తెలంగాణ

Defamation Case: పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీపై ప్రజల్లో అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయంటూ పిటిషన్

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది.

Harishrao Slams CM Revanth Reddy: 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్‌ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్

Arun Charagonda

ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలేరులో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు హరీశ్ రావు.

Telangana Shocker: నాలాలో పడి చిన్నారి మృతి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు, నిన్న సాయంత్రం ఆడుకుంటూ నాలాలో పడిక బాలిక, విషాద ఛాయలు

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలాలో గల్లంతైన బాలిక మృతి చెందింది. బాలిక అనన్య మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఇంటి ముందల ఆడుకుంటుండగా నాలాలో పడింది బాలిక.

Teachers Protest At Praja Bhavan: ప్రజాభవన్‌ ముందు అర్థరాత్రి టీచర్ల ఆందోళన, జీవో 317 పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్టింగ్‌లు ఇస్తున్నారని మండిపాటు

Arun Charagonda

ప్రజాభవన్ ముందు అర్ధరాత్రి ఆందోళన టీచర్లు ఆందోళన బాటపట్టారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 317 జీఓ బాధితులు బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని, స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు ధర్నాకు దిగారు.సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడం పై మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

BRS Protests For Runamafi: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరు, యాదాద్రి నుండి హరీశ్ రావు ఆలయాల యాత్ర, 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు

Arun Charagonda

వందశాతం రుణమాఫీ అమలు చేయాలని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పట్టనుంది బీఆర్ఎస్. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయనుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నేతలకు ఇవాళ్టి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కార్యకర్తలకు వివరించారు.

Andhra Pradesh: వీడియో...కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్‌.. ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు

Arun Charagonda

కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందగా 18 మందికి గాయాలు అయ్యాయి. అనకాపల్లి - అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలింది రియాక్టర్‌. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Telangana: కల్తి కల్లు ఎఫెక్ట్, 8 మందికి అస్వస్థత, వికారాబాద్‌లో ఘటన, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

Arun Charagonda

కల్తీ కల్లు తాగి ఎనిమిది మందికి అస్వస్థత చోటు చేసుకుంది. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది అస్వస్థతకు గురికాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితమైన నీరు కలపడం వల్లే తాగిన వారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు.

Telangana High Court On Janwada Farmhouse: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రాకు ఊరట, నిబంధనల ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశం

Arun Charagonda

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు ఊరట లభించింది. జన్వాడ ఫాంహౌస్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై జీఓ 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశం ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్‌కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

KTR: నాకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదు, హైడ్రా పేరుతో బీఆర్ఎస్‌ నేతలపై బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూల్చరా?

Arun Charagonda

తను ఎలాంటి ఫామ్ హౌస్ లేదని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ఎఫ్‌టీఎల్‌లో కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని వాటిపై చర్యలు ఎవని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, వివేక్ వెంకటస్వామి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నారు

Hyderabad Rain Videos: హైదరాబాద్ వర్ష భీభత్సం వీడియోలు ఇవిగో, వరదలో వాహనాలతో పాటు కొట్టుకుపోయిన మనిషి మృతి

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది.పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది.

KTR On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం, 'చీప్ మినిస్టర్' అని మండిపడ్డ కేటీఆర్, రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరిక

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం అని, చీప్ మినిస్టర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమన్నారు.

Konda Surekha Birthday: ఏసీపీ నందిరాం నాయక్‌కు షోకాజ్ నోటీస్, ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న సీపీ, మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడంపై వివాదం

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పోలీస్ సిబ్బంది వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీని పై స్పందించిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా.. ఐదు రోజుల్లో జవాబు చెప్పాలని ఏసీపీ నంది రామ్ నాయక్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Advertisement

Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌ పై కేంద్ర అనుమతి అవసరం లేదు, హైకోర్టులో కేంద్రం కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై తమకు సమాచారం లేదని వెల్లడి

Arun Charagonda

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని, ఇందులో కేంద్రం అనుమతి అవసరం లేదని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Hyderabad: రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం, అడ్డంగా పట్టుబడిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి

Hazarath Reddy

రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ HMWSSB మణికొండ మేనేజర్ స్పూర్తి రెడ్డి.

TGSRTC: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాలం పాటు ఉచిత పాస్‌, ప్రసవం చేసిన స్టాఫ్‌ నర్స్‌కు ఏడాది పాటు ఉచిత ప్రయాణ సదుపాయం

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

Heavy Rains in Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, బుర్ఖా ధరించి బైక్ పై డేంజరస్ స్టంట్స్, ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Hazarath Reddy

బుర్ఖా ధరించి బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సామజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Heavy Inflows Into Hussain Sagar: వీడియో ఇదిగో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వానలతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.

Viral Video: వీడియో ఇదిగో, హాస్టల్‌లోకి అనుమతించని యాజమాన్యం, తండ్రి భుజంపైకి ఎక్కి కిటికీలొంచి అక్కల చేత రాఖీ కట్టించుకున్న బాలుడు

Hazarath Reddy

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు.అయితే అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది.

Nimmagadda Ramesh Kumar: ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

Hazarath Reddy

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

Advertisement
Advertisement