తెలంగాణ
Viral Video: పాపులారిటీ కోసం వెర్రి చేష్టలా?, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్, వికృతానందం సరికాదని హెచ్చరిక!
Arun Charagondaసోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది వెర్రి చేష్టలు చేస్తున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు అని మండిపడ్డారు.
Traffic Restrictions in Hyderabad: వినాయక నవరాత్రుల నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Rudraవినాయక చవితి, గణనాథుడి నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సర్వాంగరంగంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Khairatabad Big Ganesh Darshan: 70 ఏండ్లు.. 70 అడుగుల ఎత్తు.. భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి (వీడియోతో)
Rudraతెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు చవితి. ఈ ఉదయం నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు.
Raj Tarun-Lavanya Case Row: రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రాజ్ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!
Rudraరాజ్ తరుణ్, లావణ్య వివాదంలో సినిమాను మించిన ట్విస్ట్ లు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఏకంగా ముంబై కు షిఫ్ట్ అయ్యింది.
Telangana DSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల, ఇలా ఈ వెబ్ సైట్ లో చాలా సులభంగా చెక్ చేయవచ్చు
VNSటీజీ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ (Telangana DSC Final Key) విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను (Responce Shet) అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ ఆగస్టు 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించారు.
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం, రూ. 3,300 కోట్లు ప్రకటించిన కేంద్రం, సీఎం రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భేటీ
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం అందించింది. వర్షాలతో నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ. 3,300 కోట్ల సాయం ప్రకటించింది. ఇక హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై నేతలు చర్చించనున్నారు.
Vaddepalli Krishna Dies: టాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Hazarath Reddyటాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
Loan App Harassment: లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలి, డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల ఒత్తిడి, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న భాను ప్రకాష్
Arun Charagondaహైదరాబాద్ లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. కుత్బుల్లాపూర్ సంజయ్ గాంధీ నగర్ కు చెందిన మాస్టర్స్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో డబ్బు కట్టాలని ఒత్తిడి రావడంతో వేధింపులు తాళలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్, పంతం నెగ్గించుకున్న రేవంత్, తన వర్గానికి చెందిన నేతకే పీసీసీ చీఫ్ పదవి
Arun Charagondaతెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు మహేశ్ కుమార్ గౌడ్. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించగా రేవంత్ స్థానంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు మహేశ్. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం మధుయాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
TGSPDCL: విద్యుత్ సిబ్బంది లంచం అడిగితే ఈ నెంబర్లకు ఫోన్ చేయాలన్న సీఎండీ ముషరఫ్ ఫరూఖీ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడి
Arun Charagondaమా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయాలన్నారు సీఎండీ ముషారఫ్ ఫరూఖి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 - 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.
KCR Navagraha Yagam: కేసీఆర్ నవగ్రహ మహాయాగం, 18 నుండి జిల్లాల టూర్, ఎన్నికల్లో ఓటమి తర్వాత చేస్తున్న యాగం నేపథ్యంలో అందరి దృష్టి
Arun Charagondaబీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈజ్ బ్యాక్. రుణమాఫీపై రణం చేసేందుకు త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో నవగ్రహ మహాయాగం చేపట్టారు కేసీఆర్. సతీమణి శోభతో కలిసి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. ఇక తెలంగాణలో యాగం అనగానే గుర్తుకు వచ్చేది కేసీఆరే.
Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు మరోసారి నోటీసులు, మేడిగడ్డ ఎఫెక్ట్..స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులిచ్చిన న్యాయస్థానం
Arun Charagondaమేడిగడ్డ ఎఫెక్ట్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు.
Whiskey Ice Cream: యూత్ టార్గెట్‌గా విస్కీ ఐస్‌క్రీమ్, వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సోదాలు, యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతోంది ఓ ముఠా. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నట్టు గుర్తించారు అధికారులు.
Hyderabad: డ్రైనేజీ నీటితో ప్లేట్లు కడుతున్న హోటల్ సిబ్బంది, యూసుఫ్ గూడలోని ఉడిపి పార్క్ హోటల్‌లో ఘటన, వీడియో వైరల్
Arun Charagondaడ్రైనేజీ నీటితో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్న సంఘటన యూసుఫ్ గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్ లో జరిగింది. కొన్నాళ్లుగా పైపుల్లో లీకవుతున్న డ్రైనేజీ అయినా పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం డ్రైనేజీ నీటితోనే హోటల్లోని ప్లేట్లు, గిన్నెలు, టీ కప్పులు కడిగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Jitta Balakrishna Reddy Passes Away: మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి, అనారోగ్యంతో మృతి చెందిన జిట్టా, ప్రజానేతగా గుర్తింపు
Arun Charagondaమలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా. బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు.
Smokes from Earth: భూమి పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు.. ఆందోళనతో పరుగెత్తిన హైదరాబాదీలు.. అసలేం జరిగింది?? ఇదిగో వీడియో!
Rudraహైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భూమి పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది.
Female Aghori at Mallanna Temple: వీడియో ఇదిగో, కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి వచ్చిన మహిళా అఘోరీ, ఆసక్తిగా తిలకించిన భక్తులు
Hazarath Reddyకొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కొమ్రెల్లి మల్లన్న దేవాలయం అని ప్రసిద్ది చెందింది. ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని కొండపై ఉన్న హిందూ దేవాలయం. తాజాగా మహిళా అఘోర కొమరవెల్లి దేవాలయానికి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Hyderabad Rain: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ను మళ్లీ ముంచెత్తిన భారీ వర్షం, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో సాయంత్రం నుండి వాన దంచికొట్టింది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తున్న వర్షం కురుస్తుంది.
AI Global Summit 2024: విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ పెట్టింది పేరు, గ్లోబల్ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ ఏఐ’ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో (AI Global Summit 2024) చర్చించారు
Telangana: ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Hazarath Reddyరాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా (Free electricity) చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు.గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.