ఆంధ్ర ప్రదేశ్

Rachamallu Sivaprasad Reddy: దటీజ్ రాచమల్లు, కులం, మతం, డబ్బు చూడకుండా కూతురికి ప్రేమ పెళ్లి జరిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

Hazarath Reddy

Constable Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్, సహచరులు వేగంగా స్పందించి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు

Hazarath Reddy

గుండెపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య మృతి చెందారు. కడప జిల్లా - సిద్దవటం మండలం భాకరాపేట 11వ ఏపీఎస్పీ 1994 బ్యాచ్ కు చెందిన సుబ్బయ్యకు ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గుర్తించిన సహచరులు డాక్టర్ల సాయంతో సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

Tomato Prices Down: వీడియోలు ఇవిగో, ధరలు లేక టమాటాలను పారబోసి వెళుతున్న రైతులు, మొన్నటి వరకు చుక్కలు తాకిన ధరలు

Hazarath Reddy

మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు (Tomato Prices) ఒక్కసారిగా పతనమయ్యాయి. మంగళవారం (సెప్టెంబర్ 5న) టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయి మార్కెట్‌లో టమాటా ధరలు మరింత పడిపోయాయి.

Sanatana Dharma Remark Row: విజయవాడలో సనాతన ధర్మం ప్రకంపనలు, స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన జన జాగరణ సమితి

Hazarath Reddy

ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మ రిమార్క్ ప్రకంపనలు ఏపీలోని విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటిస్తూ జన జాగరణ సమితి నగరం అంతటా పోస్టర్లు ఏర్పాటు చేసింది. వీడియో ఇదిగో..

Advertisement

Scorpion Festival: కర్నూలు జిల్లాలో ఘనంగా తేళ్ల పండగ వేడుక, తేళ్లతో దేవుడికి నైవేద్యం సమర్పించిన భక్తులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో జరిగిన తేలు పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండగలోకి వెళితే..ఈ గ్రామ ప్రజలు తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు దాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్సిస్తారు. ఇది వారి ఆచారం.

TTD: నడక దారిన వెళ్లే భక్తులకు కర్రలు పంచిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పని కట్టుకొని విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

తిరుమల నడక దారిన వెళ్లే భక్తులకు టీటీడీ చైర్మన్ కర్రలు పంచారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు నుండి చేతికర్రలు పంపిణి చేస్తున్నాం. కర్రలు ఇచ్చినంత మాత్రన మేము చేతులు దులుపుకుంటునట్లు కాదు. యాత్రికులకు తోడుగా రక్షకులు కూడా నడుస్తారు. రొటేషన్ పద్దతిలో కర్రలను వాడుతాం. పని కట్టుకొని విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Chandrababu Naidu: వీడియో ఇదిగో, తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాద్‌లో 100 కోట్లకు ఎకరం పోతుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు. అది సంపద సృష్టించే విధానమని చంద్రబాబు నాయుడు అన్నారు.

Cheetah Trapped: తిరుమల నడకమార్గంలో చిక్కిన మరో చిరుత, రెండు నెలల్లో ఐదు చిరుతలను బంధించిన అధికారులు, నడకదారి భక్తులకు చేతికర్రల పంపిణీ షురూ

VNS

ఇప్పటికే రెండు నెలల కాలం వ్యవధిలో తిరుమల నడక మార్గం (Tirumala Walkway) లో నాలుగు చిరుతలను అధికారులు బంధించారు. తాజాగా గురువారం తెల్లవారుజామున ఐదో చిరుత అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది.

Advertisement

Chandrababu Naidu: రెండు తెలుగు రాష్ట్రాలకు సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చింది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు లేవని బద్ద శత్రువుల్లా ఎప్పుడూ కొట్లాడుకుంటాయనే రీతిలో మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చిందని అన్నారు. వీడియో ఇదిగో

Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో, నిప్పులా బతికాను నేను ఏతప్పూ చేయలేదు, అయినా రేపో మాపో నన్ను అరెస్ట్ చేస్తారని వెల్లడి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Weather Forecast: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు, మ‌రో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను మళ్లీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం ప్రకటించింది.

Road Accident Video: వీడియో ఇదిగో, మనిషి చనిపోతున్నా ఎవరు పట్టించుకోలేదు, కావాలంటే విశాఖపట్నంలో జరిగిన ప్రమాదం వీడియో చూడండి

Hazarath Reddy

విశాఖపట్నం - ఆనందపురం మండలంలోని నీలకుండీలు జంక్షన్ వద్ద బైక్ మీద వెళ్తున్న జోగ సురేష్ అనే యువకుడిని లారీ ఢీకొట్టడంతో మృతి.అయితే రోడ్డున ఎవరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. ప్రమాదం ఘటనను చూస్తూనే రోడ్డు మీద అలా వెళ్లి పోయారే తప్ప ఏం జరిగిందోనని అతని దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయలేదు.

Advertisement

Heavy Rains in Telangana: తెలంగాణవ్యాప్తంగా మ‌రో ఐదు రోజులు కుండపోత‌.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Tirumala: గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం, యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం, టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గోవిందా అని కోటిమార్లు వ్రాస్తే వారికి వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.

Sanatana Dharma Remark Row: సనాతన ధర్మం మతం కాదు అదొక జీవనయానం, ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపిన టీటీడీ చైర్మన్

Hazarath Reddy

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి, కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు

Telangana Shocker: చేతబడి నయం చేస్తానంటూ నవ వధువుపై మంత్రగాడు దారుణం, థెరపీ ముసుగులో కళ్ళకు గంతలు కట్టి బట్టలు విప్పి అక్కడ ముద్దు పెట్టి రాక్షసంగా..

Hazarath Reddy

చేతబడి నయం చేస్తానన్న నెపంతో నవ వధువుపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని తెలంగాణలోని బండ్లగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Advertisement

AP Shocker: పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ ఫోన్.. యువకుడి దుర్మరణం.. అనకాపల్లి లో సోమవారం ఘటన

Rudra

పిడుగుపడటంతో జేబులోని సెల్‌ ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రానున్న 3-5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. తెలంగాణలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కోస్తా ఆంధ్రకు భారీ వర్ష సూచన

Rudra

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల అవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

Andhra Pradesh: అయ్యో పాపం, ఆడుకుంటూ ట్రాక్టర్ టైరు మీద పడి చిన్నారి మృతి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదకర ఘటన

Hazarath Reddy

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలోని ఐడిఏలో వాచ్ మెన్ పుట్టా జోజి, స్వప్న దంపతుల కుమారుడు రెండేళ్ల ఇస్సా ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ టైర్ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు టైర్ బాలుడిపై పడటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ బయటకు వచ్చింది.

Andhra Pradesh: అక్రమ సంబంధం అనుమానం, భార్యతో పాటు మరో వ్యక్తికి సగం గుండు కొట్టించిన భర్త, చెప్పుల దండతో ఊరంతా ఊరేగించిన ఆమె అత్తింటివారు

Hazarath Reddy

శ్రీసత్య సాయి జిల్లాలోని లేపాక్షి మండలంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త..తన భార్య, మరో పురుషుడి జుట్టును సగం కత్తిరించారు. ఈ దారుణానికి కోడలి అత్తమామలు కూడా సహకరించారు. వారిద్దిరికీ మెడకు చెప్పులు కట్టి గ్రామంలో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Advertisement
Advertisement