Credits: Twitter

Vijayawada, May 1: ఏపీలో (AP) రెండ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ-IMD) వెల్లడించింది. రాష్ట్రంలో మే 1వ తేదీన పల్నాడు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మే 1, 2 తేదీల్లో ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రేపు ఎక్కడంటే?

మే 2వ తేదీన మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి జిల్లా, కృష్ణా, ఏలూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన  

హైదరాబాద్ (Hyderabad) ను మరోసారి భారీ వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఈ తెల్లవారుజామున వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై (Roads) పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా (Electricity Supply) నిలిచిపోయింది. ట్రాఫిక్ (Traffic) కు అంతరాయం కలిగింది. భారీ వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఈ మేరకు 040 211 11111 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.