తెలంగాణ
Telangana Election Results 2023: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం
Hazarath Reddyకామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు.
Telangana Elections Winning Candidates List: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మొత్తం లిస్టు ఇదిగో, హైదరాబాద్‌లో మెజార్టీ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకున్నదంటే..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది.
Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్, విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ..
Hazarath Reddyమంత్రి కేటీఆర్ ఫలితాలపై ట్వీట్ చేశారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ మేము దీన్ని ఒక అభ్యాసంగా తీసుకుంటాము. తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Telangana Election Results 2023: గోషామహల్‌లో రాజాసింగ్ ఘన విజయం, వరుసగా హ్యట్రిక్ కొట్టిన బీజేపీ నేత, అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ లో తన ఖాతాను తెరిచింది. గోషా మహల్ నుంచి రాజా సింగ్ ఘన విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఘన విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
Telangana Election Results 2023: ఆర్మూరు నుంచి బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఘన విజయం, మూడవస్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు.
Telangana Election Results 2023: అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్న ఎమ్మెల్యేలు వీళ్లే, ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో యశస్వినిరెడ్డి ఘన విజయం
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.ఈ ఎన్నికల ద్వారా వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు.
Telangana Election Results 2023: వీడియో ఇదిగో, డికె శివకుమార్‌తో కలిసి సంబరాలు జరుపుకున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోనుందని వెల్లడవుతున్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు డీకే శివకుమార్‌ తదితరులతో కలిసి రాష్ట్ర ఎన్నికల్లో ఆధిక్యం సాధించినందుకు సంబరాలు జరుపుకున్నారు.
Telangana Election Results 2023: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు షాక్, అనూహ్యంగా లీడింగ్‌లోకి వచ్చిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి
Hazarath Reddyకామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ మూడో స్థానానికి కేసీఆర్ పడిపోయారు.కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు
Telangana Election Results 2023: కొడంగల్‌లో 32,800 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి ఘన విజయం, దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి, ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే..
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. ఇక దుబ్బాకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.
Telangana Election Results 2023: ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీళ్లే, మూడుకు చేరిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సంఖ్య, చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి ఘన విజయం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyచార్మినార్‌లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్‌ జుల్ఫికర్‌ అలీ గెలిచారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహుదూర్ పురా నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 88 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, పోటీ చేసిన 8 చోట్ల జనసేనకు ఘోర పరాభవం
Hazarath Reddyతెలంగాణలో తొలిసారి పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన (Janasena) ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్నిస్థానాల్లోనూ గ్లాస్‌ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో జనసేన బిగ్‌ షాక్‌, పోటీ చేసిన 8 స్థానాల్లో కనపడని ప్రభావం, దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyపవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్‌ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు.
Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్, శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అంటూ..
Hazarath Reddyటీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు.
Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు, రేవంత్ రెడ్డితో భేటీ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార బీఆర్‌ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.వీడియో ఇదిగో..
Telangana Election Results 2023: వీడియో ఇదిగో, వెలవెలబోతున్న సీఎం క్యాంపు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తున్న ఫలితాలు
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం బోసి పోయింది. నేతలు ఎవరు రాలేదు. కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతోనే రాలేదని సమాచారం. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు ప్రస్తుతం సీఎం నివాసంలో ఉన్నారు
Telangana Election Results 2023: బీఆర్ఎస్ మంత్రులకు షాకిస్తున్న ఎన్నికల ఫలితాలు, ఓటమి దిశగా ఏడుగురు మంత్రులు, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇక, ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు కీలక నేతలు భారీ వెనుకంజలో ఉ‍న్నారు.
Telangana Election Results 2023: తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌, అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం, కొనసాగుతున్న కౌంటింగ్
Hazarath Reddyతెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకు వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లును కైవసం చేసుకుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య తన సమీప ప్రత్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై గెలుపొందారు.
Telangana Election Results 2023: వీడియో ఇదిగో, సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్
Hazarath Reddyడిసెంబరు 3 ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతుండగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ అధినేత రేవంత్ రెడ్డిలతో కూడిన పోస్టర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు పాలో అభిషేకం చేశారు
Telangana Election Results 2023: తెలంగాణలో గెలుపు దిశగా కాంగ్రెస్.. ఎమ్మెల్యేల తరలింపు కోసం తాజ్ కృష్ణలో సిద్ధంగా ట్రావెల్స్ బస్సులు.. వీడియోతో
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తిగా సాగుతున్నది. లీడ్ ఫలితాలనుబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Four States Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ జోరు.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ హవా
Rudraమధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 146 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే లీడ్ లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు 83 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.