తెలంగాణ
Telangana Elections 2023: వీడియో ఇదిగో, అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలపై కేసు బుక్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పోలీస్ అధికారిని దూషించారనే ఆరోపణల్లో భాగంగా ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ కావడం కూడా తెలిసిందే.
PM Modi Telangana Tour Schedule: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదిగో, ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా కీలకదశకు చేరుకుంది. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం కోసం క్యూ కడుతున్నారు.
Hyderabad: గత నెల రోజుల నుంచి హాస్టల్లో నీళ్లు రావడం లేదంటూ రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థులు, అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు
Hazarath Reddyలేడిస్ హాస్టల్‌లో గత నెల రోజులుగా సరైన నీటి సదుపాయం లేదని, కళాశాల సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అబిడ్స్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.వీడియోలు ఇవిగో..
Telugu States Weather: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే మూడురోజుల పాటూ అక్కడక్కడా వానలు పడుతాయని అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రాబోయే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఇదే!
VNSమూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో (GHMC) ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
Sangareddy Fire Accident: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణాపాయం (వీడియో ఇదుగో..)
VNSసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పాశమైలారం పారిశ్రామికవాడలో ఎంఎస్‌ఎన్‌ (MSN) రెండో యూనిట్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. MSN పరిశ్రమలో స్టోరేజీ విభాగంలో రసాయన డ్రమ్ములు నిల్వ ఉంచారు. కెమికల్స్ నిల్వ ఉంచిన డ్రమ్ములు పేలడంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి.
Telangana Assembly Election 2023: కాంగ్రెస్‌కు వచ్చేది 20 సీట్లే, భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు, మధిర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌
Hazarath Reddyతెలంగాణ ఎన్నికలు మరో 10 రోజుల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది.అధికార బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ లతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా మధిరలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.
TS Weather Alert: తెలంగాణలో మూడు రోజులు వర్షాలే.. వాతావరణ శాఖ అలర్ట్‌
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Vivek Venkataswamy: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంటిపై ఐటీ దాడులు.. కొనసాగుతున్న తనిఖీలు.. వివేక్ అనుచరుల ఇళ్లలోనూ దాడులు
Rudraచెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఈ తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులకు దిగారు. ఉదయం ఐదున్నర గంటలకు మంచిర్యాల లోని ఆయన ఇంటికి చేరుకున్న అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆయన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మరిన్ని విషయాలు వీడియోలో చూడండి.
Telangana Stadium Wall Collapse Video: తెలంగాణలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం, ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు
Hazarath Reddyమొయినాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడినట్లు అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికి తీశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు
Telangana Assembly Elections 2023: హంగ్ లేదు బొంగు లేదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ఉచ్చులో తెలంగాణ ప్రజలు పడరని తెలిపిన హరీష్ రావు, పీటిఐకి ఇచ్చిన ఇంటర్యూలో తెలంగాణ మంత్రి
Hazarath Reddyగత పదేళ్లలో పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరును చూసి ప్రజల్లో అంచనాలు మరింత పెరిగాయని, ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌. రావు సోమవారం తెలిపారు.
Nizamabad: నిజామాబాద్ అర్బ‌న్ నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్ధి ఆత్మ‌హ‌త్య‌, ఇంట్లో ఉరేసుకొని చ‌నిపోయిన కన్న‌య్య‌, ఎన్నిక‌ల్లో రోటీమేక‌ర్ గుర్తుపై పోటి
VNSనిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి (Independent Candidate) కన్నయ్య గౌడ్ (Kannaiah Goud) ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని సాయినగర్‌లో తన ఇంట్లో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కన్నయ్య గౌడ్‌కు ఎన్నికల కమిషన్ రోటీ మేకర్ గుర్తును కేటాయించింది
Babu Mohan Son Joins BRS: బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్‌కు షాక్...బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాబూ మోహన్ కొడుకు ఉదయ్ బాబు..
ahanaనటుడు, తెలంగాణలోని ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబు మోహన్ ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారు.
BJP Telangana Manifesto: కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు, బీసీని ముఖ్యమంత్రి, వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్ల హామీ..బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు ఇవే..
ahanaహైదరాబాద్‌లోని నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ మేనిఫెస్టో విడుదల చేసింది.
CM KCR On Revanth Reddy: రేవంత్ రెడ్డి కాదు..పిచ్చి కుక్క..రైఫిల్ రెడ్డి..ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు - చేర్యాల సభలో సీఎం కేసీఆర్ ఫైర్
ahanaచేర్యాల సభలో రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఫైర్‌. ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు. ఉద్యమ సమయంలో రైఫిల్‌ పట్టుకొని తిరిగాడు. అందుకే ఆయనకు రైఫిల్‌రెడ్డి అని పేరు పెట్టాం.
Amith Sha In Telangana: దళితబంధులో BRS ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు..నల్గోండలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
ahanaకాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు కుటుంబ పార్టీలు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. స్మార్ట్‌ సిటీస్‌ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. -అమిత్‌ షా
Vijayashanthi: కేసీఆర్ నాటిన మొక్క బీజేపీ పార్టీలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుండి తీసేసింది, ఈటెలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
ahanaఈటల రాజేందర్‌ని ఉద్దేశించి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాటిన ఒక మొక్క బీజేపీ పార్టీని నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
MLC Kavitha Viral Video: కల్వకుంట్ల కవితకు అస్వస్థత...ప్రచార వాహనం పైనే కళ్లుతిరిగి పడిపోయిన కవిత...వీడియో వైరల్..
ahanaబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయ్యారు. అంతేకాదు ప్రచార వాహనంపైనే ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత రోడ్‌ షోలో పాల్గొన్నారు.
Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?
Rudraవాడకంలో లేని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.
KTR Comments on Azharuddin: ఇండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయం, అజారుద్దీన్ తో గల్లీ క్రికెట్ ఆడండి కానీ, ఓటు మాత్రం బీఆర్ఎస్ వేయండి, రోడ్ షో లో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్
VNSవిరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచ‌రీ కొట్టిండు మ‌నం కూడా కొడుదామా..? ష‌మీ (Shami) హ్యాట్రిక్ తీసిండు.. మ‌నం కూడా హ్యాట్రిక్ కొడుదామా..? వంద శాతం కొడుదామా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.
BJP Manifesto: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో లీక్, అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, ఇంకా ఏ యే ఉన్నాయంటే!
VNSతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం ఇలా అన్ని అంశాల్లో వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టో విషయంలోనూ అదే సూత్రం పాటించింది. ఓటర్లను ఆకట్టుకునే విధంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.