Vizag, July 27: వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి విశాఖ బీచ్‌కు వెళ్లి భర్త కళ్లుగప్పి ప్రియుడితో పరారైన సాయి ప్రియ వ్యవహారంలో బుధవారం మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం (Missing woman from Vizag) వెనుక పక్కా ప్లాన్ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ( Vizag Beach found with lover in Nellore) ప్రత్యక్షమైంది.
అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ.కోటి ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టడంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై మీడియాతో విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని చెప్పారు.
ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని.. ఆమెను అక్కడి నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.అయితే ఆమె అక్కడి నుంచి ప్రియుడితో కలిసి బెంగుళూరు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.