Kovuru, May 24: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో మరింత దూకుడు పెంచింది. ఈరోజు జగనన్న విద్యా దీవెన (Jagananna Vidyadeevena) పథకంలో భాగంగా రెండో విడత నగదును ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనుంది. జనవరి -మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించి 9.95లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 703 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరులో (CM Jagan Tour) పర్యటించనున్న సీఎం జగన్ (CM Jagan).. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కడం ద్వారా ఈ నిధులు విడుదల చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకుకూడా పెద్ద చదువులు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తుంది.
Hon'ble CM will be Disbursing Financial Assistance to Students under "Ja... https://t.co/wd1O5J4Pfk via @YouTube
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 24, 2023
ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కొవ్వూరు రానున్నారు. ఉదయం 9. 20 నిమిషాలకు హెలికాప్టర్‌లో సీఎం జగన్ కొవ్వూరు చేరుకుంటారు. 9.30 గంటలకు బైపాస్ రోడ్‌లో బుద్ధుడు జంక్షన్ వద్ద హెలిప్యాడ్ నుండి రోడ్ షోలో పాల్గొంటారు. 9.45 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11.15 వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి జమ చేస్తారు. 11.30 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.