గురువారం రాత్రి ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఘటగావ్ తారిణి దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Odisha Road Accident) చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వార్తాసంస్థ ఎఎన్ఐ పంచుకుంది. కియోంజర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ థాకరే తెలిపిన వివరాల ప్రకారం బలిజోడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 20పై ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 12 మందిలో 11 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఒకరు ఘటగావ్ సిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారు. ఘటగావ్ తారిణి ఆలయానికి వెళుతుండగా వ్యాన్ ట్రక్కును ఢీకొట్టిందని వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Eight Dead, 12 Injured After Speeding Van Hits Parked Truck in Ghatagaon

Here's ANI Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)