ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan At Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సరస్వతీ దేవీ అవతారంలో దుర్గమ్మ, ప్రత్యేక పూజలు చేసిన పవన్
Arun Charagondaవిజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్నారు పవన్. అనంతరం ప్రత్యేక పూజలు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని లక్షలాదిగా దర్శించుకోనున్నారు భక్తులు.
Disciplinary Action On PV Sunil: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై వేటు, ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో జారీ
Arun Charagondaఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. సాధారణ పరిపాలనాశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబర్ 1695 జారీ చేసింది.
FSSAI Lab At Tirumala: తిరుమలలో FSSAI ల్యాబ్, ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం,22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి సత్యకుమార్
Arun Charagondaతిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేయనుంది FSSAI. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను పెంచేందుకు 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు...ఆహార భద్రతా ప్రమాణాల చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి.
Sayaji Shinde Meet Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే, ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు ఇవ్వాలని సూచన
Vikas Mఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పిఠాపురంలో మైనర్ బాలికపై టీడీపీ నేత దారుణ అత్యాచారం, బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో..
Hazarath Reddyకాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై టీడీపీ పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.
Duvvada Srinivas: వీడియో ఇదిగో, తిరుమలలో ప్రియురాలితో దువ్వాడ శ్రీనివాస్, పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాధురి
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులిచ్చారు.
Theft Caught on Camera: పట్ట పగలు చైన్ స్నాచింగ్ వీడియో ఇదిగో, వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా మెడలోంచి తాళిబొట్టు లాక్కెళ్లిన దుండగులు
Hazarath Reddyతుని పట్టణంలో పట్ట పగలు చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పోస్ట్ ఆఫీస్ వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా ఆ మహిళ మెడలోంచి దుండగులు తాళిబొట్టును లాక్కెళ్లారు. బైకుపై ఇద్దరు యువకులు పరారయ్యారు. కాగా అక్కడున్న సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
Chandrababu Meet PM Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం నిధులుపై చర్చలు, విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లుగా వార్తలు
Hazarath Reddyరెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
KA Paul on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఎ పాల్, మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Nandigam Suresh: దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌కు 14 రోజులు రిమాండ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే..
Hazarath Reddyవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్ జైలులోనే ఉన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గ గుడిలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు, నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడుతూ కెమెరాకు..
Hazarath Reddyపేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, 5 నెలల చిన్నారిని బస్టాండ్‌లో వదిలి వెళ్లిన మహిళ, బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని అటే..
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో APSRTC బస్ స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ RTC బస్ స్టాండ్ ప్రాంగణములో ఉన్న మరో మహిళకు తన 05 నెలల చిన్న పాపను ఇచ్చి తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తానని వెళ్లి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, చీరాల బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోతోండగా సముద్రంలోకి వెళ్లి సాహసం
Hazarath Reddyఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి షేక్ భాషా (44) సముద్రంలోనికి కొట్టుకుపోతుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి యాత్రికుడు ప్రాణాలను రక్షించి ఒడ్డుకు చేర్చారు.
Vizag Honey Trap Case: వైజాగ్‌లో హానీ ట్రాప్ కేసు వెలుగులోకి, యువకులని రూంకి పిలిచి న్యూడ్‌లో ఉండగా ముఠా ఎంటర్, ఫోటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్
Hazarath Reddyరూంకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి.. అనంతరం వారితో న్యూడ్‌గా ఉన్నట్టు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో జాయ్‌ని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.
Big Blow to Jani Master: జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం
Rudraలైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
Viral Video: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న బస్సు.. డ్రైవర్ మృతి.. ఏలూరులో ఘటన (వీడియో)
Rudraఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట వద్ద ఆగి ఉన్న ఓ లారీని ప్రయాణికులతో ఉన్న ఓ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Woman blackmails Men: మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్‌మెయిల్, విశాఖట్నంలో ఘటన, అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaమగాళ్ల న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ చేస్తూ ముగ్గులోకి దింపుతుంది. మత్తు పదార్థులు ఇచ్చి స్పృహ తప్పగానే తన టీంతో వీడియోలు, ఫొటోలు రికార్డు చేసి డబ్బలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతోంది. భీమిలి పోలీసులు జాయ్‌ని అరెస్టు చేశారు.
Tirupati Airport: తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపుతో కలకలం
Arun Charagondaబ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమై రాత్రికి రాత్రే విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.