తెలంగాణ

MLA Danam Nagender On Hydra: పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, జలవిహార్‌- ఐమ్యాక్స్‌లను కూల్చాలని డిమాండ్

Arun Charagonda

హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పాను అన్న దానం.. జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయి, వాటిని కూల్చుకొండన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు అని తెలిపారు.

CM Revanth Reddy On Familey Digital Cards: మహిళనే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Arun Charagonda

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (#FDC) రూపకల్పనపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Fake Reporter: విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్‌చెరులో సంఘటన

Arun Charagonda

తెలంగాణలోని పటాన్‌చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు.

Gold Saree: సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత సృష్టి, 200 గ్రాముల బంగారంతో చీర తయారీ..

Arun Charagonda

సిరిసిల్ల చేనేత కార్మికుడు అద్భుతం సృష్టించాడు. ఓ వ్యాపారి కుమార్తె వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేశారు విజయ్ కుమార్. 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీర తయారు చేయగా ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అయినట్లు విజయ్ కుమార్ తెలిపారు.

Advertisement

IIFA 2024 Awards: బాలయ్య కాళ్లకు నమస్కరించి తన సింప్లీసిటీ చాటుకున్న అందాల తార ఐశ్వర్యరాయ్.. వైరల్ వీడియో

Rudra

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కాళ్లకు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నమస్కరించారు. అబుధాబిలో జరిగిన ఐఫా ఉత్సవం-2024లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం, సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ మహాప్రస్థానంలో అంత్యక్రియలు

Arun Charagonda

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

New Electric Super Luxury Buses: తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు.. నేటి నుంచి ప్రారంభం

Rudra

తెలంగాణలో తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు.

BRS MLAs Visits Musi Catchment Areas: మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బాధితులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ బృందం..వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసి భాదితుల ఇండ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. ఇప్పటికే పార్టీ తరుపున న్యాయ పరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Rape Case Against Youtuber Mallik Tej: మరో యూట్యూబర్ పై రేప్ కేసు.. జగిత్యాల యూ ట్యూబ్ ఫేం మల్లిక్ తేజపై యువతి కేసు.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు (వీడియోతో)

Rudra

జగిత్యాల జిల్లాకు చెందిన యూ ట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైంది. కొన్నేళ్ళ క్రితం తమ ఇద్దరి మధ్య పరిచయం మొదలై అదికాస్తా చనువుగా మారిందని యువతి పేర్కొంది.

Pink Power Run: పింక్‌ పవర్‌ రన్‌ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం (వీడియో)

Rudra

ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ఈ కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు పెరిగిపోతున్నాయి.

Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Public Attack on Reporter: రిపోర్టర్‌ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)

Rudra

పటాన్ చెరులో సంతోష్ నాయక్ అనే రిపోర్టర్ ను స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు-అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement

HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు.. 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు

Rudra

సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు నమోదైంది.

Dana Kishore: ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదు...పేదలను ఆదుకుంటామన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్

Arun Charagonda

ప్రభుత్వం ఇల్లు కొట్టేయలనుకుంటే ఎప్పుడో కొట్టేసేది.. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్. మూసి పరివాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ రూమ్ కోసం అప్లై చేసుకున్నారు..

Harishrao: ఇంకెంతమందిని చంపుతావ్ రేవంత్ రెడ్డి..హరీశ్ రావు ఫైర్, హైడ్రాతో ముగ్గురు చనిపోయారు, ఇంకెంతమంది చనిపోవాలి..బాధితులకు అండగా ఉంటామని స్పష్టం

Arun Charagonda

రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్, ఇంకెంతమందిని చంపుతావ్?? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు అని మండిపడ్డారు. హైడ్రాతో ముగ్గురు చనిపోయారు..ఇంకెంతమంది చనిపోవాలని ప్రశ్నించారు హరీశ్ రావు.

Telangana Shocker: 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం,ఆసిఫాబాద్‌లో దారుణం, నిందితుడిని ఉరి తీయాలని గ్రామస్తుల ఆందోళన..వీడియో

Arun Charagonda

ఆసిఫాబాద్ - బూరుగూడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 11 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందుతుడిని ఉరి తీయాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Advertisement

High Security At Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ, హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీస్ బందోబస్తు..వీడియో

Arun Charagonda

హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చుతోంది హైడ్రా. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు.

Hyderabad: హైదరాబాద్‌లో కాలిబుడిదైన ఎలక్ట్రిక్ వాహనం, పక్కనే ఉన్న మెడికల్ షాపుకు అంటుకున్న మంటలు..వీడియో ఇదిగో

Arun Charagonda

కుత్బుల్లాపూర్ సూరారం చౌరస్తాలోని ఆదిత్య మెడికల్ షాప్ వద్ద ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు అంటుకుని దగ్ధమైంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్ కు కూడా మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.

Hydra Victims At Telangana Bhavan: ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్‌ రావుతో బాధితురాలు మొర..వీడియో

Arun Charagonda

హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము.. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారు అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao: తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి (వీడియో)

Rudra

హైడ్రా మూసీ బాధిత కుటుంబాలు శనివారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కాసేపట్లో వారితో మాట్లాడి వారి సమస్యలను వినబోతున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు.

Advertisement
Advertisement