ఆంధ్ర ప్రదేశ్
Division of AP Bhavan: ఏపీ భవన్ విభజన, ఆంధ్రప్రదేశ్‌కు 12.09 ఎకరాలు, తెలంగాణకు 7.64 ఎకరాలు, తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చిన కేంద్రం
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం దీనికి సంబంధించిన వివరాలను గురువారం విడుదల చేసింది.
Weather Forecast: రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న భారీ వర్షాలు
Hazarath Reddyఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Pathetic Incident In Siddipet: వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషుల తీర్పు.. జీర్ణించుకోలేకపోయిన ఆ 90 ఏండ్ల పెద్దాయన ఏం చేశాడో తెలుసా? సొంతగా చితి పేర్చుకుని.. ఆ తర్వాత.. సిద్దిపేట జిల్లాలో హృదయాన్ని పిండేసే ఘటన
Rudraసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన తాజా ఘటన అందరి హృదయాలను పిండేస్తోంది. మానవతావాదులు కన్నీరుపెట్టుకునే ఘటన ఇది. కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ 90 ఏండ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం
Rudraతెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Penumbral Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే.. నేటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే? భారత్‌లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా మరి??
Rudraఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం నేడు ఏర్పడబోతోంది. నేటి గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ‘పెనుంబ్రల్ గ్రహణం’ అంటారు. అంటే ఏమిటంటే??
CM Jagan in Action: జీవో నంబర్-1 అమలుపై సీఎం జగన్ కీలక ప్రకటన, రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు రాకుండా సమర్ధవంతంగా దాన్ని అమలు చేయాలని డీజీపీకి ఆదేశాలు
Hazarath Reddyహోంశాఖ సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు.
YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులను రేపు విడుదల చేయనున్న జగన్ సర్కారు
Hazarath Reddyజనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని రేపు(శుక్రవారం) తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
AP SSC Results 2023: విద్యార్థులకు అలర్ట్, ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు. ఫ‌లితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాల‌నుకుంటే.. ఫ‌లితాలు విడుద‌లైన వారం రోజుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.
IMD Alert On Cyclone: ఈ ఏడాది బంగాళాఖాతంలో తొలి తుపాను వచ్చేస్తోంది, ఒడిషాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం, ఏపీలో మరికొద్ది రోజులు భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాఖాతం (బీవోబీ)లో మే 9న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది.మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని, మే 7న అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారుతుందని, మరుసటి రోజు ఈ వ్యవస్థ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.
Amaravati Land Scam: అమరావతి కుంభకోణంలో ఎవ్వర్నీ వదిలిపెట్టం, అవినీతి మొత్తం బయటకు తీసి అందర్నీ అరెస్టు చేస్తాం, సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
Hazarath Reddyరాజధాని అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సిట్‌ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.
Amaravati Land Scam: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట, సిట్‌పై హైకోర్టు స్టేని కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం, మెరిట్ ప్రాతిపదికన విచారించాలని కీలక తీర్పు
Hazarath Reddyచంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Bhogapuram Airport Laid Event: ఉత్తరాంధ్రకు కిరీటంగా భోగాపురం ఎయిర్‌పోర్టు, రాబోయే రోజుల్లో జాబ్‌ హబ్‌గా శ్రీకాకుళం, Bhogapuram Airportకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
Hazarath Reddyభోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కిరీటంగా మారబోతుందన్నారు సీఎం జగన్. ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Old Bridge Collapsed in AP: శ్రీకాకుళం జిల్లాలో బహుదా నదిపై కుప్పకూలిన పాత వంతెన, 70 టన్నుల రాయి లోడ్‌తో లారీ బ్రిడ్జిపై వెళ్తుండగా కూలిన వంతెన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో బహుదా నదిపై నిర్మించిన పాత వంతెన అక్కడి నుంచి 70 టన్నుల బరువున్నరాతితో లారీ వెళ్తుండగా కూలిపోయింది. బ్రిడ్జి కూలిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Old Bridge Collapsed: శ్రీకాకుళంలో కుప్పకూలిన బ్రిడ్జి, భారీలోడ్‌ తో లారీ వెళ్తుండగా ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్
VNSశ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ పాత బ్రిడ్జి (old bridge collapsed) కుప్పకూలింది. బ్రిడ్జి మీద నుంచి భారీ లోడ్‌తో వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బాహుదా నది (Bahuda river) సమీపంలోని పాత బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
Lay Stone for Bhogapuram International Airport: నెరవేరనున్న ఉత్తరాంధ్రవాసుల కల, భోగాపురంలో రూ.3500కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్, పాల్గొననున్న గౌతమ్ అదానీ
VNSఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్రవాసులు ఎదురుచూస్తున్న భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు(Bhogapuram international airport) సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లాలో 3,500 కోట్ల ఖర్చుతో 2,200 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించబోతోంది.
Cyclone Mocha: తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ గండం, మోచా ఎఫెక్ట్‌ తో మరో ఐదురోజుల పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం, ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై అధికారులు అప్రమత్తం, హైదరాబాద్‌లోనూ కుండపోత
VNSతెలంగాణ, ఏపీకి మరో గండం పొంచి ఉంది. మరో ఐదు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే (Rain alert) అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
Balineni Meet CM Jagan: బుజ్జగింపులు షురూ, సీఎం జగన్‌తో భేటీ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, గత కొంత కాలంగా అసంతృప్తితో ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే
Hazarath Reddyమాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.
AP Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు అలర్ట్, భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపిన వాతావరణ శాఖ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని..దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు, కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీలో పెట్టుబడుల పెట్టేందుకు వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి
Hazarath Reddyక్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గ్రీన్‌ హైడ్రోజన్, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించిన యూఏఈ రాయబారి.
Tirumala Terrorist Threat Mail: తిరుమలలో టెర్రిరిస్టులు మెయిల్ ఫేక్, ఎలాంటి ఉగ్రవాదుల కదలికలు లేవని స్పష్టం చేసిన ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి
Hazarath Reddyప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి మెయిల్‌ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు.