ఆంధ్ర ప్రదేశ్

Mopidevi Venkataramana Vs Ambati Rambabu: టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు..పార్టీ మారినోళ్ళు పరువు పొగొట్టుకున్నారంటూ అంబటి రాంబాబు ఫైర్

Arun Charagonda

ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా ఇద్దరు ఎంపీలు సైతం రిజైన్ చేశారు. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇవాళ రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తమ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించనున్నారు.

Andhra Pradesh: నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోళ్తా, 5గురికి తీవ్ర గాయాలు, ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు

Arun Charagonda

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి సమీపంలో ఆర్టీసీ బస్సు బోళ్తా పడింది. నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా కోటకు వెళుతుండగా మోమిడి వద్ద అదుపు తప్పి బస్సుకు ప్రమాదం జరుగగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Andhra Pradesh: ఇలా జైలు నుండి వచ్చాడు..అలా కిడ్నాప్ చేసేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలులో కిడ్నాప్ కలకలం, ఆర్ధిక లావాదేవీలే కారణమని పోలీసుల అనుమానం

Arun Charagonda

బెయిల్ పై విడుదలైన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేశారు దుండగులు. రాజమండ్రి సెంట్రల్ జైలు పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఒరిస్సా వ్యాపరి సంజయ్‌ను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

AP Student Died in USA: అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి, స్నేహితుల‌తో క‌లిసి సెల్ఫీ తీసుకుంటూ స‌ర‌స్సులో ప‌డిపోయిన యువ‌కుడు

VNS

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) (Rupa reddy) అమెరికాలోని జార్జ్‌ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్‌ చేసేందుకు అమెరికా (Telugu Student de in USA) వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో చేరాడు.

Advertisement

Big Shock to YSRCP: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్, రాజీనామాకు సిద్ధ‌మైన ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, మ‌రికొంద‌రు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం

VNS

ఏపీలో వైసీపీకి (YCP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు (Beeda Masthan Rao) తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌ వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

Andhra Pradesh: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 342 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, జ్వరం కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలు, గత 3 రోజుల్లో 800 మందికి అనారోగ్యం

Hazarath Reddy

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

YSRCP: మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా జోగి రమేష్, పెనమలూరు ఇన్‌చార్జ్‌గా దేవభక్తుని చక్రవర్తి, ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల నియామిస్తూ వైఎస్సార్‌సీపీ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.

Andhra Pradesh Cabinet Meeting: ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు, పాత విధానంలోనే టెండర్ల ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, కడప వైసీపీ మేయర్ ఇంటి ముందు చెత్తను పోసిన టీడీపీ కార్యకర్తలు, చెత్త పన్ను కట్టొద్దని తెగేసి చెప్పిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ (టిడిపి), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) మధ్య కొత్త చెత్త పన్ను నిబంధనపై రాజకీయ ఘర్షణ తీవ్రమైంది. కడపలోని వైఎస్సార్‌సీపీ మేయర్‌ సురేశ్‌బాబు అధికారిక నివాసం ఎదుట టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిసి చెత్తబుట్టలు వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పన్ను చెల్లిస్తేనే చెత్త సేకరిస్తామన్న మేయర్ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.

MLC Pothula Sunitha Quits YSRCP:వైసీపీకి మరో నేత గుడ్‌బై, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా, పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్న కీలక నేతలు

Hazarath Reddy

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై ఓడిపోయారు.

Andhra Pradesh: నిద్రిస్తున్న విద్యార్థినులను కొరికిన ఎలుకలు, తామరాపల్లి మహిళా గురుకుల పాఠశాలలో ఘటన, 5గురు విద్యార్థినులకు అస్వస్థత

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం తామరాపల్లిలోని మహిళా గురుకుల కళాశాలలో ఎలుకల దాడి కలకలం రేపింది. నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరికేశాయ్. దాదాపు ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కొరగా మిగితా విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు.

Srisailam Gates Open: కృష్ణమ్మ పరవళ్లు, మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు, 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

Arun Charagonda

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఎగువ నుంచి కృష్ణా నదికి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. రెండు క్రెస్ట్ గేట్లను 10 అడుగుల ఎత్తు వరకు ఎత్తి #నాగార్జునసాగర్ డ్యామ్‌కు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 2,13, 624 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ మొత్తం నిల్వ సామర్థ్యం 885 అడుగులు. రిజర్వాయర్‌లోని ఎడమ, కుడి జలవిద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

Advertisement

YS Jagan Foreign Tour Updates: మరోసారి విదేశాలకు వైఎస్ జగన్, ఈసారి ఎన్ని రోజులో తెలుసా?, సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుకేకు వైసీపీ అధినేత!

Arun Charagonda

ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరగా ఓకే చెప్పడంతో యుకే టూర్ ఖరారైంది. సెప్టెంబర్ 3న ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ వెళ్లనున్నారు జగన్. సెప్టెంబర్ 3 నుండి 25 వరకు యూకేలో పర్యటించనున్నారు.

MLA Bolisetty Srinivas On Allu Arjun: అల్లు అర్జున్ ఏమైనా పుడింగా?, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్, బన్నీకి అసలు ఫ్యాన్సే లేరని మండిపాటు, స్థాయిని మించి మాట్లాడొద్దని చురకలు

Arun Charagonda

సినీ నటుడు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లు అర్జున్ కు అసలు ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని..ఉన్నదంతా కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమేనన్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? ,అతను ప్రచారం చేయకపోతే మాకేమైనా నష్టం జరిగిందా? అన్నారు.

Andhra Pradesh: ఫుడ్ పాయిజన్.. 49 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

ఏపీలో మరో బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవరగం ఏలేశ్వరం బాలికల గురుకుట పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కాగా 49 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

King Cobra At Hospital: ఆస్పత్రిలో ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా,అల్లూరి జిల్లా చింతూరులో ఘటన, కోబ్రాను పట్టుకుని అడవీలో వదిలేసిన ఫారెస్ట్ సిబ్బంది..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 12 అడుగుల కోబ్రా ప్రత్యక్షమైంది. దీంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కోబ్రాను సమీపంలోని అటవీ ప్రాంతంలో తరలించింది ఫారెస్టు సిబ్బంది. నిత్యం పాములు కనిపిస్తున్నాయని, మండలంలో స్నేక్ క్యాచర్‌ని నియమించాలని కోరుతున్నారు ప్రజలు. అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం జెన్‌కో ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Tirupathi: తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో దారుణం, మహిళా డాక్టర్‌పై రోగి దాడి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టిన రోగి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి స్విమ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ డాక్టర్‌ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు ఓ రోగి. వెంటనే స్పందించిన సహచర డాక్టర్లు ఆ రోగి బారి నుండి బాధిత డాక్టర్‌ను కాపాడారు.

JC Prabhakar Reddy On Sand Mafia: ఇసుక దందాలో టీడీపీ నేతలు..జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్, అంతా నాకు కావాల్సిన వాళ్లే, దయచేసి ఆపండని విజ్ఞప్తి

Arun Charagonda

ఏపీలో ఇసుక అక్రమ దందాపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక దందాలో నా వాళ్లే 25 మంది ఉన్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతా తనకు కావాల్సిన వాళ్లేనని...అక్రమ దందాతో తనకు దూరమయ్యే పనులు చేయవద్దన్నారు. ఇకనైనా ఇసుక అక్రమ దందా ఆపాలని విజ్ఞప్తి చేశారు. జేసీ చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Vijayawada Horror: రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని అన్నను చంపిన తమ్ముడు.. విజయవాడలో ఘోరం

Rudra

విజయవాడలో ఘోరం జరిగింది. తన భార్యకు రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని ఓ తమ్ముడు తన అన్ననే చంపేశాడు. ఈ దారుణ ఘటన గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం జరిగింది.

Anna Canteens: వీడియో ఇదిగో, మురికి నీటిలో కడుగుతున్న అన్న క్యాంటీన్ ప్లేట్లు, తణుకులో వెలుగులోకి వచ్చిన ఘటన

Hazarath Reddy

చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన అన్నా క్యాంటిన్లలో నాణ్యతాలోపం కనపడుతోంది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా తణుకులో మురికి నీటిలో అన్న క్యాంటీన్ ప్లేట్లు కడుగుతున్న వీడియో బయటకు వచ్చింది

Advertisement
Advertisement