Fire breaks out in a boat at Kakinada coast: కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బోటు నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. వారు వెంటనే కాకినాడ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం చేరవేశారు. దీంతో సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మత్స్యకారులను కాపాడారు.
కాకినాడ సముద్ర తీరంలో (Kakinada coast) ఓ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది. మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున ఇంజిన్‌లో మంటలు (Fire breaks out in a boat at Kakinada coast) చెలరేగాయి. ఆ వెంటనే బోటులో ఉన్న సిలిండర్లు కూడా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. అప్రమత్తమైన మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు.
బోటు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షక దళం సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోటులోని 12 మంది జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం కారణంగా దాదాపు రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు మత్స్యకారులు తెలిపారు.
Here's Video
A fire broke out in a #boat off the coast of #Kakinada. A gas cylinder in the boat #exploded 11 #fishermen were trapped in it. #CoastGuard took up the rescue operation.fishermen in the boat were brought to shore safely.#AndhraPradesh #BreakingNews pic.twitter.com/dfmO2fXY0k
— Ur'sGirivsk (@girivsk) December 1, 2023
మత్స్యకారులు చేపలవేటకు వెళ్లే సమయంలో భోజన అవసరాల కోసం నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ తదితర వస్తువులను వెంట తీసుకెళ్తుంటారు. వేటకు విరామం ఇచ్చే సమయంలో బోటులో వంట చేసుకుని భోజనం చేస్తారు. ఎప్పటిలాగే అలా వెళ్లిన 11 మంది మత్స్యకారులు తిరిగి వస్తుండగా బోటులో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.