ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Shocker: వీడియోలు ఇవిగో, క్రమశిక్షణ పేరుతో విద్యార్థునులపై ప్రిన్సిపాల్ అరాచకం, తట్టుకోలేక మీడియా ముందు కన్నీరు కార్చిన విద్యార్థులు
Hazarath Reddyఅల్లూరి జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరాచకం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పై 100 నుండి 200 గుంజీలు (సిట్ అప్స్) తీయించడంతో నడవలేక కాళ్లవాపులతో విద్యార్థినిలు అవస్థలు పడ్డారు.
Lorry Caught Fire: వీడియో ఇదిగో, కడప చెన్నై జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకున్న లారీ, పూర్తిగా అగ్నికి ఆహుతైన వాహనం
Hazarath Reddyకడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దనూరు నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా బకరాపేట సమీపంలో ఒక్కసారిగా మంటలు చలరేగి లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
V. Vijaysai Reddy: చంద్రబాబు ఇంటిని కూల్చాల్సిందే, కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో సీఎం ఉంటున్నారని తెలిపిన విజయసాయి రెడ్డి
Hazarath Reddyకృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Andhra Pradesh: జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyగత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
New Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ టూ దుర్గ్, సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్ వెళ్లనున్న న్యూ ట్రైన్స్
Hazarath Reddyతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానుండగా, సోమవారం నాగ్‌పూర్-సికింద్రాబాద్, దుర్గ్-విశాఖపట్నం రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Amalapuram Fire: వీడియోలు ఇవిగో, అమలాపురంలో ఘోర అగ్ని ప్రమాదం, పేలుడు ధాటికి రెండు ముక్కలై కుప్పకూలిన భవనం, ఏడుమందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.
Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Rudraహైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.
Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
Rudraతన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.
Three Senior IPS Suspended in AP: బాలీవుడ్ నటి కేసులో కీలక పరిణామం, ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లపై వేటు వేసిన చంద్రబాబు ప్రభుత్వం, వైసీపీ నేతతో కలిసి వేధించారని ఫిర్యాదు
VNSఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా (Kanthi rana Tata) , విశాల్ గున్ని (Vishal gunni) ని సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
Visakha Boat Fire Accident: చేపల వేటకు వెళ్లిన బోటు మంటలకు దగ్దం, బోటులోని 5 గురు సురక్షితం, రూ.40 లక్షల ఆస్తి నష్టం..వీడియో ఇదిగో
Arun Charagondaవిశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం అయింది.ఇంజిన్ లో మంటలు ఏర్పడి పూర్తిగా బోటుకు వ్యాపించడంతో దగ్దమైందిబోటు.ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో 5 మంది క్షేమంగా బయటపడ్డారు. బోటులో వేటకు వెళ్లిన 5 మంది క్షేమంగా ఉన్నారు. సుమారు 40 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు మత్స్యకారులు.
Jagan On Chandrababu: ప్రజారోగ్యంపై టీడీపీ ప్రభుత్వ విధానం ఇదేనా?, ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై జగన్ ఫైర్, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక
Arun Charagondaరాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని ప్రశ్నించారు.
Fake Websites On Srisailam Temple Name: శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు, 27 ఫేక్ సైట్లను గుర్తించిన ఆలయ అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సూచన
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించారు ఆలయ అధికారులు. ఇప్పటివరకు 27 ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించామని తెలిపిన ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రాజస్థాన్, జైపూర్ నుంచి నకిలీ సైట్లను ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
Andhra Pradesh Shocker: ప్రేమ వ్యవహారం, థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరిక...వీడియో
Arun Charagondaతిరుపతి - పీజీఆర్ థియేటర్‌లో లోకేష్ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు కార్తీక్ అనే యువకుడు. కావ్య అనే యువతితో సినిమాకు వచ్చారు లోకేష్. అయితే దాడి తర్వాత కార్తీక్‌తో వెళ్లిపోయింది యువతి కావ్య. ఇక బాధితుడు లోకేష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Andhra Pradesh Shocker: అధికారుల వేధింపులు, సెల్ఫీ వీడియో తీసుకొని.. ఆత్మహత్యాయత్నం, హిందుపూర్‌లో 104 ఆపరేటర్ ఆత్మహత్యయత్నం..వీడియో
Arun Charagondaహిందూపురం 104 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు సోమందేపల్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ రామిరెడ్డి. వీడియోని కుటుంబ సభ్యులకు పంపగా.. విషయాన్ని 104 డాక్టర్ దృష్టికి తీసుకెళ్లింది కుటుంబం.
Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య
Rudraఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.
Rain Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
Srisailam Temple: వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం, ఆలయ ప్రాముఖ్యత నేపథ్యంలో చోటు, వెల్లడించిన ఆలయ అధికారులు
Arun Charagondaశ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో చోటు దక్కింది. ఆలయ ప్రాముఖ్యత, ప్రాచీన శిల్పాలు, కట్టడాలు ఆధారంగా వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో చోటు లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందుకున్నట్లు వెల్లడించారు.
Kadambari Jatwani Case: కాదంబరి జత్వానీ కేసు..ఇద్దరు పోలీసులపై వేటు,పోలీసులు వేధించారని ఫిర్యాదుతో ఇద్దరు పోలీసుల సస్పెండ్
Arun Charagondaముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఐఓ సత్యనారాయణ సస్పెన్షన్ వేటు పడింది. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని నటి జత్వానీ ఆరోపణలు చేస్తుండగా.. ఇద్దరు పోలీసులు సస్పెండ్ కావడం గమనార్హం.
Free Heart Surgeries at NIMS: హైదరాబాద్ నిమ్స్ లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు.. ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
YSRCP Spoke Persons: జగన్ మరో కీలక ప్రకటన, మాజీ మంత్రి రోజా- యాంకర్ శ్యామలకు కీలక పదవులు, పెద్దిరెడ్డికి సైతం పెద్దపీట వేసిన వైసీపీ అధినేత..కీలక పదవులు దక్కించుకున్న నేతలు వీరే
Arun Charagondaఏపీలో అధికారం దూరమైన తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక పదవులు అప్పజెప్పిన జగన్ తాజాగా మరిన్ని కమిటీలను నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించారు.