Andhra Pradesh: ట్విస్టులు మీద ట్విస్టులు, ఆర్కే బీచ్ నుంచి నెల్లూరు, అక్కడి నుంచి బెంగుళూరు, భర్తతో పాటు పోలీసులకు చుక్కలు చూపిస్తున్న సాయిప్రియ
Missing woman from Vizag Beach found with lover in Nellore (Photo-Video Grab)

Vizag, July 27: వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భ‌ర్త‌తో క‌లిసి విశాఖ బీచ్‌కు వెళ్లి భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి ప్రియుడితో ప‌రారైన సాయి ప్రియ వ్య‌వ‌హారంలో బుధ‌వారం మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం (Missing woman from Vizag) వెనుక పక్కా ప్లాన్‌ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ( Vizag Beach found with lover in Nellore) ప్రత్యక్షమైంది.

ఆమె ఆఖరి ఫోన్‌కాల్‌ను పోలీసులు కావలిలో ట్రేస్‌ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. సాయిప్రియ అదృశ్యమైన సమయంలో బీచ్‌ రోడ్‌లోనే ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే భర్తను బురిడి కొట్టించి లవర్‌ సాయితో పరారైనట్లు బయటపడింది. సోమ‌వారం సాయంత్రం అదృశ్య‌మైన సాయి ప్రియ రెండు రోజుల త‌ర్వాత బుధ‌వారం నెల్లూరులో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆమెను విశాఖ‌కు త‌ర‌లించేందుకు పోలీసులు య‌త్నిస్తున్న త‌రుణంలో సాయిప్రియ అక్క‌డి నుంచి చిన్న‌గా జారుకుంది.

ఇద్దరితో వివాహేతర సంబంధం, ఒకరిని గొడ్డలితో, కత్తితో దారుణంగా నరికేశారు, నిందితులంతా పరార్, పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో సాయి ప్రియ ఉన్న‌ట్లు స‌మాచారం. బెంగ‌ళూరు నుంచే ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌కు వాట్సాప్ మెసేజ్ పంపింది. తాను క్షేమంగానే ఉన్నాన‌ని, త‌న కోసం వెత‌క‌వ‌ద్దంటూ స‌ద‌రు మెసేజ్‌లో ఆమె కోరింది. అంతేకాకుండా నెల్లూరుకు చెందిన తన ప్రియుడు రవితో పెళ్లి చేసుకున్న ఫొటోలను కూడా ఆమె తల్లిదండ్రులకు పంపంది. మెడలో కొత్త తాళిబొట్టు స్పష్టంగా కనిపించేలా ఫొటోలను ఆమె సదరు మెసేజ్ ద్వారా పంపింది. ఈ మెసేజ్‌ను సాయి ప్రియ త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు తెలియ‌జేశారు.

అసలేం జరిగింది...

చిరిగిడి సాయి ప్రియ, శ్రీనివాస్‌​ భార్యభర్తలు. కానీ సాయి ప్రియ కొంతకాలంగా రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. శ్రీనివాస్‌ ఫోన్‌లో మెసెజ్‌లు చూస్తుండగా.. అలలు దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీన్నే అవకాశంగా భావించిన సాయిప్రియ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రియుడితో కలిసి బీచ్‌ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారు పడిన శ్రీనివాస్‌ వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

ప్రమాదవశాత్తు సాయిప్రియ సముద్రంలో పడిపోయి ఉంటుందని భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీ కోసం సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నావీ సాయం కోరారు. దీంతో రెడు కోస్ట్‌ గార్డ్‌ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా జాడ దొరకలేదు. అయితే చివరకు అమ్మాయి సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు తేలింది. ఎంతోమందిని టెన్షన్‌ పెట్టిన సాయిప్రియ మిస్సింగ్‌ చివరకు డ్రామాగా తేలడంతో అందరూ విస్తుపోయారు.