Tirumala, March 4: తిరుమల (Tirumala) శ్రీవారిని కాలినడకన వెళ్ళి దర్శించుకునే వెంకన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) శుభవార్త చెప్పింది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం (Divya darshanam) టోకెన్లు (Tokens) జారీ చేయనుంది. నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60 శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండడం లేదని గుర్తించామని, కాబట్టి వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని, అది అందుబాటులోకి రాగానే టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు.
నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ- టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి - TTD EO AV Dharma Reddy Said That They Have Decided To Issue Divya Darshan Tokens For The Convenience Of Devotees #Devotees #DivyaDarshan #Srivanihttps://t.co/9CoP0yjkJ9
— TeluguStop.com (@telugustop) March 3, 2023