తెలంగాణ

TSPSC New Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి, నియామకానికి ఆమోదం తెలిపిన గవర్నర్‌ తమిళిసై, టీఎస్పీఎస్సీ కొత్త టీం ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి (Mahender Reddy)ని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. ఛైర్మన్‌ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా.. చివరికి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ రిపోర్ట్ గవర్నర్‌కు పంపగా.. ఆమె ఆమోదం తెలిపారు

Telangana: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌, TSPSC చైర్మన్‌గా ఎం.మహేందర్‌రెడ్డి నియామకం ఖరారైనట్లే

Hazarath Reddy

తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపింది.

Jubilee Hills Hit and Run Case: జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి, డ్రైవర్ పుల్లుగా తాగి స్నేహితులతో కలిసి..

Hazarath Reddy

హైదరాబాద్ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్‌ తెలిపారు. ఏ1గా కొవ్వూరి రిత్విక్‌రెడ్డి, వైష్ణవి (ఏ2), పొలుసాని లోకేశ్వర్‌రావు (ఏ3), బుల్లా అభిలాష్‌ (ఏ4), ఏ5గా అనికేత్‌ను పేర్కొన్నట్లు చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను ఏసీపీ వెల్లడించారు.

Excise CI Assaults Tribal Woman: గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఎక్సైజ్ సీఐ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్

Hazarath Reddy

వరంగల్ లో (Warangal) ఓ గిరిజన మహిళను ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్ర (Excise CI Ramesh Chandra) విచక్షణారహితంగా చితకబాదినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Telangana: ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో ACB అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

Bandla Ganesh on KCR: ఇంకో పది ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే, కేసీఆర్ సీఎం కావాలంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి పోటీ చేయాలి, బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణలో ఇంకో పది ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్లి పోటీ చేసి అవ్వాలని సలహా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Hyderabad: డీ మార్ట్ లో ఫ్రీ చాక్లెట్ తిన‌డం ఎలా? ఇన్ స్టా రీల్ చేసిన యువ‌కులు, అరెస్ట్ చేసిన షేక్ పేట పోలీసులు

VNS

సూపర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తినడంతోపాటు ‘ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా?’ (How to eat free Chocolate) అంటూ వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకులపై ఫిలింనగర్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

ACB Raids: ఇంటి నిండా కోట్ల కొద్దీ నోట్ల క‌ట్ట‌లు, కిలోల కొద్దీ బంగారం, ఖ‌రీదైన వాచ్ లు, హైద‌రాబాద్ లో ఏసీబీకి చిక్కిన అధికారి, తెల్ల‌వారుజామున అరెస్ట్

VNS

ప్రస్తుతం బాలకృష్ణ మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఏకకాలంగా 20 బృందాలు బాలకృష్ణ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. గురువారం తెల్లవారు జామువరకు ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 100 కోట్లకుపైగా స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. ఇంకా అధికారులు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.

Advertisement

Hyderabad: జీవో నెంబర్ 55ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిరసన, విద్యార్థిని జుట్టుపట్టి లాగిపడేసిన మహిళా పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసన చేస్తున్న విద్యార్దిని జుట్టును మహిళా కానిస్టేబుళ్లు లాగి పడేసారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Accident Caught on Camera: జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసు సీసీ పుటేజీ ఇదిగో, బైక్‌పై వెళ్తున్న బౌన్సర్‌ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే బౌన్సర్ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ బౌన్సర్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.

Bengaluru Boy Missing Case: బెంగుళూరులో మిస్సైన బాలుడు నాంపల్లి మెట్రో దగ్గర తేలాడు, సోషల్‌మీడియా సాయంతో బాలుడిని పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ (Boy Missing) కేసును పోలీసులు చేధించారు. మూడు రోజుల క్రితం కన్పించకుండా పోయిన అతడిని హైదరాబాద్‌ (Hyderabad)లో పోలీసులు గుర్తించారు. సోషల్‌మీడియా సాయంతో బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Telangana: నకిలీ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపిన తెలంగాణ డ్రగ్ అధికారులు, పలు చోట్ల కోట్ల రూపాయల విలువైన నకిలీ మందులు స్వాధీనం

Hazarath Reddy

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) లైసెన్స్ లేని, నకిలీ డ్రగ్స్‌పై ప్రత్యేక డ్రైవ్‌లను ప్రారంభించింది. బొల్లారం వద్ద రూ. 4.35 కోట్ల విలువైన క్యాన్సర్ నిరోధక మందులను స్వాధీనం చేసుకుంది. అలాగే చౌటుప్పల్ వద్ద రూ. 66 లక్షల విలువైన 'టిజానిడిన్ హైడ్రోక్లోరైడ్'ను సీజ్ చేసింది.గుమ్మడిదల వద్ద రూ. 50 లక్షల విలువైన డయాసెరిన్ ను పట్టుకుంది.

Advertisement

Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Telangana: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ? ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్‌ కమిటీ, మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు

Hazarath Reddy

TSPSC చైర్మన్‌గా రిటైర్డ్‌ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డిని (Retired Telangana DGP M. Mahender Reddy) నియమించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.ఈ పదవికి (TSPSC chairman post) మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది.

Telangana Free Electricity: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అది దాటితే బిల్లు కట్టాల్సిందే, ఫిబ్రవరి నెల నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ (Telangana Free Electricity) అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy) వెల్లడించారు.మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.

HYD DCP Son Dies of Heart Attack: గుండెపోటుతో హైదరాబాద్ డీసీపీ కొడుకు మృతి, కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్‌ (20) హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, రైతుబంధు రాలేదని చెప్పిన రైతు మీద కేసు, బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Hazarath Reddy

కొడంగల్ - కొత్తూరు గ్రామానికి చెందిన కోస్గి బాల్ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ రైతుబంధు లేదు, రుణమాఫీ అమలు కాలేదని మాట్లాడగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు నాయకులు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Dog Attack in Hyderabad: బాలుడిపై వీధి కుక్క దాడి, వరంగల్ - ఎల్బీ నగర్ ఏరియాలో పిల్లలపై ఐదు సార్లు కుక్కల దాడి జరిగిందని స్థానికులు ఆందోళన

Hazarath Reddy

వరంగల్ - ఎల్బీ నగర్ ఏరియాలో బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ మధ్యకాలంలో పిల్లలపై ఐదు సార్లు కుక్కల దాడి జరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Telangana Lok Sabha Elections 2024: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా తిప్పర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Fire Breaksout at Madhapur PS: మాదాపూర్‌ పీఎస్‌ లో మంటలు.. నిప్పురవ్వ ఎగిరి పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న ఓ సిలిండర్‌ పై పడటంతో ప్రమాదం

Rudra

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్‌ వెండర్స్‌ వద్ద తనిఖీల్లో సీజ్‌ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు.

Advertisement
Advertisement