Kerala HC (Photo-Wikimedia Commons)

Kerala, Sep 5: కేరళలో 31 ఏళ్ల వ్యక్తి సోమవారం కేరళ హైకోర్టులో ఆత్మహత్యకు ప్రయత్నించాడు, అతను తన స్నేహితురాలు అని చెప్పుకుంటున్న ఒక మహిళ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది.దీంతో కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన విష్ణు అనే వ్యక్తి జస్టిస్ అను శివరామన్ ఛాంబర్ ముందు మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

విష్ణు, 23 ఏళ్ల యువతి దాదాపు నెల రోజులుగా సహజీవనం చేశారు. తన కుమార్తెను అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళ తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై వారు సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. అయితే, తన కుటుంబంతో కలిసి వెళ్లాలనుకుంటున్నట్లు మహిళ న్యాయమూర్తులు అను శివరామన్, సి జయచంద్రన్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌కు ఆ యువతి తెలిపింది.

చేతబడి నయం చేస్తానంటూ నవ వధువుపై మంత్రగాడు దారుణం, థెరపీ ముసుగులో కళ్ళకు గంతలు కట్టి బట్టలు విప్పి అక్కడ ముద్దు పెట్టి రాక్షసంగా..

తనకు తన పేరెంట్స్‌ ముఖ్యమని, తాను తన కుటుంబంతోనే వెళ్లిపోతానని.. కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్‌ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తాను వెళ్లిపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వల్లే అతనితో పాటు ఉండిపోయానని ఆ మహిళ తెలిపింది.

దీంతో డివిజన్‌ బెంచ్‌ యువతిని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. అయితే ఆ ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు.. ఓ కత్తితో జస్టిస్‌ అను శివరామన్‌ ఛాంబర్‌కు వెళ్లాడు. తన మణికట్టు కోసుకుని ఏడ్వసాగాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

మహిళ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, విష్ణుకు అప్పటికే మరో మహిళతో వివాహమైందని, తన భార్యతో తనకు ఉన్న సంబంధం వేరుగా ఉందని తన ప్రేమికురాలికి చెప్పాడు. అయితే.. సదరు యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది.