ఆంధ్ర ప్రదేశ్

Ali Daughter Wedding Reception: వీడియో, అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్, నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లోని శ్రీకన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Dr KS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్‌ కొత్త సీఎస్‌గా కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, డిసెంబర్‌ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ బాధ్యతలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి నియామకమయ్యారు. కొత్త సీఎస్‌గా జవహర్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు.

AP Minister Roja Fell Down: నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!

Rudra

ఏపీ మంత్రి రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. నగరి డిగ్రీ కాలేజీలో క్రీడా సంబరాలను నిన్న ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా కబడ్డీ ఆడుతూ రెయిడ్ కు వెళ్లి అనుకోకుండా పడిపోయారు.

AP Police Recruitment 2022: ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదలైంది. ఇక, ఫిబ్రవరి 19న ఎస్‌ఐ పోస్టులకు, జనవరి 22న కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

Three Capitals Row: రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం, తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా

Hazarath Reddy

అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

YSR Sunna Vaddi Scheme: రూ.199.94 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపీ ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

రబీ 2020–21, ఖరీఫ్‌–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ (YSR Sunna Vaddi Scheme), ఖరీఫ్‌–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

Jyotiba Phule Death Anniversary: మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన సీఎం జగన్

Hazarath Reddy

మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

AP Pilgrims Rescued: పెను ప్రమాదం నుంచి బయటపడిన నిడదవోలు వాసులు.. నిడదవోలు నుంచి వారణాసికి 120 మంది.. గంగానదిలో బోటులో వెళ్లిన 40 మంది.. నదిలో కొంతదూరం వెళ్లాక బోటుకు చిల్లు.. బోల్తాపడిన బోటు.. అందరినీ రక్షించిన స్థానికులు

Rudra

కాశీలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ఏపీలోని నిడదవోలు వాసులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

Advertisement

Jesus Christ On Receipts: విశాఖ ట్రాఫిక్ పోలీసుల రసీదులపై ఏసుక్రీస్తు బోధనలు.. ఆటోలకు జారీ చేసే రసీదులపై ప్రింట్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

Rudra

విశాఖపట్టణం ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఆటో రసీదులు వివాదానికి దారితీశాయి. ఆ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ఉండడమే దీనికి కారణం.

Sabarimala Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. మరో 38 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. డిసెంబరు, జనవరి నెలల్లో అందుబాటులోకి

Rudra

శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

CM Jagan in Action: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, రోడ్డు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్, తద్వారా రియల్‌టైం మానిటరింగ్‌ చేసే అవకాశం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

Hazarath Reddy

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష (Cm YS Jagan reviews on housing dept) నిర్వహించారు. ఈ సందర్భంగా నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Projects in Telugu States: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త, రూ.573.13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం, రోడ్ల విస్తరణ, ప్రధాన పర్యాటక ప్రాంతాలను కలిపేలా రోడ్ల నిర్మాణం

Hazarath Reddy

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Central Minister Nitin Gadkari) బుధవారం నాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రూ. 573.13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు (Rs 573 crore for Telangana and Andhra Pradesh) ఆమోదం తెలిపారు,

Advertisement

Ippatam Demolitions Row: ఇప్పటం కేసులో పిటిషనర్లకు రూ. లక్ష జరిమానా, తప్పుడు సమాచారంతో కోర్టును తప్పు దోవ పట్టిస్తారా అంటూ ఏపీ హైకోర్టు ఆగ్రహం

Hazarath Reddy

ఇప్పటం ఇళ్లు కూల్చివేశారంటూ వేసిన కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ( AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష (fined one lakh to petitioners) చొప్పున హైకోర్టు జరిమానా విధించింది.

Andhra Pradesh: టీడీపీ మాజీ ఎంపీపీ హత్యాయత్నం కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు, మీడియాకు వివరాలను వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాస్‌

Hazarath Reddy

ఏపీలో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో (attempted murder Case) నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ (Police arrested accused) చేసినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. తునిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు

Gidugu Rudraraju: ఏపీ కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్‌గా గిడుగు రుద్రరాజు, 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసిన అధిష్టానం, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసిరెడ్డి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ వచ్చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు.

Sankalp Siddhi Cheating: లక్ష కడితే మూడు లక్షలు రిటర్న్, విజయవాడలో రూ. 1500 కోట్లకు పైగా వసూలు చేసిన సంస్థ, వస్తువులు కొంటే డబ్బులు వస్తాయంటూ ప్రజలు ఎర, ఇద్దర్ని చేర్పిస్తే మీ డబ్బులు వాపస్ అంటూ ప్రచారం

Naresh. VNS

ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసింది. దాదాపు రూ.1500 కోట్ల వరకు సంకల్ప సిద్ధి మార్ట్ లో టర్నోవర్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి సంస్థ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

TTD: వ‌యోవృద్ధులైన శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఈ నెల 24న డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టికెట్ల కోటా విడుదల, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని కోరిన టీటీడీ అధికారులు

Hazarath Reddy

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు (senior citizens on Nov 24) వీలుగా డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను (TTD to release December’s quota) ఈనెల 24 న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

Andhra Pradesh:చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నా, రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీలో సీఎం జగన్

Hazarath Reddy

రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్‌ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అన్నారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు.

Andhra Pradesh: లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచిందనే వార్త వైరల్, కడియపులంక లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో వింత ఘటన

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వింత జరిగింది. కార్తీక మాసంలో ఆఖరి రోజున కడియం (Kadiyam) మండలం కడియపులంక (Kadiyapulanka) చింతలోని లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన భక్తులకు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచి కనిపించిందట. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

Weather Forecast: బలహీనపడిన వాయుగుండం, ఏపీకి తప్పిన భారీ వర్షాల ముప్పు, నెల్లూరు జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది.

Advertisement
Advertisement