తెలంగాణ

Telangana Shocker: హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌లో దారుణ హత్య, స్కూల్ టీచర్‌ని చంపేసిన బార్బర్, నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని గొడవ,కత్తితో దాడి, స్పాట్ లోనే చనిపోయిన టీచర్, వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. ఎస్సార్ నగర్‌లోని హనుమ హాస్టల్‌లో మర్డర్ జరిగింది. ఓ కటింగ్ షాపులో పని చేసే గణేష్, ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణ హాస్టల్‌లో ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ రోజు మందు తాగుతూ నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG New Governor Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్‌ గా జిష్ణుదేవ్‌ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్‌ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌

Rudra

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు శనివారం రాత్రి తెలిపాయి. రాజస్థాన్‌ గవర్నర్‌ గా హరిబౌ కిషన్‌ రావు బాగ్డేను నియమించారు.

Telangana Assembly: ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9.15 వ‌ర‌కు కొన‌సాగిన తెలంగాణ అసెంబ్లీ, అంశాల వారీగా అధికార ప‌క్షానికి హ‌రీష్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

VNS

తెలంగాణ శాస‌న‌స‌భ (Telangana Assembly) సోమ‌వారానికి వాయిదా ప‌డింది. బ‌డ్జెట్‌పై (Telanagana Budget) సాధార‌ణ చ‌ర్చ ముగియ‌గానే స‌భ‌ను ఈ నెల 29వ తేదీకి స‌భ వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. 29వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభం కానుంది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ రాత్రి 9:15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది.

Flood At Bhadrachalam: ఒక్కసారిగా పెరిగిన గోదావ‌రి ఉధృతి, భ‌ద్రాచ‌లం వ‌ద్ద ప‌రివాహ‌క గ్రామాల్లో అప్ర‌మ‌త్తం, కొన‌సాగుతున్న రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌

VNS

భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం (Godavari Flood) అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వ‌ర‌ద ప్ర‌వాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది

Advertisement

Hyderabad Bonalu 2024: హైదరాబాద్ బోనాలు, పూనకాలు లోడింగ్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వైన్స్ షాపులు బంద్

Arun Charagonda

ఈ నెల 28న హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్దమైంది. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండగా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు బంద్ చుశారు. ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్‌లో ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 30 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో ఆదివారం, సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

Telangana Gurukul Jobs: గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థుల ఆందోళన,  పోలీస్ స్టేషన్‌లో దీక్ష, భిక్ష మెత్తుకుంటున్న అభ్యర్థులు.. వీరల్ వీడియోలు

Arun Charagonda

తెలంగాణ గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ బొరబండ పోలీస్ స్టేషన్లో కొంతమంది అభ్యర్థులను అరెస్ట్ చేయగా పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష చేస్తున్నారు. ఇక అశోక్ నగర్ సర్కిల్‌లో బిక్షమెత్తుకుంటున్న నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Kaleshwaram Project: బిగ్ బ్రేకింగ్...కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు ఆన్‌, నందిమేడారం,లక్ష్మీపూర్‌ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం

Arun Charagonda

ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్‌లు ప్రారంభమయ్యాయి. ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతలు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఆగస్టు రెండు వరకు కాళేశ్వరంలో పంప్‌హౌస్‌లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ డెడ్‌లైన్ పెట్టిన నేపథ్యంలో నందిమేడారం తో పాటు లక్ష్మి పూర్ లో పంప్స్ ఆన్ చేశారు అధికారులు.

Telangana Dogs attack: తెలంగాణలో మళ్లీ రెచ్చిపోయిన వీధి కుక్కలు, రాజన్న సిరిసిల్లలో వృద్ధుడిపై కుక్కల దాడి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

తెలంగాణలో మరోసారి కుక్కల దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల - గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో లక్ష్మణ్ అనే వృద్ధుడిపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Advertisement

KCR New Strategy: సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్? త్వరలో ఎన్నికలు రావడం ఖాయం? మళ్లీ అధికారం మనదేనని సంకేతాలు?

Arun Charagonda

తెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ది ప్రత్యేక శైలీ. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు సైలెంట్‌గా ఉంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి? కానీ ఆయన తీసుకునే వ్యూహాలు మాత్రం ఆ తర్వాత ఆలోచిస్తే దటీజ్ కేసీఆర్ అని అనిపించక తప్పదు.

Telangana Assembly: కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్, హరీష్ ఆకారం పెరిగింది తప్ప తెలివి పెరగలే?, కోమటిరెడ్డి వర్సెస్ హరీష్..డైలాగ్ వార్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడగా మాటల యుద్ధం నెలకొంది. హరీష్ వర్సెస్ శ్రీధర్ బాబు, హరీష్ వర్సెస్ భట్టి విక్రమార్క, హరీష్ రావు వర్సెస్ కోమటిరెడ్డి, హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది.

KTR Slams BJP: హైదరాబాద్‌ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్

Arun Charagonda

గత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్ ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది.. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Komatireddy Rajagopal Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యలా కోమటిరెడ్డి? మేం 6 కోట్లే ఇస్తున్నాం, అందుకే పార్టీ మారడం లేదు?సంచలన కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి?

Arun Charagonda

సీఎంగా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నేతగా పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ వైపు పాలన మరోవైపు పార్టీ పటిష్టత వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం పడిపోకుండా పార్టీ ఫిరాయింపులే టార్గెట్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Sangareddy Shocker: దుర్గా దేవి గుడిలో హుండీ దొంగతనం.. సంగారెడ్డిలో ఘటన (వీడియో వైరల్)

Rudra

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని దుర్గా దేవి గుడిలో గత బుధవారం హుండీని కొందరు దుండగులు దొంగిలించారు.

Wine Shops Close in Hyderabad: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ లో వైన్స్ బంద్.. ఎప్పుడంటే?

Rudra

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌ లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు బంద్ కానున్నాయి.

Telangana Rains Update: తెలంగాణ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ కు ఎల్లో అలర్ట్

Rudra

తెలంగాణలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు మినహాయిస్తే, గత ఏడు రోజులుగా వరుణదేవుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించాడు.

Shamirpet Road Accident: వీడియో ఇదిగో, ముగ్గురు ప్రాణాలను బలిగొన్న అతివేగం, రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వ‌చ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Advertisement

Telangana: దొంగతనానికి వెళ్లిన దొంగ. ఇంట్లో డబ్బులు దొరకలేదని రూ. 20 వారికే దానం చేసి వచ్చాడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ ముఖం కప్పుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో వెతికినా డబ్బులు దొరకలేదు. నిరాశతో అతను రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.

Telangana Shocker: ఖమ్మంలో దారుణం, టీచర్స్ వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముస్తఫానగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. టీచర్స్ వేధింపుల తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు డ్రోన్ విజువల్స్, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది,నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ,వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం పర్యటన సందర్భంగా డ్రోన్ విజువల్స్‌ని రిలీజ్ చేశారు. మేడిగడ్డ కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విజువల్స్ చూడాలని బీఆర్ఎస్ పార్టీ తన అఫిషియల్ ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

Narayanapet Police: డైరెక్టర్ కావాలనుకున్నాడు, కానీ దొంగగా మారి పోలీసులకే సవాల్, ఇంట్లో మనషులు ఉండగానే దొంగతనం అదే మనోడి స్పెషల్, కానీ చివరకు!

Arun Charagonda

సినిమా రంగుల ప్రపంచం. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల నుండి పట్నంకు వచ్చిన యువత ఎందరో. ఇందులో కొంతమందికి అవకాశాలు దక్కి ఇండస్ట్రీలో రాణిస్తుండగా మరికొంతమంది అవకాశాలు దక్కక, తిరిగి సొంత ఊరికి వెళ్లలేక పక్క దారి పడుతున్నారు.

Advertisement
Advertisement