

Rats Gnawed Currency: పెళ్లికోసం దాచిన సొమ్మును ముక్క‌లు ముక్క‌లుగా కొరికిపారేసిన ఎలుక‌లు, రూ. 2ల‌క్ష‌ల ఎలుక‌ల పాల్వ‌డంతో కుటుంబమంతా కన్నీరు మున్నీరు

VNS

కూతురి పెళ్లి కోసం రూ.2 లక్షలు సొమ్ము ట్రంకు పెట్టెలో (Box) దాచి పెట్టాడు ఆమె తండ్రి. కూతురి పెళ్లి చేయకుండానే కన్నుమూశాడు. అతను చనిపోయాక పెట్టె తెరిచి చూసిన అతని తల్లిదండ్రులు షాకయ్యారు. ఎలుకలు కరెన్సీ నోట్లను మొత్తం కొరికి పారేశాయి(Rats Gnawed Currency). కష్టపడి కొడుకు దాచిన సొమ్ము ఎలుకల పాలవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

AP Liquor Prices Hike: ఆంధ్ర మందుబాబులకు బ్యాడ్ న్యూస్...క్వార్టర్‌ సీసాపై రూ. 40, ఫుల్‌ బాటిల్‌పై రూ.90 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం..

ahana

క్వార్టర్ బాటిల్‌కు రూ.10-40, హాఫ్ బాటిల్‌కు రూ.10-50, ఫుల్ బాటిల్‌కి .10-90 రూపాయల వరకూ పెరిగాయి. మరోవైపు, కొన్ని ఇతర బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఈ సవరణల లక్ష్యం అన్ని రకాల మద్యం బ్రాండ్‌లకు సమాన పన్ను విధించడమే అని అధికారులు చెబుతున్నారు.

Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?

Rudra

వాడకంలో లేని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.

Cyclone Mythili Update: ఏపీకి తప్పిన మిధిలీ తుపాను ముప్పు, అయినా పొంచి ఉన్న మరో గండం, రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న సైక్లోన్

Hazarath Reddy

త్వరలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisement

Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌, మూడు 10 రూపాయల నోట్లతో స్కిల్ స్కామ్ నడిపారంటూ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు

Weather Forecast: విశాఖకు 420 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం, అల్లకల్లోలంగా మారిన సముద్రం, రానున్న మూడు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది బుధవారం రాత్రి విశాఖ­పట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన, బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, పలు పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

VNS

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా (Air Circulation In Bay Of Bengal) మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Air Circulation In Bay Of Bengal) తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్ 480కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.

Skill Development Scam Case: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement
Advertisement