తెలంగాణ
Medaram Jathara: మేడారం జాతర ప్రారంభం సందర్భంగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదామంటూ ట్వీట్
Hazarath Reddyగిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం
RTC Drivers Protest: కండక్టర్ కోసం హారన్ కొట్టిన బస్సు డ్రైవర్‌పై ప్యాసింజర్లు దాడి, బస్సులు నిలిపివేసి నిరసన చేపట్టిన డ్రైవర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆర్మూర్ బస్టాండ్‌ బయట కండక్టర్ కోసం హారన్ కొట్టిన డ్రైవర్‌పై కొందరు ప్యాసింజర్లు దాడి చేశారని బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన చేపట్టారు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత అంటూ నినాదాలు చేశారు.
Telangana: వీడియో ఇదిగో, 17 ఏళ్ల తరువాత దుబాయ్ జైలు నుంచి విడుదల, కుటుంబ సభ్యులను చూడగానే ఒక్కసారిగా భావోద్వేగ క్షణాలు ఎలా కనిపించాయంటే..
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కేటీఆర్ తనయుడు కేటీఆర్‌ చొరవతో నేపాల్ వాచ్ మెన్ హత్య కేసులో దుబాయ్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు నేడు జైలు నుంచి విడుదలైన సంగతి విదితమే. వారు దుబాయ్‌ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
Telangana: దుబాయ్ జైలు నుంచి ఐదుగురు తెలంగాణవాసుల విడుద‌ల‌, 18 ఏళ్ల జైలు జీవితం త‌ర్వాత కేటీఆర్ చొర‌వ‌తో స్వ‌దేశానికి రాక‌
VNSదుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి (Telangana Residents released) లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్‌ కోర్టు (Dubai Court) శిక్షను 25 ఏళ్లకు పెంచింది.
Medaram Jathara: మేడారం మ‌హాజాత‌ర‌లో ఇవాళ తొలి ఘ‌ట్టం, క‌న్నెప‌ల్లి నుంచి వైభ‌వంగా గ‌ద్దెపైకి చేర‌నున్న‌ సార‌ల‌మ్మ‌
VNSకన్నెపల్లిలోని సారలమ్మ (Kannepalli) గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు.
AP, Telangana Rajyasabha MP Election: ఏపీ, తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం...రాజ్యసభ నుంచి టీడీపీ డకౌట్..
sajayaతెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రిటర్నింగ్ అధికారుల ప్రకటన అనంతరం మూడు సీట్లకు 3 నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బీఆర్ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవి ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.
ACB Raid in Hyd: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జ్యోతి లంచం కేసు, రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అనంతరం అరెస్ట్
Hazarath Reddyఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Hyderabad Traffic Police: మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా, ట్రాఫిక్ రూల్స్‌పై హైదరాబాద్ పోలీసుల సంధర్భోచిత ట్వీట్ ఇదిగో.,
Hazarath Reddyహైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్విటర్‌లో ట్రాఫిక్ రూల్స్ మీద ఓ ట్వీట్‌ చేశారు. రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ ఫేమస్ డైలాగ్ అందులో యాడ్ చేశారు. హెల్మెట్ లేని వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ.. మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’ అంటూ క్యాప్షన్ రాశారు.
Medaram Jathara 2024: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, కిటకిటలాడుతున్న బస్సులు, జన సంద్రమైన మేడారం, ప్రయాణికుల అసౌకర్యంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
Hazarath Reddyఒక మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు ఇబ్బందులు (inconvenience of RTC passengers) పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (TSRTC Managing Director Sajjanar) విజ్ఞప్తి చేశారు.
ACB Raids in Telangana: ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక లంచాలకు అలవాటు, రూ. 84 వేలు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌
Hazarath Reddyమాస‌బ్‌ట్యాంక్‌లోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కే జ‌గ జ్యోతి ఏసీబీ ధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు
Hyderabad: ఈ మహిళ పాలిట దేవుడైన డ్రైవర్, కదులుతున్న బస్సు ఎక్కుతూ కిందపడిన మహిళ, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyహైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు అకస్మాత్తుగా బయలుదేరింది.
Telangana Fire: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, మంటల ధాటికి పేలిన 5 గ్యాస్‌ సిలిండర్లు, అగ్నికి ఆహుతైన 50 పూరిళ్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకరీంనగర్‌లో జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు
Hyderabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడిన కారు, ఇద్దరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని నార్సింగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో ఐదుగురు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Car Caught Fire Video: కూకట్‌పల్లిలో కదులుతున్న కారులో మంటలు, భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ లో కారులో మంటలు చెలరేగాయి. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ దగ్గర కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్థానికులు భయంతో పరుగులు తీసారు. వెంటనే మరికొందరు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ACB Raid in Hyderabad: రూ. 84 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన మహిళా ఇంజినీర్.. ఆపై కన్నీళ్లపర్యంతం.. (వీడియో)
Rudraహైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తోన్న జగత్ జ్యోతి లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. పంటి చికిత్సకు వెళ్తే ఏకంగా ప్రాణం పోయింది.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడి ఇంట్లో విషాదం.. డెంటల్‌ దవాఖాన నిర్వాహకులపై కేసు.. అసలేం జరిగింది??
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. పంటి చికిత్స కోసం డెంటల్‌ దవాఖానకు వెళ్లిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, పెళ్ళి చేసుకుందామని నమ్మించి మైనర్ బాలికపై అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyఅమీర్‌పేటలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ (19) అనే నిందితుడు పటాన్‌చెరుకు చెందిన 16 ఏళ్ల యువతితో సోషల్‌ మీడియా ద్వారా స్నేహం చేశాడు. అతను ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేసి, కొన్ని నెలల క్రితం ఆమెను ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
TSPSC Group-1 Notification Released: 563 పోస్టులతో తెలంగాణ గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ విడుదల, వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది
Telangana Group-1 Notification Cancelled: తెలంగాణలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ, కొత్త నోటిఫికేషన్‌ త్వరలో జారీ చేసే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో గత ప్రభుత్వం 2022లో విడుదల చేసిన పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది.ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Hyderabad Fire Accident: షేక్‌పేట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆయిల్ లీకై ఒక్కసారిగా ఎగసిన మంటలు, పక్కనే ఉన్న దుకాణాలకు..
Hazarath Reddyహైదరాబాద్‌ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆయిల్ లీకై.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట వెల్డింగ్‌ షాప్‌లో మంటలు సంభవించాయి. దీంతో పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి