ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: పొలం నుంచి వస్తుండగా రైతును తొక్కి చంపిన ఏనుగు, మన్యం జిల్లాలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..

Hazarath Reddy

మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, నెల్లూరు జిల్లాలో దారుణ హత్య, పాత నేరస్థుడు కత్తి రవిని కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలో నేరస్తుడి హత్య కలకలం రేపింది. రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో పాత నేరస్థుడు కత్తి రవి దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన కత్తి రవిని ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Monkeypox RT-PCR Kit: దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ కోసం తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌, మరో ఘనతను సాధించిన ఏపీ విశాఖ మెడ్‌టెక్ జోన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది.

AP Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీలో ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, భార్యకు డబ్బులు మొత్తం పంపిస్తున్నాడని యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ప్రియురాలు

Hazarath Reddy

అతనికి వివాహమైనప్పటికీ భార్య సొంత రాష్ట్రంలోనే ఉండటంతో, అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతితో సహ జీవనం చేస్తున్నాడు. యువతిని సరిగ్గా చూసుకోట్లేదని, డబ్బు మొత్తం భార్యకు పంపిస్తున్నాడని ఆగ్రహంతో గదిలో నిద్రిస్తున్న విజయ్ మర్మాంగంపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది.

Andhra Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Vizag Beach: వైజాగ్ బీచ్ లో 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం.. సాగరం నుంచి బయటపడ్డ రాళ్లపై పర్యాటకుల సందడి

Rudra

బీచ్ లో సముద్రపు అలలు కాస్త వెనక్కి వెళితేనే ఎంతో మురిసిపోతాం. ఆ అలలే ఏకంగా 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లి.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరంలోని అరుదైన రాళ్లు బయటపడితే?? వావ్ అంటాం కదూ!!

AP Capital Amaravathi Update: అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌పై మంత్రి నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు, ఎంత ఖ‌ర్చ‌వుతుంది? ఎప్ప‌టి నుంచి ప‌నులు ప్రారంభిస్తారంటే?

VNS

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravathi Construction) నిర్మాణంపై ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్‌ సౌత్‌ కాన్‌ 2024 కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు.

Advertisement

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దారుణం, డీఎస్పీ కారును ఢీ కొట్టిన స్మగ్లర్లు, దాడిలో గాయపడ్డ పోలీసులు

Arun Charagonda

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగబడ్డారు. వెంకటాచలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీని కారుతో ఢీ కొట్టారు. గూడూరు సాదుపేటలో స్మగ్లర్లు అడ్డుకునే సమయంలో కారుతో వాకాడు సిఐపై దాడి చేశారు. ఈ దాడిలో డీఎస్పీ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్‌ బాషాకి గాయాలు అయ్యాయి. గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sexual Harassment Of School Girls: పలాసలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోని వైనం, తల్లిదండ్రుల ఆగ్రహం

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.

Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఇంట్లోనే దీపావళి పటాసుల తయారీ, అగ్నిప్రమాదం, ఆవు మృతి, ముగ్గురికి గాయాలు

Arun Charagonda

చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే దీపావళి పటాసులను తయారీ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఆవు మృతి చెందింది.

Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రెండు నెలల జైలు జీవితం తర్వాత బయటకు, వైసీపీ నేతల స్వాగతం

Arun Charagonda

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంల ధ్వసం కేసులో అరెస్ట్ అయి రెండు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు పిన్నెల్లి. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని సూచించింది. దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. ఇక జైలు నుండి బయటకు వచ్చిన పిన్నెల్లికి వైసీపీ నేతలు స్వాగతం పలికారు

Advertisement

Telugu Women Missing In Malaysia:మలేషియాలో మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు

Arun Charagonda

మలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు

Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్ర‌కృతి కంభం.. మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గా భ‌వ్యారెడ్డి

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్ద‌రు యువ‌తులు ఎంపిక‌య్యారు.

Special Darshans Cancelled: టీటీడీ కీల‌క నిర్ణ‌యం, ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు బంద్, ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి వ‌స్తుందంటే..

VNS

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darsan cancell) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు

Macherla Municipality: టీడీపీ ఖాతాలో మాచర్ల మున్సిపాలిటీ, సైకిల్ ఎక్కిన 16 మంది వైసీపీ కౌన్సిలర్లు, చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన పోలూరు నరసింహారావు

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh: నాడు - నేడు ఇకపై మన బడి - మన భవిష్యత్, ఏపీలో మరో ఆరు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు సర్కారు

Hazarath Reddy

ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతోంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను మార్చింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటి నిండా 25 కిలోల బంగారం, తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన పూణే నుండి వచ్చిన భక్తుల బృందం

Hazarath Reddy

విశేషమైన భక్తి ప్రదర్శనలో, పూణే నుండి వచ్చిన భక్తుల బృందం ఈరోజు తెల్లవారుజామున 25 కిలోల బంగారం ధరించి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలోని వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించింది. పవిత్ర మందిరానికి చేరుకున్న ఈ బృందం తోటి యాత్రికులు మరియు ఆలయ సిబ్బంది దృష్టిని ఆకర్షించింది.

Andhra Pradesh: వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి, వానపల్లి సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేంద్రం సాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి

Hazarath Reddy

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

Andhra Pradesh Factory Explosion:రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు

Hazarath Reddy

అచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.

Advertisement
Advertisement