Sangareddy Fire Accident (PIC@ PTI X)

Sangareddy, NOV 22:  సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పాశమైలారం పారిశ్రామికవాడలో ఎంఎస్‌ఎన్‌ (MSN) రెండో యూనిట్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  MSN పరిశ్రమలో స్టోరేజీ విభాగంలో రసాయన డ్రమ్ములు నిల్వ ఉంచారు. కెమికల్స్ నిల్వ ఉంచిన డ్రమ్ములు పేలడంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు.

 

భారీగా అగ్నికీలలు వ్యాపించడం, అందులోనూ కెమికల్స్ కావడంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించాయి. రసాయన డ్రమ్ములు పేలుతుండటంతో మంటలు అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.