ఆంధ్ర ప్రదేశ్
AP Partition Case: ఏపీ విభజన కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, విచారణ జాబితాలో వాటిని చేర్చాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ విభజన కేసు విచారణను (AP Partition Case) వచ్చే మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ వికాస కేంద్ర తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్లు నేడు జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్నల ధర్మాసనం ముందుకొచ్చింది.
Heatwave in Andhra Pradesh: ఏపీలో భానుడు భగభగలు, వారం రోజుల పాటు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక, 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
Hazarath Reddyఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
BRS Status In AP: బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ.. ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ కు నిరాశ.. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ నిర్ణయం
Rudraపొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది.
Fishing Ban in Andhra Pradesh: ఏపీలో 61 రోజులు చేపల వేటపై నిషేధం, ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపిన రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు
Hazarath Reddyఏపీలో రెండు నెలల పాటు చేపల నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ నిషేధం మెకనైజ్డ్ (యాంత్రిక), మోటార్ బోట్లకు వర్తిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.
Supreme Court: కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, రాష్ట్రంలో కరోనాతో 14 వేల మందికి పైగా మృతి
Hazarath Reddyకరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం అందజేయని అంశాన్ని పరిశీలించాలంటూ ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
AP Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే ఐదు రోజులు మండిపోనున్న ఎండలు, బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఆదివారం నుంచే అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
CM Jagan in Action: ఏపీలో కరోనా అలర్ట్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, కోవిడ్‌ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలు
Hazarath Reddyవైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈరోజు(సోమవారం) విద్యాశాఖపై సమీక్ష అనంతరం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్‌ ప్రధానంగా సమీక్ష నిర్వహించారు.
Tirumala Tirupati: వరుస సెలవులతో తిరుమల కొండపై భక్తుల రద్దీ.. స్వామి వారి దర్శనానికి 30 గంటలుపైనే.. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారే రావాలని టీటీడీ విజ్ఞప్తి
Rudraగుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్ డే, సండే ఇలా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది.
Corona Virus: కరోనా కారణంగా గుండెపోటు ముప్పుతో పాటు ఇంకా ఎన్నో జబ్బులు.. వైద్య నిపుణుల హెచ్చరిక
Rudraకరోనా కలకలం మళ్ళీ తీవ్రమవుతున్నది. దేశంలో కరోనా క్రమంగా తీవ్రమవుతున్నది. యాక్టివ్‌ కేసులు 31 వేలు దాటాయి. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు పలు కీలక అంశాలు చెబుతున్నారు. పదే పదే కొవిడ్‌ బారిన పడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని, గుండె, ఊపిరితిత్తులపై దాని ప్రభావం అధికంగా ఉంటున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
IMD Weather Updates: రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పైపైకి.. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పది రాష్ట్రాల్లో వడగాల్పులు.. ఐఎండీ అంచనా
Rudraదేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
Huge Rush in Tirumala: టైమ్‌ స్లాట్ టోకెన్లు ఉంటేనే తిరుమలకు రండి! వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, సర్వదర్శనానికి 30 గంటల టైమ్
VNSతిరుమలలో (TTD Rush) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు (Tirumala) భక్తులు పోటెత్తారు. దీంతో శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టమెంట్‌లు నిండిపోయి ఔటర్‌ రింగ్‌రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి.
Chandrababu Selfie Challenge: సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరిన చంద్రబాబు, టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ ఫోటో దిగి సవాల్ విసిరిన టీడీపీ అధినేత
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు శుక్రవారం సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి తన టీడీపీ ప్రభుత్వం నిర్మించిన పేదల ఇళ్ల ముందు దిగిన సెల్ఫీలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Mekapati Rajamohan Reddy: నా తమ్ముడి పంచన ఓ దుష్టశక్తి చేరింది, చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్‌పై స్పందించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉదయగిరి ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని వెల్లడి
Hazarath Reddyమాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy) తన సోదరుడి క్రాస్ ఓటింగ్ అంశంపై స్పందించారు. తన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనని అన్నారు. తన మాట వినకుండా చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు.
Kiran Kumar Reddy Joins BJP: బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా వేసుకున్నారు
Balakrishna Slams CM Jagan: జగన్‌కు పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు, యువగళం పాదయాత్రలో మండిపడిన బాలయ్య, మళ్లీ సైకో పాలన వస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వెల్లడి
Hazarath Reddyఅనంతపురం జిల్లా శింగనమలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు.మార్తాడులోని క్యాంప్‌ సైట్‌ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Unprecedented Rush at Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, 30 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్న భక్తులు, 3 రోజులు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి..
Hazarath Reddyతిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
Jagananne Maa Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం, ఈ నెల 20వ తేదీ వరకూ 175 నియోజకవర్గాల్లో కొనసాగనున్న కార్యక్రమం, ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం
Hazarath Reddyరాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి నేటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టింది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ సైనికులుగా పార్టీ పదాతిదళం ప్రతి ఇంటికీ వెళ్తుంది.
Ranga Marthaanda: ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?
Rudraప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన చిత్రం 'రంగమార్తాండ'. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
One Rupee Biryani: ప్రకాశం జిల్లాలో రూపాయికే బిర్యానీ ఆఫర్.. ఇక ఏమవుతుంది?? అదే జరిగింది.. దాంతో రెస్టారెంట్ నిర్వాహకులు ఏం చేశారంటే??
Rudraరూపాయికే దమ్ బిర్యానీ అంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా అదే చేశారు. కట్ చేస్తే, తోపులాటలు, ట్రాఫిక్ జామ్. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిందీ ఘటన.
AP IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఒకేసారి 56 మందికి స్థాన చలనం.. జాబితాలో 8 జిల్లాల కలెక్టర్లు కూడా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి
Rudraఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం కల్పించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా 56 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం అర్ధ రాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేశారు.